కానిస్టేబుల్ కనకం ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రాజెక్ట్.. భారీ బడ్జెట్, హై ప్రొడక్షన్

That shows the depth of Dokka Seethammacharacter – Murali Mohan
Senior actor Murali Mohan and actress Amani play the lead roles in the upcoming film “Andhrula Annapurna Dokka Seethamma”, produced by Valluri Rambabu and Matta Srinivas under the Usha Rani Movies banner. The film is directed by T.V. Ravi Narayan, with Rahul Srivatsav handling cinematography, Karthik Kodakandla composing the music, and M. Ravi Kumar serving as art director. The title poster released earlier drew positive attention, and now, to mark Murali Mohan’s birthday, a special poster and glimpse have been unveiled.
*At the event, Murali Mohan shared his thoughts:* “I usually celebrate my birthdays in ashrams, among the differently abled, the elderly, and orphans. Today, I was scheduled to visit a home for the visually impaired, but the Dokka Seethamma team requested me to come over for half an hour, so I obliged. I’m grateful to these producers, though they’re small-scale, for celebrating my birthday in such a meaningful way.
I have fond memories of my association with Relangi Garu. Rama Satyanarayana Garu has always stood by many filmmakers. Many have wished to make a film about Dokka Seethamma Garu. Even Cotton Dora Garu once praised her. When invited to London to be felicitated, Dokka Seethamma declined, saying, ‘If I go there, who will feed the hungry here?’ That shows the depth of her character. It brings me immense joy to be part of a film that portrays such a great soul.
In today’s era dominated by commercial cinema, it’s heartening that people like Rambabu Garu and Ravi Narayan Garu are coming forward with stories like this. Films like Dokka Seethamma truly deserve big success.”
*Director T.V. Ravi Narayan stated:* “Wishing Murali Mohan Garu, my very first hero, a happy birthday. From the moment he suggested I take up this story, he has constantly encouraged me. This film has reached where it is today because of his support, and I’ll always be grateful.”
*Dasanna said:* “The first look of Murali Mohan Garu from Dokka Seethamma looks fantastic. I pray for his health and well-being.”
*Music director Karthik remarked:* “It’s an honor to compose music for a film starring someone as esteemed as Murali Mohan Garu. Dokka Seethamma embodies Dharma, and when I think of Dharma, I think of Murali Mohan Garu. I thank everyone who made it possible for me to be a part of this noble project.”
*Shiva Nagu shared:* “Murali Mohan Garu is about to achieve another success with Dokka Seethamma. I’ll soon be directing him in a future film. He is a phenomenal actor.”
*Lion Sai Venkat noted:* “Murali Mohan Garu has succeeded in every field he has entered. Such people are rare. He always wishes ‘Sarve Jana Sukhino Bhavantu’ (May all be happy), which I believe is why he remains so healthy and energetic.”
*Renowned producer Rama Satyanarayana said:* “At a time when films are mostly made with a formula of four songs and a few fights, it’s refreshing to see a meaningful film based on the life of Dokka Seethamma Garu. We need more films like this. I wish Murali Mohan Garu great success with this venture.”
*Producer Bekkem Venugopal stated:* “Since the beginning of my career, Murali Mohan Garu has been a pillar of support and a source of inspiration. He has achieved greatness in cinema, business, and politics. I hope Dokka Seethamma adds yet another feather to his cap.”
*Relangi Narasimha Rao said:* “We’ve heard so much about Dokka Seethamma since our school days. I’m thrilled to see a film being made about her. Since my entry into the industry, Murali Mohan Garu has always supported me. When people speak of goodness in the industry, they think of Superstar Krishna and Murali Mohan. Our guru Dasari Garu even affectionately called him ‘Murali’ as if he were his own son.”
Cast: Murali Mohan, Amani, Rajamouli, Akella, Jabardasth Apparao, Shrilu, Chinababu, Kakinada Prasad, Jabardasth Bobby, Tummalapalli Ramasatyanarayana, Ramesh, Keshavi, Pittal Dora, Koorakula Chinna, TV9 Sathya, D. Veerababu, and others.
