
Love You Raa Audio Launched Grandly – Movie to Release on September 5
Under the banner of Samudrala Cine Creations, the upcoming film Love You Raa stars Chinnu Krish in the lead role alongside Geethika Ratan. Produced by Samudrala Mantrayya Babu and Konipati Srinath Prajapati, the movie is directed by Prasad Eluri and is gearing up for release on September 5. Ahead of its release, a grand audio launch event was held on Monday, August 18, where the songs “Ae Maya Chesave Pilla,” “WhatsApp Baby,” “Youth Abba Memu,” and “Daivanne Adagala” were unveiled. At the press meet, the cast and crew shared their thoughts.
*Hero Chinnu Krish said:* “Love You Raa is my debut film. I’m truly grateful to my director and producers for giving me this opportunity and to everyone who stood by me throughout this journey. Director Prasad garu believed in me and entrusted me with this role. The film is a laugh riot from start to finish. Geethika has breathed life into her character, Krishna Sai’s role is hilarious, and Chandrasekhar garu’s performance is outstanding. Our film has everything—horror, comedy, love, and emotions. Eswar garu gave us wonderful songs. With the support of the media, newcomers like us can reach the audience. I request everyone to watch our movie and bless us with success on September 5.”
*Actor Chandrasekhar said:* “Love You Raa is releasing on September 5, and I wish it to be a grand success. As Srinath garu said, this film is bound to succeed two hundred percent. Wishing the entire team all the best.”
*Heroine Geethika said:* “We had so much fun shooting Love You Raa. I believe the audience will love the film. Thanks to everyone who worked on this project. Our movie is releasing on September 5th, please watch it and make it a success.”
*Producer Srinath Prajapati said:* “I watched Love You Raa, and I really liked it, which is why I chose to associate it. It doesn’t feel like a film made by newcomers, as the quality is very natural and engaging. I’m confident it will connect with everyone.”
*Director Prasad Eluri said:* “My heartfelt thanks to my team for bringing Love You Raa this far. Special thanks to distributor Dayanand garu for appreciating our film. The movie is releasing on September 5. I take inspiration from Rajamouli and Sandeep Reddy Vanga. The media always encourages small films, and I request you to promote our movie so it can reach a wide audience.”
*Actor Krishna Sai said:* “Love You Raa will keep audiences laughing. Our director worked very hard on this film, and both Chinnu and Geethika performed wonderfully. I hope the audience supports us and makes this movie a success.”
*Producer-Director Nagesh said:* “Love You Raa, produced under Samudrala Creations, has been made brilliantly by director Prasad. For audiences, what matters is whether the film is good—it doesn’t matter if it’s big or small. The hero and heroine acted very well, the songs are impressive, and even the title itself is catchy. I hope distributor Dayanand ensures good theaters for the release, and I wish the film to become a big hit.”
*Actor Nagateja said:* “Love You Raa is a beautiful village-based love story. Even though we are newcomers, we’ve all come together to make a good film. I sincerely hope the audience encourages us.”
*సెప్టెంబర్ 5న రాబోతోన్న హారర్, లవ్, కామెడీ ఎంటర్టైనర్ ‘లవ్ యూ రా’.. ఘనంగా ఆడియో లాంచ్ ఈవెంట్*
సముద్రాల సినీ క్రియేషన్స్ బ్యానర్ మీద చిన్ను హీరోగా, గీతికా రతన్ హీరోయిన్గా సముద్రాల మంత్రయ్య బాబు, కొన్నిపాటి శ్రీనాథ్ ప్రజాపతి నిర్మాతలుగా రానున్న చిత్రం ‘లవ్ యూ రా’. ఈ మూవీకి ప్రసాద్ ఏలూరి దర్శకత్వం వహించారు. ఈ మూవీని సెప్టెంబర్ 5న విడుదల చేయబోతోన్నారు. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన ఈవెంట్‌ను సోమవారం (ఆగస్ట్ 18) నాడు నిర్వహించారు. ఈ క్రమంలో ‘ఏ మాయ చేశావే పిల్లా’, ‘వాట్సప్ బేబీ’, ‘యూత్ అబ్బా మేము’, ‘దైవాన్నే అడగాలా’ అనే పాటలను లాంచ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన ప్రెస్ మీట్లో..
