శబ్దం టెక్నికలీ చాలా రోజుల తర్వాత చూసిన టాప్ నాచ్ ఫిల్మ్- నాని

Naari Trailer Launched by Dil Raju
The “Naari” film features Aamani, Vikas Vashishtha, Mounika Reddy, Pragathi, Sunaina, Kedar Shankar, Pramodini and others in key roles. Director Surya Vantipalli has made this film with the concept that women should be respected and girl child should be helped to grow in all fields. Shashi vantipalli is the producer. Nari is gearing up for a grand theatrical release on March 7th on the occasion of women’s day. The film’s trailer was released by star producer Dil Raju. In this event
Producer Dil Raju said, “With the trailer, it looks like ‘Naari” has been made with a good story about women. Trailer is very good. It’s nice to see a new producer and director making such a good movie. Aamani Garu was remembered by Telugu audiences with movies like Mavichiguru and Subhalagnam. She has also acted in MCA and Srinivasa Kalyanam movies in our banner. The team should plan to bring the film to the audience with good pramotion. I wish the entire team of the Naari film a great success.
Actress Aamani said, “Today we are happy that producer dil raju gaaru released the trailer of our film ‘Naari” . I did Srinivasa Kalyanam and MCA movies under dil raju banner. I want to do more films under his banner. Our director Surya vantiPalli has made the film ‘Naari” to highlight the greatness of women. I thank Suriya garu for giving me the opportunity to act in this film. This is a movie every woman should see. Everything in a woman’s life is difficult. Only a few understand it. The film deals with the issues faced by women in today’s society. I was very much involved in this role. I hope you all will support our film Naari which is releasing on 7th March in theatres.
Director Suriya vantipalli said, “I thank producer Dil Raju garu for coming as a guest for the trailer release of our film ‘Naari.” Although he is very busy, he came to bless our team. I made ‘Naari’ with the concept that women should be protected and women should be respected. In our film, we are showing the life of a woman in three stages. I want girls aged 13-20 to be taken to the theatres by their parents and shown our film. I can proudly say that I have made a film like ‘Naari’ in my life. It’s such a good film. Watch our promotional content and support “Naari” movie. Because it is the media friends who take our film to the audience. The songs Aadu Magadra and Nishilo Shasila were hits. I couldn’t think of anyone else than amani gaaru to play the lead role in the film. She’s a wonderful actress. We will release the film on March 7th on the occasion of women’s day. I hope you all enjoy watching it in theatres.
Producer Shashi vantiapalli said, “I thank producer Dil Raju garu for coming as a guest for the trailer release of our film ‘Naari.” Thank you to our media friends who attended the event. “Naari” is a film made for women. We are waiting for your response to the film Naari, which is releasing in theatres on 7th March on the occasion of women’s day.
Actress Mounika Reddy said, “Thank you everyone for coming to the trailer launch of our movie Naari. Our director Surya garu made this film with a lot of efforr and hard work. In this film, our director has showed problems of women facing in this society.
Cast: Aamani, Vikas Vashishtha, Kartikeya Deva, Nithya Sri, Mounika Reddy, Pragathi, Kedar Shankar, Pramodini, Chatrapathi Shekar, Naga Mahesh, Sunaina, Ramachandra, Rajasekhar, Phani, Geetha Krishna Reddy, Dhruvan Varma, Rajahmundry Sridevi, Sattanna, V Lokesh, Nagi Reddy, Achyutha Rama Rao, Sekhar Neelisetty, Laddu, Guda Ramakrishna, Sreelatha, Bhargavi, Sai Renuka, Geetha, Mahesh, Vinay, Akhil Yadavalli
Technical team
DOP – V Ravikumar, Bheem Samba
Executive DOP – Krishna
Music – Vinod Kumar.
Lyrics – Bhaskarabhatla, Prasad Sana.
