కిష్కిందపురి నుండి వైబ్రెంట్ బీట్స్ లవ్ మెలోడీ, ఫస్ట్ సింగిల్ ఉండిపోవే నాతోనే

I want to do more roles like ‘Barbarik’ instead of the typical ones – Sathyaraj
Under the production of Vijaypal Reddy Adidhala’s Vanara Celluloid banner and presented by star director Maruthi on Maruthi Team Product, the film Tribanadhari Barbarik’ is directed by Mohan Srivatsa. The movie, which stars Pan-Indian actor Sathyaraj in the lead role, also features Vasishta N. Simha, Satyam Rajesh, Udaya Bhanu, Kranthi Kiran, and Sanchi Rai in key roles. The movie carries strong buzz with each promotional material, making a positive impression. While the glimpse and teaser introduced the backdrop, the songs turned out to be chartbusters. Meanwhile, the film’s release date was recently announced at a press conference.
*Sathyaraj said* , “I’m delighted to have worked on ‘Tribanadhari Barbarik.’ We could all say our roles are main, but the story is the real hero here. Director Mohan, producer Vijay, and executive producer Rajesh are the real ‘arrows’ of this film. Eshwar made me dance, and Ramesh showcased all of us brilliantly. While dubbing, I asked to see other scenes as well and was amazed by how the camera angles created so much suspense. The director and cinematographer did a fantastic job together. Even after turning 70, I still want to take on new, unique roles. I want to do more roles like ‘Barbarik’ instead of the typical ones. This film will be released on August 22nd, which is my dear friend Megastar Chiranjeevi’s birthday. Chiranjeevi is a complete actor—a great actor, a great dancer, and a wonderful person. We are so happy that our movie is releasing on his birthday.”
*Udaya Bhanu said* , “I haven’t been away from movies; I just act in roles that appeal to me. Currently, I’ve had the opportunity to play a role that satisfies an artist’s hunger. Mohan gave me a challenging role in ‘Barbarik,’ and I put my all into every character I play. Rajesh is a good friend of mine, and he always convinces me to do his projects. When Mohan narrated the story, I could visualize the entire plot and every scene. People often ask why our industry doesn’t produce films like this, and our movie will surprise them. Vijaypal is a very passionate producer; if producers like him succeed, they will uplift many others. Vasishta is a great person, and Kranthi has next-level energy. Sanchi, Meghana, and the whole team had a lot of fun during the shoot. Ramesh showed all of us beautifully. It was our fortune to work with Sathyaraj Garu; he is a very humble person, and we learned a lot from him. This film will be a feast for the eyes for everyone. Please watch and support it.”
*Vasishta N. Simha stated* , “‘Tribanadhari Barbarik’ is very special to me. When Mohan narrated the story, I was immediately struck by the unique title. The story and screenplay were fantastic. Initially, Mohan told me it was a small film, but once I got on set, I realized it was anything but. I thank Mohan for giving us such a great film. Movies like this are rare. My character in the film is presented in a very new way, and every character is brilliant. This film will impress everyone. Vijay is a very passionate producer. It was a pleasure to work with Sathyaraj Garu, and Udaya Bhanu Garu has a next-level aura. Kranthi, Sanchi, Meghana, and Karthikeya all acted wonderfully. Eshwar’s choreography is very fresh. The cameraman, Ramesh Garu, is a workaholic. I am a huge fan of Chiranjeevi Garu, and this film is releasing on his birthday, August 22nd. Please watch it.”
*Producer Vijaypal Reddy Adidhala remarked* , “Our film ‘Barbarik’ is coming out on August 22nd. Please watch and support it. If you like our songs, teaser, and trailer, please give us your support.”
*Director Mohan Srivatsa said* , “It’s the media, with their camera as their weapon, that has to take our film to the audience. That’s why the media is our ‘Barbarik.’ The song ‘Nee Valle Nee Valle’ got a great response—that was our first arrow. The song ‘Anaga Anaga’ was the second arrow, and with ‘Iskithadi Uskithadi,’ we released the third. Vijaypal Reddy invested with clarity, and I made this movie with commitment. This film has clarity, commitment, and content. We are releasing our film on August 22nd, the birthday of our boss, Megastar Chiranjeevi. Please watch and make it a success.”
*Kranthi Kiran stated* , “I played an important character named Dev in ‘Barbarik.’ The movie is releasing on August 22nd, Megastar Chiranjeevi’s birthday. This felt like the perfect date for us. I have already seen the film, and it has a great story, great content, and emotions. It will keep you on the edge of your seat from the first scene to the very end.”
