
Therachaapa Team Celebrates Grand Pre-Release Event Ahead of April 17 Release
The much-awaited film “Therachaapa”, produced by Kailash Durgam under the Ananya Creations banner and directed by Joel George, is all set for a grand theatrical release on April 17. Featuring Naveenraj sankarapu, Pooja Suhasini, and Sreelu in lead roles, the film also stars Rajeev Kanakala, Prithviraj, Jagadeesh Prathap Bandari, Fish Venkat, Jabardasth Ashok, Nagi, Apparao, Rising Raju, Rajesh Bhupathi, Naga Vamsi, Srinivas Nesa, Chandra, and many others in pivotal roles.
With cinematography by Azeem and Venkat, music composed by Prajal Krish, and background score by M.L. Raja, the film has already garnered strong buzz through its songs, teaser, and trailer, all of which have received an overwhelming response. Editing is handled by Raju Bodasingi, while choreography is by Jeevan George.
Ahead of its release, the team organized a grand pre-release event, attended by the cast, crew, and prominent guests from the industry.
Speaking at the event, actor Rajeev Kanakala appreciated producer Kailash Durgam for his dedication and belief in the project. He highlighted the physical challenges faced during the shoot, especially filming barefoot on the scorching beach, and praised Naveen Raj for his commitment and emotional dedication to the film, which he has dedicated to his father.
Actor Prithviraj shared that despite acting in many films, “Therachaapa” holds a special place in his heart, as it portrays the lives of fishermen in a realistic manner. He also expressed happiness about sharing screen space with his daughter Sreelu.
Actor Naga Mahesh mentioned that his role in the film is unique and will present him in a new light, while Jagadeesh (Pushpa fame) spoke about his bond with Naveen Raj and the team’s collective hard work.
Producer Kailash Durgam turned emotional while thanking his family for their support, stating that he was driven purely by his love for cinema and belief in the story. Director Joel George expressed gratitude to the cast, crew, media, and audience, acknowledging the immense effort put in by the entire team.
Lead actor Naveenraj sankarapu shared that the team spent several days on the seashore understanding and living the lives of fishermen to bring authenticity to the film. He emotionally dedicated the film to his father and expressed confidence that audiences will support and appreciate their effort.
Actresses Sreelu and Pooja Suhasini also expressed their happiness about being part of the film and spoke about the challenging yet memorable experience of shooting under harsh conditions by the sea.
Several other team members, including music director M.L. Raja, DOPs, and supporting actors, also shared their experiences and extended their wishes for the film’s success.
Blending strong emotions with realistic storytelling, “Therachaapa” is expected to strike a chord with audiences when it hits theatres on April 17.
Cast:
Naveenraj sankarapu , Pooja Suhasini, Sreelu, Jagadeesh Prathap Bandari, Rajeev Kanakala, Rocky, Naga Mahesh, Prithviraj, Fish Venkat, Jabardasth Ashok, Jabardasth Nagi, Jabardasth Apparao, Rising Raju, Rajesh Bhupathi, Srinivas Nesa, Mayam Chandra, Sakaram, and others.
Technical Crew:
Production House: Ananya Creations
Producer: Kailash Durgam
Story, Screenplay & Direction: Joel George
Cinematography: Azeem & Venkat
Music Director: Prajal Krish
Background Score: M.L. Raja
Editor: Raju Bodasingi
Dialogues: Joel George, Midde Manoj Kumar
Lyrics: Midde Manoj Kumar
Costume Designer: Boddu Amulya
Choreography: Jeevan George
PRO: Madhu VR
Digital Media: Digital Dukanam