Singers – Ramana Gogula, RP Patnaik, sunitha, Chinmayi Sripada, C.Shor
editor – Madhav Kumar Gullapalli
PRO – Murthy Mallala
Producer – Smt. Sasi vantipalli
Direction: Surya vantipalli
స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు చేతుల మీదుగా “నారి” సినిమా ట్రైలర్ రిలీజ్, మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 7న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ
ఆమని, వికాస్ వశిష్ఠ, మౌనిక రెడ్డి, ప్రగతి, సునయన, కేదార్ శంకర్, ప్రమోదినీ, తదితరులు కీలక పాత్రల్లో నటించిన సినిమా “నారి”. మహిళల్ని గౌరవించాలి, ఆడిపిల్లలు అన్ని రంగాల్లో ఎదిగేందుకు సహకరించాలి అనే కాన్సెప్ట్ తో దర్శకుడు సూర్య వంటిపల్లి ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రొడ్యూసర్ శ్రీమతి శశి వంటిపల్లి నిర్మించారు. “నారి” సినిమా మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 7న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ ను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో
ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ – మహిళల గురించి ఒక మంచి కథతో “నారి” సినిమాను రూపొందించినట్లు ట్రైలర్ తో తెలుస్తోంది. ట్రైలర్ చాలా బాగుంది. కొత్త ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఇలాంటి మంచి ప్రయత్నం చేయడం సంతోషకరం. ఆమని గారు మావిచిగురు, శుభలగ్నం లాంటి మూవీస్ తో తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయారు. అలాగే మా సంస్థలో ఎంసీఏ, శ్రీనివాస కల్యాణం మూవీస్ లో నటించారు. “నారి” సినిమాను ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లాలని ఈ టీమ్ కు సజెస్ట్ చేస్తున్నా. ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని కోరుకుంటూ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. అన్నారు.
నటి ఆమని మాట్లాడుతూ – ఈ రోజు మా “నారి” సినిమా ట్రైలర్ దిల్ రాజు గారి చేతుల మీదుగా రిలీజ్ చేసుకోవడం సంతోషంగా ఉంది. వాళ్ల బ్యానర్ లో నేను శ్రీనివాస కల్యాణం, ఎంసీఎ మూవీస్ చేశాను. అప్పటి నుంచి బిజీగానే ఉంటున్నాను. వారి బ్యానర్ లో మరిన్ని మూవీస్ చేయాలని అనుకుంటున్నా. “నారి” సినిమా మహిళల గొప్పదనం చెప్పేలా మా దర్శకుడు సూర్య వంటిపల్లి రూపొందించారు. ఈ మూవీలో ఇంతమంచి రోల్ చేసే అవకాశం ఇచ్చిన సూర్య గారికి థ్యాంక్స్. ప్రతి మహిళ చూడాల్సిన చిత్రమిది. మహిళ జీవితంలో పుట్టినప్పటినుంచి అన్నీ కష్టాలే. అది అర్థం చేసుకున్న వాళ్లు కొద్దిమందే ఉంటారు. ఈరోజు సమాజంలో మహిళలకు జరుగుతున్న అన్యాయాల్ని ప్రశ్నిస్తుందీ మూవీ. నేను ఈ క్యారెక్టర్ లో ఎంతో ఇన్వాల్వ్ అయి నటించాను. మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 7న రిలీజ్ అవుతున్న మా “నారి” సినిమాను మీరంతా థియేటర్స్ లో చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