*Sanchi Rai said* , “Our film ‘Barbarik’ is releasing on August 22nd. This film is very special to me. Thanks to everyone who worked on this film. Please watch our film and make it a success.”
*Child Artist Karthikeya said* , “I played an important role named Pradeep in our film ‘Barbarik.’ This film will impress everyone. Our movie is coming out on August 22nd. Please watch it.”
*Child Artist Meghana stated* , “Our film ‘Barbarik’ is releasing on August 22nd, on the birthday of our boss, Megastar Chiranjeevi. Please watch and support it.”
*Cinematographer Kushendar Ramesh Reddy said* , “I worked on ‘Baahubali,’ where I met Sathyaraj Garu. I have also worked on films like ‘Polimera’ and ‘Razakar.’ After that, Mohan came to me and told me this story. I was surprised by the title ‘Barbarik.’ It’s a very fresh concept. Producing a film like this is no easy task, and Vijaypal produced it wonderfully. This film will appeal to everyone. Please watch the film coming out on August 22nd and make it a success.”
*Executive Producer Rajesh* avowed, “Everyone loved our teaser, and now we’ve announced the release date. We are releasing it on August 22nd because everyone will remember that date as Megastar Chiranjeevi’s birthday. This is a content-based movie. If you want to watch content-driven films, please watch ours.”
*Choreographer Eshwar said* , “I composed all the songs in this film. I was a contestant on a show hosted by Udaya Bhanu Garu, and now I’ve had the chance to choreograph a song for her. I’m also credited with showing Vasishta in a romantic light. I am very happy to have worked with Sathyaraj Garu. I thank Mohan Garu and Vijay Garu for this opportunity. The film is coming out on August 22nd. Please watch it.”
Stills
Vijaypal Reddy Adidhala, Mohan Srivatsa, Vasishta N Simha, Satya Raj, Udaya Bhanu, Sanchi Rai, Kranthi Kiran
మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టిన రోజు సందర్భంగా ఆగస్ట్ 22న మా ‘త్రిబాణధారి బార్బరిక్’ చిత్రాన్ని విడుదల చేస్తుండటం ఆనందంగా ఉంది.. రిలీజ్ డేట్ ప్రెస్ మీట్లో ప్రముఖ నటుడు సత్య రాజ్*
స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల నిర్మిస్తున్న చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. ఈ మూవీకి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు. పాన్ ఇండియన్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రంలో వశిష్ట ఎన్ సింహా, సత్యం రాజేష్, ఉదయభాను, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్ వంటి వారు ప్రధాన పాత్రల్ని పోషించారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఈ క్రమంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో..
*సత్య రాజ్ మాట్లాడుతూ* .. ‘‘త్రిబాణధారి బార్బరిక్’ సినిమాలో పని చేసినందుకు ఆనందంగా ఉంది. మేమంతా కూడా మాదే మెయిన్ పాత్ర అని చెప్పుకోవచ్చు. కానీ ఇందులో కథే మెయిన్ హీరో. డైరెక్టర్ మోహన్, నిర్మాత విజయ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాజేష్ వీళ్లే అసలైన బాణాలు. ఈశ్వర్ గారు నాతో డ్యాన్స్ చేయించారు. రమేష్ గారు మా అందరినీ అద్భుతంగా చూపించారు. డబ్బింగ్ చెప్పేటప్పుడు ఇతర సీన్లను కూడా అడిగి చూశాను. కెమెరా యాంగిల్‌తోనే సస్పెన్స్‌ను క్రియేట్ చేశారు. అలా దర్శకుడు, కెమెరామెన్ కలిసి అద్భుతం చేశారు. 70 ఏళ్లు దాటినా కూడా నేను కొత్త కొత్త పాత్రల్ని చేయాలని అనుకుంటున్నాను. రెగ్యులర్ పాత్రల్ని కాకుండా ‘బార్బరిక్’ లాంటి కొత్త పాత్రల్ని మరిన్ని చేయాలని అనుకుంటున్నాను. నా డియర్ ఫ్రెండ్ మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆగస్ట్ 22న ఈ చిత్రం విడుదల కాబోతోంది. చిరంజీవి గారు కంప్లీట్ యాక్టర్. ఆయన గొప్ప నటుడు, డ్యాన్సర్, అద్భుతమైన వ్యక్తి. మా మూవీ ఆయన పుట్టిన రోజున రిలీజ్ అవుతుండటం ఆనందంగా ఉంది’ అని అన్నారు.