అట్టహాసంగా తెరచాప చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ – ఏప్రిల్ 17న విడుదల
అనన్య క్రియేషన్స్ బ్యానర్ పై కైలాష్ దుర్గం నిర్మాతగా తెరకెక్కుతున్న చిత్రం ‘తెరచాప’. జోయల్ జార్జ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో నవీన్ రాజ్ శంకరపు, పూజ సుహాసిని, శ్రీలు ముఖ్యపాత్రలో నటించగా రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్, జగదీష్ ప్రతాప్ బండారి, ఫిష్ వెంకట్, జబర్దస్త్ అశోక్, నాగి, అప్పారావు, రైసింగ్ రాజు, రాజేష్ భూపతి, నాగ వంశీ, శ్రీనివాస్ నేస, చంద్ర తదితరులు కీలకపాత్రలు పోషించారు. అజీమ్, వెంకట్ సినిమాటోగ్రాఫర్లుగా పనిచేసిన ఈ చిత్రానికి ప్రజల్ క్రిష్, ఎం.ఎల్ రాజా సంగీతాన్ని అందించారు. రాజు బొడసింగి ఎడిటింగ్ చేయగా జీవన్ జార్జ్ కోరియోగ్రఫీ చేశారు. ప్రమోషన్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సాంగ్స్, టీజర్, ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఏప్రిల్ 17వ తేదీన ఈ సినిమా విడుదల కానున్న సందర్భంగా చిత్ర బృందం అట్టహాసంగా ప్రీ రిలీజ్ వేడుక చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నటుడు రాజీవ్ కనకాల మాట్లాడుతూ… “ఈ కార్యక్రమానికి వచ్చిన మీడియా మిత్రులకు, అతిధులకు, ప్రేక్షకులకు అందరికీ నా నమస్కారం. నిర్మాత కైలాష్ గారు ఎంతో కష్టపడి తన సొంతదైన డబ్బును మా పై, జార్జ్ పై, అలాగే నవీన్ పై ఉన్న నమ్మకంతో సినిమా చేశారు. ఈ సినిమాలో నాతోపాటు ఎందరో సీనియర్ నటులు నటించారు. అలాగే కొత్త వారు కూడా నటించారు. మండుట ఎండలో సముద్ర తీరాన ఇసకలో చెప్పులు లేకుండా నటించడం అనేది ఎంతో కష్టమైన పరిస్థితి. అటువంటి పరిస్థితులలో కూడా నవీన్ రాజ్ చాలా కష్టపడి నటించారు. శారీరకంగానే కాకుండా మానసిక ఒత్తుడులు ఎన్ని ఉన్నా కూడా ఆయన వాటిని ఎదిరించి నిలబడ్డారు. అంత కష్టపడి నటించినా ఈ సినిమాను తన తండ్రికి అంకితం చేస్తున్నాను అని నాతో అన్నప్పుడు నేను ఎంతో ఆనందపడ్డాను. ఇటువంటి ఇవ్వాలని ప్రేక్షకులంతా ఎంకరేజ్ చేసి ఈ సినిమాను గణ విజయం చేస్తారని నమ్ముతున్నాను” అన్నారు.
30 ఇయర్స్ పృథ్వీరాజ్ మాట్లాడుతూ… “నేను ఇప్పటికీ ఎన్నో చిత్రంలో నటించినప్పటికీ ఈ సినిమా నాకు ప్రత్యేకమైనది. ఈ చిత్ర బంధం అంతా కలిసి ఎంతో కష్టపడి సముద్ర తీరాన మత్స్యకారుల జీవితాలు ఎలా ఉంటాయో ప్రజలందరికీ తెలిసే విధంగా చేశారు. నా కూతురు శ్రీలు ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషించడం అలాగే నేను ఆ సినిమాలో భాగం కావడం నాకు ఈ సినిమా పట్ల మరింత ప్రత్యేకతను పెంచింది. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.
నటుడు నాగ మహేష్ మాట్లాడుతూ… “ఈ సినిమాలో నా పాత్ర కాస్త ప్రత్యేకమైనది. ఇప్పటివరకు ఒక విధంగా చూసిన నన్ను ఈ సినిమాలో మరొక విధంగా చూడబోతున్నారు. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించినప్పుడు ఎంతో ఎమోషనల్ గా నవీన్ ఫీలయ్యారు. సినిమా మంచి విజయం సాధించాలని, అందరూ దానికి తోడ్పడాలని కోరుకుంటున్నాను” అన్నారు.
పుష్ప జగదీష్ మాట్లాడుతూ… “నవీన్ తో నాకు ఇప్పటినుండో స్నేహబంధం ఉంది. ఆ స్నేహం వల్ల నేను ఈ చిత్రంలో నటించిన కాదు, ఈ సినిమాలో నా పాత్రకు ప్రాముఖ్యత ఉంది కాబట్టి నటించాను. ఈ సినిమా కోసం చిత్ర బంధం అంతా ఎంతో కష్టపడి పని చేశారు. సినిమా బాగా ప్రేక్షకుల అభినందనలు పొందాలని కోరుకుంటున్నాను” అన్నారు.
రామ్కీ మాట్లాడుతూ… “ఈ చిత్రానికి ఎంత కష్టపడ్డారు ఇప్పటికే నాకు అర్థమైంది. సినిమా కోసం ఛాంబర్ నుండి ఎటువంటి సహాయం కావాలన్నా కూడా నేను అందుబాటులో ఉండి చేస్తాను. అలాగే సినిమా మంచి హిట్ కావాలని కోరుతున్నాను” అన్నారు.
దర్శకుడు సముద్ర గారు మాట్లాడుతూ… “సముద్రతీతంగా అటువంటి పరిస్థితులలో ఒక సినిమా తీయడం అనేది ఎంతో కష్టమైన విషయం. అటువంటి సినిమాను ఈ చిత్రం బృందం అంతా కలిసి ఎంతో పట్టుదలతో పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అందరూ వీరిని ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాను” అన్నారు.
నిర్మాత కైలాష్ దుర్గం మాట్లాడుతూ… “నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం. కేవలం కథ నచ్చి ఈ సినిమా చేశాను. ఒక సినిమా చేయాలి అంటే నిర్మాతకు చాలా బలమైన సంకల్పంతో పాటు కుటుంబ బలం కూడా ఉండాలి. నాకు అలా బలంగా నిలబడిన నా కుటుంబానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా సినిమాను ప్రేక్షకులంతా ఆదరించి, ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాను” అంటూ ఎమోషనల్ అయ్యారు.