దర్శకుడు సూర్య వంటిపల్లి మాట్లాడుతూ – మా “నారి” సినిమా ట్రైలర్ రిలీజ్ కోసం అతిథిగా వచ్చిన ప్రొడ్యూసర్ దిల్ రాజు గారికి థ్యాంక్స్. ఆయన ఎంతో బిజీగా ఉన్నా, టీమ్ తీసుకుని మా ఈవెంట్ కు రావడం సంతోషంగా ఉంది. మహిళలకు రక్షణ కావాలి, మహిళల్ని గౌరవించాలి అనే కాన్సెప్ట్ తో “నారి” సినిమాను రూపొందించాను. మా మూవీలో ఒక మహిళ జీవితాన్ని మూడు దశల్లో చూపిస్తున్నాం. 13-20 ఏళ్ల వయసున్న ఆడపిల్లలను వారి తల్లిదండ్రులు థియేటర్స్ కు తీసుకెళ్లి మా మూవీ చూపించాలని కోరుతున్నా. “నారి” లాంటి మూవీ చేశానని నా జీవితంలో గర్వంగా చెప్పుకోగలను. అలాంటి మంచి చిత్రమిది. మా ప్రమోషనల్ కంటెంట్ చూసి “నారి” సినిమాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మా సినిమాను ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లేది మీడియా మిత్రులే. ఆడు మగాడ్రా, నిశిలో శశిలా సాంగ్స్ హిట్ అయ్యాయి. ఈ సినిమాలోని ప్రధాన పాత్రకు ఆమని గారిని తప్ప మరొకరిని ఊహించుకోలేకపోయాు. అద్భుతమైన నటి ఆమని గారు. మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 7న మా మూవీని రిలీజ్ కు తీసుకొస్తున్నాం. మీరంతా తప్పకుండా థియేటర్స్ లో చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
నిర్మాత శ్రీమతి శశి వంటిపల్లి మాట్లాడుతూ – మా “నారి” సినిమా ట్రైలర్ రిలీజ్ కోసం అతిథిగా వచ్చిన ప్రొడ్యూసర్ దిల్ రాజు గారికి థ్యాంక్స్. మా ఈవెంట్ కు వచ్చిన మీడియా మిత్రులకు థ్యాంక్స్. “నారి” సినిమా మహిళల కోసం చేసిన మూవీ. అయితే ప్రేక్షకులంతా సకుటుంబంగా చూసేలా ఉంటుంది. మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 7న థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న “నారి” సినిమాకు మీరు ఇచ్చే రెస్పాన్స్ కోసం వేచి చూస్తున్నాం. అన్నారు.
నటి మౌనిక రెడ్డి మాట్లాడుతూ – మా “నారి” సినిమా ట్రైలర్ లాంఛ్ కు వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. ఎంతో శ్రమకోర్చి మా డైరెక్టర్ సూర్య గారు ఈ సినిమా రూపొందించారు. మహిళల గొప్పదనం, ప్రస్తుతం వారు ఈ సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యను ఎంతో చక్కగా ఈ మూవీలో మా డైరెక్టర్ గారు తెరకెక్కించారు. థియేటర్స్ లో మా మూవీని చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
నటీనటులు – ఆమని, వికాస్ వశిష్ఠ, కార్తికేయ దేవ్, నిత్య శ్రీ, మౌనిక రెడ్డి, ప్రగతి, కేదార్ శంకర్, ప్రమోదినీ, ఛత్రపతి శేఖర్, నాగ మహేశ్, సునైన, రామచంద్ర, రాజశేఖర్, ఫణి, గీతాకృష్ణ రెడ్డి, ధృవన్ వర్మ, రాజమండ్రి శ్రీదేవి, సత్తన్న, వి. లోకేష్, నాగిరెడ్డి, అచ్యుత రామారావు, శేఖర్ నీలిశెట్టి, లడ్డు, గూడ రామకృష్ణ, శ్రీలత, భార్గవి, శ్రీవల్లి, సాయి రేణుక, గీత, మహేశ్, వినయ్, అఖిల్ యడవల్లి, తదితరులు
టెక్నికల్ టీమ్
డీవోపీ – వి రవికుమార్, భీమ్ సాంబ
ఎగ్జిక్యూటివ్ డీవోపీ – కృష్ణ
మ్యూజిక్ – వినోద్ కుమార్
లిరిక్స్ – భాస్కరభట్ల, ప్రసాద్ సాన
సింగర్స్ – రమణ గోగుల, ఆర్పీ పట్నాయక్, సునీత, చిన్మయి శ్రీపాద, సి.షోర్
ఎడిటర్ – మాధవ్ కుమార్ గుల్లపల్లి
పీఆర్ఓ – మూర్తి మల్లాల
నిర్మాత – శ్రీమతి శశి వంటిపల్లి
దర్శకత్వం – సూర్య వంటిపల్లి