*హీరో చిన్ను మాట్లాడుతూ* .. ‘‘లవ్ యూ రా’ నాకు మొదటి చిత్రం. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. ఈ ప్రయాణంలో మా వెన్నంటే నిలిచిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ప్రసాద్ గారు నన్ను నమ్మి ఈ పాత్రను ఇచ్చారు. ‘లవ్ యూ రా’ ఆద్యంతం అందరినీ కడుపుబ్బా నవ్వించేలా ఉంటుంది. గీతిక పాత్రకు ప్రాణం పోశారు. కృష్ణ సాయి కారెక్టర్ అందరినీ నవ్విస్తుంది. చంద్ర శేఖర్ గారి పాత్ర చాలా బాగా వచ్చింది. మా చిత్రంలో హారర్, కామెడీ, లవ్ ఇలా అన్ని అంశాలుంటాయి. ఈశ్వర్ గారు మాకు మంచి పాటలు ఇచ్చారు. సెప్టెంబర్ 5న మా చిత్రం రాబోతోంది. మీడియా సపోర్ట్ ఉంటేనే మాలాంటి వాళ్లు ఆడియెన్స్ వరకు చేరుకుంటాం. మా మూవీని అందరూ చూసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
*చంద్రశేఖర్ మాట్లాడుతూ* .. ‘‘లవ్ యూ రా’ చిత్రం సెప్టెంబర్ 5న రాబోతోంది. ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలి. శ్రీనాథ్ గారు చెప్పినట్టుగా ఈ మూవీ వందకు రెండొందల శాతం సక్సెస్ అవుతుంది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.
*హీరోయిన్ గీతిక మాట్లాడుతూ* .. ‘‘లవ్ యూ రా’ టీం అంతా కలిసి ఎంతో సరదాగా షూటింగ్ చేశాం. సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. మా మూవీకి పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. సెప్టెంబర్ 5న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
*నిర్మాత శ్రీనాథ్ ప్రజాపతి మాట్లాడుతూ* .. ‘‘లవ్ యూ రా’ సినిమాను నేను చూశాను. నాకు చాలా నచ్చింది. అందుకే ఈ మూవీతో అసోసియేట్ అయ్యాను. ఎక్కడా కూడా కొత్త వాళ్లు ఈ మూవీని చేసినట్టుగా అనిపించదు. ఈ మూవీ కచ్చితంగా అందరినీ ఆకట్టుకుంటుంది. నేచర్‌లో తీసిన నేచురల్ మూవీ’ అని అన్నారు.
*దర్శకుడు ప్రసాద్ ఏలూరి మాట్లాడుతూ* .. ‘‘లవ్ యూ రా’ చిత్రాన్ని ఈ స్థాయికి తీసుకు వచ్చిన నా టీంకు థాంక్స్. మా మూవీని చూసి మెచ్చుకున్న డిస్ట్రిబ్యూటర్ దయానంద్ గారికి థాంక్స్. సెప్టెంబర్ 5న మా చిత్రం రాబోతోంది. నాకు రాజమౌళి, సందీప్ రెడ్డి వంగా స్పూర్తి. చిన్న చిత్రాల్ని కూడా మీడియా ఎంకరేజ్ చేస్తూనే ఉంటుంది. మా మూవీని మీడియా ప్రమోట్ చేయాలని, ఆడియెన్స్ వరకు రీచ్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
*నటుడు కృష్ణ సాయి మాట్లాడుతూ* .. ‘‘లవ్ యూ రా’ చిత్రం అందరినీ నవ్వించేలా ఉంటుంది. మా దర్శకుడు ఈ చిత్రం గురించి చాలా కష్టపడ్డారు. మా హీరో చిన్ను, హీరోయిన్ గీతిక చక్కగా నటించారు. మా సినిమాను సక్సెస్ చేయాలని ఆడియెన్స్‌ను కోరుకుంటున్నాను’ అని అన్నారు.
*దర్శక, నిర్మాత నాగేష్ మాట్లాడుతూ* .. ‘సముద్రాల క్రియేషన్స్ బ్యానర్ మీద తీసిన చిత్రం ‘లవ్ యూ రా’. దర్శకుడు ప్రసాద్ ఈ మూవీని అద్భుతంగా తీశారు. సినిమాలో దమ్ముంటే.. అది చిన్నదా? పెద్దదా? అని ఆడియెన్స్ పట్టించుకోరు. హీరో, హీరోయిన్లు చక్కగా నటించారు. పాటలు బాగున్నాయి. ‘లవ్ యూ రా’ టైటిల్ చాలా క్యాచీగా ఉంది. దయానంద్ ఈ మూవీకి మంచి థియేటర్లు దక్కేలా చూడాలి. ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
*నాగతేజ మాట్లాడుతూ* .. ‘పల్లెటూరిలో జరిగే అందమైన ప్రేమ కథ ఈ ‘లవ్ యూ రా’ చిత్రం. కొత్త వాళ్లమైనా కూడా అందరం కలిసి ఓ మంచి చిత్రాన్ని చేశాం. మాలాంటి కొత్త వాళ్లందరినీ ఆడియెన్స్ ఆదరిస్తారని కోరుకుంటున్నాను’ అని అన్నారు.