దర్శకుడు జార్జ్ మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. నాకోసం ఎంతో కష్టపడి మా సినిమాలో ప్రేక్షకులు మీడియా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను ముందుగా ఈ సినిమా గురించి థాంక్స్ చెప్పుకోవాల్సింది మా నిర్మాతకు. మా చిత్ర బంధం అంతా కలిసి ఈ సినిమా కోసం ఎంతగానో కష్టపడ్డాను. సీనియర్ నటులు అందరూ మాకు ఎంతో సహకరించారు. సినిమాకు మంచి ప్రేక్షకుల ఆదరణ కలగాలని కోరుకుంటున్నాను” అన్నారు.
నటి శ్రీలు మాట్లాడుతూ… “సినిమాలో నటించడం నాకు చాలా సంతోషంగా ఉంది. సముద్ర తీరాన అక్కడ ఉండే మత్స్యకారుల జీవన శైలిలో నటించడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఈ సినిమా నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది” అన్నారు.
నటి పూజా సుహాసిని మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. నాకు ఈ చిత్రంలో హీరోయిన్గా అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమా కోసం మేము ఎంతో కష్టపడి సముద్ర తీరాన మొన్నటి ఎండలో పనిచేశాము. అందరికీ ఈ సినిమా నచ్చుతుందని అనుకుంటున్నాను. అందరూ మా సినిమాకు మంచి హిట్ అందించండి” అన్నారు.
హీరో నవీన్‌రాజ్ శంకరాపు మాట్లాడుతూ… ” అందరికీ నమస్కారం. నాకు ఈ తెరచాప సినిమాలో నటించేందుకు అవకాశం ఇచ్చిన మా దర్శక నిర్మాతలకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఈ సినిమా కోసం మేము సముద్ర తీరాన ఎన్నో రోజులు ఎంతో కష్టపడి అక్కడ బ్రతికే మత్స్యకారుల జీవితాలను అర్థం చేసుకొని వారిలో ఒకరిగా కలిసిపోయి చిత్రీకరించాము. ఎంతోమంది ఎన్నో కలలు కని సినిమా తీసినట్లే మేము కూడా చేశాము. మా సినిమాను ప్రేక్షకులు అంతా ఆదరించి మంచి విజయం సాధించేందుకు తోడ్పడుతారని కోరుకుంటున్నాను. ఈ సినిమా మా నాన్నగారికి అంకితం చేస్తున్నాను. నేను ఎప్పుడు సినిమా చేసినా కూడా ఇలాగే ఎక్కువమంది ఆర్టిస్టులతో కలిసి పని చేసేందుకు ఇష్టపడతాను. ఆ విధంగా ఎక్కువ మందితో పనిచేయవచ్చు అలాగే ఇంకో మందికి నా ద్వారా చిన్న సహాయం అందుతుందని ఆశ. ఈ నెల 17వ తేదీన మీ ముందుకు రాకుండా మా తెరచాప చిత్రాన్ని ప్రేక్షకులు అందరూ ఆదరించి మంచి విజయాన్ని అందిస్తారని కోరుకుంటున్నాను” అన్నారు.
ఈ సందర్భంగా 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న తెరచాప చిత్రం గురించి సంగీత దర్శకుడు ఎంఎల్ రాజా, చిత్ర డిఓపిలు, జబర్దస్త్ నటులు రైసింగ్ రాజు, నాగి, అశోక్, నటుడు రాజేష్ తదితరులు మాట్లాడారు.
తారాగణం: నవీన్‌రాజ్ శంకరాపు, పూజా సుహాసిని, శ్రీలు, జగదీష్ ప్రతాప్ బండారి, రాజీవ్ కనకాల, రాకీ, నాగ మహేష్, పృధ్వీ రాజ్, ఫిష్ వెంకట్, అశోక్ జబర్దస్త్, నాగి జబర్దస్త్, అప్పారావు జబర్దస్త్, రైజింగ్ రాజు, రాజేష్ భూపతి, శ్రీనివాస్ నేస, మాయమచంద్ర, సకారం తదితరులు.
సాంకేతిక సిబ్బంది:
ప్రొడక్షన్ హౌస్: అనన్య క్రియేషన్స్
నిర్మాత: కైలాష్ దుర్గం
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: జోయెల్ జార్జ్
సినిమాటోగ్రఫీ: అజీమ్ & వెంకట్
సంగీత దర్శకుడు: ప్రజాల్ క్రిష్
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: ఎంఎల్ రాజా
ఎడిటింగ్: రాజు బోడసింగి
డైలాగ్స్: జోయెల్ జార్జ్, మిద్దె మనోజ్ కుమార్ సాహిత్యం: మిద్దె మనోజ్ కుమార్
కాస్ట్యూమ్ డిజైనర్: బొడ్డు అమూల్య
కొరియోగ్రఫీ: జీవన్ జార్జ్
PRO: మధు VR
డిజిటల్ మీడియా: డిజిటల్ దుకాణం