Technical Crew:
Banner: Usha Rani Movies
Producer: Valluri Rambabu
Director: T.V. Ravi Narayan
Music Director: Karthik Kodakandla
Editor: Srikrishna
Cinematographer: Rahul Srivatsav
Art Director: M. Ravi Kumar
Lyrics: Chandra Bose, Vijay Kumar, Veeru
Choreography: Suchitra Chandra Bose
PRO: Sai Satish
*‘డొక్కా సీతమ్మ’ లాంటి సినిమాలు పెద్ద విజయాన్ని సాధించాలి : మురళీ మోహన్*
మురళీ మోహన్, ఆమని ప్రధాన పాత్రధారులుగా ఉషారాణి మూవీస్ బ్యానర్ మీద వల్లూరి రాంబాబు , మట్టా శ్రీనివాస్ నిర్మాతలుగా టి.వి. రవి నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ’. ఈ చిత్రానికి రాహుల్ శ్రీవాత్సవ్ కెమెరామెన్‌గా పని చేశారు. కార్తిక్ కోడకండ్ల సంగీతాన్ని అందించారు. ఎం. రవి కుమార్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేశారు. గతంలో రిలీజ్ చేసిన మూవీ టైటిల్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. ఇక తాజాగా మురళీ మోహన్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రం నుంచి స్పెషల్ పోస్టర్‌ను, గ్లింప్స్ నీ రిలీజ్ చేశారు. ఈ క్రమంలో నిర్వహించిన కార్యక్రమంలో..
*మురళీ మోహన్ మాట్లాడుతూ* .. ‘నా పుట్టిన రోజుని ఎప్పుడూ కూడా ఆశ్రమాల్లో చేసుకుంటూ ఉంటాను. దివ్యాంగులు, వృద్దాశ్రమాలు, అనాథాశ్రమాల్లో సెలెబ్రేట్ చేసుకుంటూ ఉంటాను. ఈ రోజు కూడా అంధుల ఆశ్రమానికి వెళ్లాల్సి ఉంది. కానీ ఓ అరగంట వచ్చి వెళ్లండని ‘డొక్కా సీతమ్మ’ టీం పిలిచింది. అందుకే ఇలా వచ్చాను. చిన్న నిర్మాతలే అయినా నా బర్త్ డేను ఇలా సెలెబ్రేట్ చేస్తున్నందుకు థాంక్స్. రేలంగి గారితో నా అనుబంధం మరువలేనిది. రామ సత్యనారాయణ గారు ఎంతో మంది నిర్మాతలకు అండగా నిలుస్తుంటారు. డొక్కా సీతమ్మ గారి మీద సినిమా తీయాలని చాలా మంది అనుకున్నారు. కాటన్ దొర గారు సైతం డొక్కా సీతమ్మ గారిని పొగిడారు. సన్మానం చేస్తామని లండన్‌కు రమ్మని పిలిస్తే సైతం డొక్కా సీతమ్మ గారు వెళ్లలేదు. ‘నేను అక్కడికి వస్తే ఇక్కడ వారి ఆకలి ఎవరు తీరుస్తారు?’ అని డొక్కా సీతమ్మ గారు నిరాకరించారు. అలాంటి ఓ గొప్ప మనిషి మీద సినిమాను తీస్తుండటం ఆనందంగా ఉంది. ఇప్పుడు అంతా కమర్షియల్‌గా మారింది. అలాంటి టైంలో రాంబాబు, రవి నారాయణ గారు ముందుకు వచ్చారు. ఇలాంటి చిత్రాలు పెద్ద విజయాన్ని సాధించాలి’ అని అన్నారు.
*దర్శకుడు టి.వి. రవి నారాయణ్ మాట్లాడుతూ* .. ‘నా మొదటి హీరో మురళీ మోహన్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఈ కథను చేయాలని మురళీ మోహన్ గారు చెప్పిన క్షణం నుంచీ ఇప్పటి వరకు ఆయన నన్ను ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. ఆయన వల్లే ఈ మూవీ ఇక్కడి వరకు వచ్చింది. ఆయన సహకారాన్ని ఎప్పటికీ మర్చిపోలేను’ అని అన్నారు.
*దాసన్న మాట్లాడుతూ* .. ‘డొక్కా సీతమ్మ సినిమా నుంచి రిలీజ్ చేసిన మురళీ మోహన్ గారి ఫస్ట్ లుక్ బాగుంది. ఆయనకు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
*మ్యూజిక్ డైరెక్టర్ కార్తిక్ మాట్లాడుతూ* .. ‘మురళీ మోహన్ గారి లాంటి గొప్ప వ్యక్తి నటిస్తున్న చిత్రానికి నేను పని చేస్తుండటం ఆనందంగా ఉంది. డొక్కా సీతమ్మ గారు అంటే ధర్మం.. ధర్మం అంటే మురళీ మోహన్ గారు. ఇలాంటి గొప్ప చిత్రంలో పని చేసే అవకాశం ఇచ్చిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు’ అని అన్నారు.