*ఉదయ భాను మాట్లాడుతూ* .. ‘నేనేమీ సినిమాలకు దూరంగా ఉండలేదు. నాకు నచ్చిన పాత్రలు వస్తేనే నటిస్తున్నాను. ఆర్టిస్టులకు ఉండే ఆకలిని తీర్చే పాత్రలో ప్రస్తుతం నటించాను. ‘బార్బిరిక్’ చిత్రంలో ఓ ఛాలెంజింగ్ పాత్రను మోహన్ గారు నాకు ఇచ్చారు. ప్రతీ పాత్రను నేను ప్రాణం పెట్టి పోషిస్తాను. నాకు రాజేష్ మంచి స్నేహితుడు. ఆయన ఏ ప్రాజెక్ట్ చేస్తున్నా కూడా నన్ను కన్విన్స్ చేస్తుంటారు. మోహన్ గారు నెరేట్ చేసినప్పుడు ఆ కథ, ప్రతీ సీన్ నా కంటికి కనిపించింది. మన భాషలో ఇలాంటి చిత్రాలెందుకు రావు? అని అంతా అంటుంటారు. అలాంటి వారిని ఆశ్చర్యపరిచేలా మా చిత్రం ఉంటుంది. విజయ్ పాల్ గారు చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్. ఇలాంటి నిర్మాతలకు సక్సెస్ వస్తే ఇంకెంతో మందిని పైకి తీసుకు వస్తారు. వశిష్ట చాలా మంచి వ్యక్తి. క్రాంతి ఎనర్జీ నెక్ట్స్ లెవెల్లో ఉంటుంది. సాంచీ, మేఘన అందరం కలిసి ఎంతో సరదాగా షూటింగ్ చేశాం. రమేష్ గారు మా అందరినీ చక్కగా చూపించారు. సత్య రాజ్ గారితో పని చేయడం మా అదృష్టం. ఆయన ఎంతో ఒదిగి ఉంటారు. ఆయన్నుంచి మేమంతా ఎంతో నేర్చుకున్నాం. ఈ చిత్రం అందరికీ కన్నుల పండువగా ఉంటుంది. అందరూ చూసి ఆదరించండి’ అని అన్నారు.
*వశిష్ట ఎన్ సింహా మాట్లాడుతూ* .. ‘‘త్రిబాణధారి బార్బరిక్’ నాకెంతో ప్రత్యేకం. మోహన్ గారు చెప్పిన కథ విన్నప్పుడే టైటిల్ చాలా కొత్తగా అనిపించింది. కథ, స్క్రీన్ ప్లే చాలా బాగా అనిపించింది. ఇది చిన్న సినిమా అని మోహన్ నాకు ఓ కథ చెప్పారు. కానీ సెట్ మీదకు వచ్చిన తరువాత ఇది చిన్న సినిమా కాదని నాకు అర్థమైంది. ఇంత మంచి చిత్రాన్ని ఇచ్చిన మోహన్ గారికి థాంక్స్. ఇలాంటి చిత్రాలు అరుదుగా వస్తుంటాయి. నన్ను ఈ మూవీలో చాలా కొత్తగా చూపించారు. ఇందులో ప్రతీ పాత్ర అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది. విజయ్ చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్. సత్య రాజ్ గారితో పని చేయడం ఆనందంగా ఉంది. ఉదయ భాను గారి ఆరా నెక్ట్స్ లెవెల్. క్రాంతి, సాంచీ, మేఘన, కార్తికేయ అందరూ అద్బుతంగా నటించారు. ఈశ్వర్ కొరియోగ్రఫీ చాలా కొత్తగా ఉంటుంది. కెమెరామెన్ రమేష్ గారు పని రాక్షసులు. నేను చిరంజీవి గారి అభిమానిని. ఆయన బర్త్ డే సందర్భంగా ఆగస్ట్ 22న ఈ చిత్రం విడుదల కాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.
*ప్రొడ్యూసర్ విజయ్ పాల్ రెడ్డి అడిదెల మాట్లాడుతూ* .. ‘మా ‘బార్బరిక్’ చిత్రం ఆగస్ట్ 22న రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయండి. మా మూవీ నుంచి వచ్చిన పాటలు, టీజర్, ట్రైలర్ మీకు నచ్చితేనే సపోర్ట్ చేయండి’ అని అన్నారు.
*దర్శకుడు మోహన్ శ్రీవత్స మాట్లాడుతూ* .. ‘కెమెరా అనే అస్త్రం ఉన్న మీడియానే మా చిత్రాన్ని ఆడియెన్స్ వరకు తీసుకెళ్లాలి. అందుకే మాకు మీడియానే ‘బార్బరిక్’. ‘నీ వల్లే నీ వల్లే’ అనే పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే మొదటి బాణం. ‘అనగా అనగా’ అనే పాట రెండో బాణం. ‘ఇస్కితడి ఉస్కితడి’ అంటూ మూడో బాణాన్ని వదిలాం. విజయ్ పాల్ రెడ్డి గారు క్లారిటీతో డబ్బులు పెట్టారు. కమిట్మెంట్తో నేను ఈ మూవీని చేశాను. క్లారిటీ, కమిట్మెంట్, కంటెంట్ ఉన్న చిత్రమిది. మా బాస్ మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆగస్ట్ 22న మా చిత్రాన్ని రిలీజ్ చేయబోతోన్నాం. అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.
*క్రాంతి కిరణ్ మాట్లాడుతూ* .. ‘‘బార్బరిక్’ చిత్రంలో నేను దేవ్ అనే ఓ ముఖ్యమైన పాత్రను పోషించాను. ఈ మూవీని మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆగస్ట్ 22న రిలీజ్ కాబోతోంది. ఇదే మాకు పర్ఫెక్ట్ డేట్ అని అనిపించింది. ఇప్పటికే ఈ మూవీని చూశాను. మంచి కథ, మంచి కంటెంట్, ఎమోషన్ అన్నీ కూడా మా చిత్రంలో ఉన్నాయి. ఫస్ట్ సీన్ నుంచి ఎండింగ్ వరకు సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడుతుంది’ అని అన్నారు.
*సాంచీ రాయ్ మాట్లాడుతూ* .. ‘మా బార్బరిక్ చిత్రం ఆగస్ట్ 22న విడుదల కాబోతోంది. ఇది నాకెంతో ప్రత్యేకమైన చిత్రం. ఈ మూవీ కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మా చిత్రాన్ని అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.
*చైల్డ్ ఆర్టిస్ట్ కార్తికేయ మాట్లాడుతూ* .. ‘మా ‘బార్బరిక్’ చిత్రంలో నేను ప్రదీప్ అనే ఓ ఇంపార్టెంట్ పాత్రలో పోషించాను. ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. ఆగస్ట్ 22న మా మూవీ రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.
*చైల్డ్ ఆర్టిస్ట్ మేఘన మాట్లాడుతూ* .. ‘నేను నటించిన ‘బార్బరిక్’ చిత్రం మన బాస్ మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆగస్ట్ 22న రిలీజ్ కాబోతోంది. అందరూ చూసి ఆదరించండి’ అని అన్నారు.
*కెమెరామెన్ కుశేందర్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ* .. ‘నేను బాహుబలికి పని చేశాను. ఆ టైంలో సత్య రాజ్ గారితో పరిచయం ఏర్పడింది. నేను పొలిమేర, రజాకార్ వంటి చిత్రాలు చేశాను. ఆ తరువాత మోహన్ నా దగ్గరకు వచ్చి ఈ కథ చెప్పారు. బార్బరిక్ అని చెప్పడంతో ఆశ్చర్యపోయాను. ఇది చాలా కొత్త పాయింట్. ఇలాంటి ఓ సినిమాను నిర్మించడం అంటే మామూలు విషయం కాదు. విజయ్ పాల్ ఈ సినిమాను అద్భుతంగా నిర్మించారు. ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. ఆగస్ట్ 22న రాబోతోన్న చిత్రాన్ని అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.
*ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాజేష్ మాట్లాడుతూ* .. ‘మా టీజర్‌ను అందరూ ఆదరించారు. ఇప్పుడు రిలీజ్ డేట్‌ను ప్రకటించాం. మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే అని ఆ డేట్ అందరికీ గుర్తుంటుందని ఆగస్ట్ 22న విడుదల చేయబోతోన్నాం. ఇది కంటెంట్ బేస్డ్ మూవీ. కంటెంట్ ఉన్న సినిమాల్ని చూడాలని అనుకుంటే మా చిత్రాన్ని చూడండి’ అని అన్నారు.
*కొరియోగ్రాఫర్ ఈశ్వర్ మాట్లాడుతూ* .. ‘నేను ఈ చిత్రంలో అన్ని పాటల్ని కంపోజ్ చేశాను. గతంలో ఉదయభాను గారు హోస్ట్ చేసిన షోలో కంటెస్టెంట్‌గా చేశాను. ఇప్పుడు ఆమెకు ఓ పాటను కంపోజ్ చేశాను. వశిష్ట గారిని రొమాంటిక్ యాంగిల్ చూపించిన క్రెడిట్ నాకే దక్కింది. సత్య రాజ్ గారితో పని చేయడం ఆనందంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన మోహన్ గారికి, విజయ్ గారికి థాంక్స్. ఆగస్ట్ 22న ఈ చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.