*శివ నాగు మాట్లాడుతూ* .. ‘మురళీ మోహన్ గారు డొక్కా సీతమ్మ చిత్రంతో మరో విజయాన్ని అందుకోబోతోన్నారు. నేను త్వరలోనే ఆయన్ను డైరెక్ట్ చేయబోతోన్నాను. ఆయన మహా నటులు’ అని అన్నారు.
*లయన్ సాయి వెంకట్ మాట్లాడుతూ* .. ‘‘మురళీ మోహన్ గారు ప్రతీ రంగంలో విజయాన్ని సాధించారు. ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. ఆయనెప్పుడూ కూడా సర్వేజనా సుఖినోభవంతు అని అంటుంటారు. అందుకే ఆయన అంత ఆరోగ్యంగా ఉంటారు’ అని అన్నారు.
*ప్రముఖ నిర్మాత రామ సత్యనారాయణ మాట్లాడుతూ* .. ‘నాలుగు పాటలు, ఫైట్లు అంటూ సినిమాలు తీస్తున్న టైంలో ఇలా డొక్కా సీతమ్మ గారి కథతో గొప్ప సినిమాను తీస్తున్నారు. ఇలాంటి చిత్రాలే ఇప్పుడు రావాలి. నా వెన్నెంటే ఉండే మా మురళీ మోహన్ గారికి మరోసారి ఈ చిత్రంతో పెద్ద విజయం చేకూరాలి’ అని అన్నారు.
*ప్రముఖ నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ* .. ‘నా కెరీర్ ప్రారంభం నుంచీ మురళీ మోహన్ గారు నాకు సపోర్ట్‌గా నిలుస్తూనే వచ్చారు. నాకు జీవితంలో ఆయనే స్పూర్తి. ఆయన సినీ, వ్యాపార, రాజకీయ రంగాల్లో విజయాన్ని సాధించారు. ఈ డొక్కా సీతమ్మ గారి సినిమాతో ఆయనకు మరో విజయం దక్కాలి’ అని అన్నారు.
*రేలంగి నరసింహారావు మాట్లాడుతూ* ..‘డొక్కా సీతమ్మ గురించి మేం చదువుకునే రోజుల్లో చాలా విన్నాం. ఇక ఆమె కథతో సినిమా తీస్తున్నారని తెలియడంతో ఎంతో ఆనందంగా అనిపించింది. ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలి. నేను ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచీ ఆయన నాకు సపోర్ట్‌గానే నిలిచారు. ఇండస్ట్రీలో మంచితనం అంటే సూపర్ స్టార్ కృష్ణ, మురళీ మోహన్ పేర్లు వినిపిస్తూనే ఉంటాయి. మా గురువు దాసరి గారు అయితే మురళీ అంటూ కొడుకుని పిలిచినట్టుగా ప్రేమగా పిలుస్తుండేవారు’ అని అన్నారు.
నటీనటులు : మురళీ మోహన్, ఆమని, రాజమౌళి, ఆకెళ్ల, జబర్దస్త్ అప్పారావు, R C M రాజు,చినబాబు, కాకినాడ ప్రసాద్, జబర్దస్త్ బాబి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కేశవి, పిట్టలదొర, కూరాకుల చిన్న, డి. వీరబాబు తదితరులు
సాంకేతిక బృందం
బ్యానర్: ఉషారాణి మూవీస్
నిర్మాతలు: వల్లూరి రాంబాబు,మట్టా శ్రీనివాస్.
సహ నిర్మాతలు వలిసెట్టి చాహితి ప్రియా, పోల గాని సుబ్బారావు
దర్శకుడు: టి.వి. రవి నారాయణ్
సంగీత దర్శకుడు:కార్తిక్ కోడకండ్ల
ఎడిటర్: శ్రీకృష్ణ
కెమెరామెన్: రాహుల్ శ్రీ వాత్సవ్
ఆర్ట్ డైరెక్టర్ : ఎం. రవి కుమార్
పాటలు : చంద్రబోస్, విజయ్ కుమార్, వీరు
కొరియోగ్రఫీ : సుచిత్రా చంద్రబోస్
పీఆర్వో : సాయి సతీష్