
Home Town Will Remind You of Your Hometown – Rajiv Kanakala
Home Town is an upcoming web series for aha subscribers, set against the backdrop of memories and bonds tied to our homes. The series stars Rajiv Kanakala, Jhansi, Prajwal Yadma, Sairam, Ani, Anirudh, and Jyothi in key roles. It is directed by Srikanth Reddy Palle and produced by Naveen Medaram and Sekhar Medaram. Home Town will be streaming on aha OTT starting from April 4th. A special preview of the web series was showcased to the media today. At the press meet,
Actor Rajiv Kanakala said, “I am happy to have had the opportunity to act in the web series Home Town. I am watching this series on the big screen with all of you today. The upcoming episodes will be even more interesting. Some of those who watched this preview will be reminded of their hometowns, while others will reflect on their past memories. Watching the children’s mischief in the series made me feel like I had gone back 35 years. Naveen Medaram garu was the backbone of Home Town and led the project exceptionally well. Our director, Srikanth Reddy, designed the series in a way that will resonate with everyone in the village. The series has been produced with excellent technical quality. I wish all the best to Jhansi garu, who acted alongside me, and to the entire team.”
Producer Naveen Medaram said, “Home Town is the web series we made after 90’s A Middle Class Biopic. Just as the three children became overnight stars in 90’s A Middle Class Biopic, the children in Home Town will also receive similar recognition after the series releases. I am thankful to aha OTT for giving me the opportunity to produce this series. Cinematographer Devdeep Gandhi Kundu, music composer Suresh Bobbili, and my entire technical team provided immense support in making Home Town a success. I hope this series brings a good name to our MNOP banner.”
Director Srikanth Reddy Palle said, “Many of us are people who moved from the village to the city. Even if we go abroad, our hometown always holds a special place in our hearts. The memories of our hometown are unforgettable. All these emotions will be captured in Home Town, and I am sure it will resonate with the audience. Don’t miss the last episode. I would like to thank my producer Naveen garu and aha for giving me the opportunity to create this series. Rajiv Kanakala garu supported me from the very beginning. Prajwal not only acted but also assisted with the writing. Every actor gave their best performance. Special thanks to music director Suresh Anna and the rest of the team.”
Music Director Suresh Bobbili said, “Thanks to everyone who came to the Home Town web series event and supported us. It was a pleasure to work on this series. When I saw director Srikanth Reddy, I felt he had the same intensity as Sandeep Reddy Vanga. There are many twists in the last episode, so don’t miss it.”
Actor Prajwal Yadma said, “I am very grateful to Naveen Medaram garu for giving me the opportunity to act in the web series Home Town. Director Srikanth garu did not treat me as a new actor and gave me the opportunity after watching my audition. I thank him for that. Rajiv Kanakala garu encouraged me a lot. If you watch us in this web series, you’ll be reminded of all the characters from our group of friends. It was a pleasure to act alongside Jhansi garu. The recognition that 90’s A Middle Class Biopic has brought has given a lot of confidence to new actors like us. It has shown me that we can gain as much, if not more, recognition through a web series than through a film. I got the opportunity in the same company that produced that series, and we hope that the Home Town series brings good recognition to all of us.”
Actor Sairam said, “After 90’s A Middle Class Biopic, we all received great recognition. After that, I got the opportunity to be a part of the Home Town series in the same company. I have many fond memories from working on this series. Though I didn’t have many scenes with Rajiv, we enjoyed our time on set. Prajwal, Ani, Anirudh… our entire gang will entertain you a lot. Make sure to watch Home Town on aha.
Actor Anirudh said, “I was selected for the Home Town web series right after Rajiv. I play the character of Shastri in the series. When Director Srikanth saw me, he immediately confirmed that I would play Shastri in his story. My characters, along with those of Prajwal and Sairam, will be like the three monkeys: don’t see bad, don’t speak bad, don’t hear bad. We all hope that this series brings us good recognition.”
Actress Ani said, “When I was offered a role in the Home Town web series, I felt it would be a great project for my career. Director Srikanth gave us a lot of freedom on set, which allowed us to deliver our best performances. I am happy to act with Rajiv garu and Jhansi garu. I am also feeling the suspense about how the last episode will turn out. I want to watch it with you all. The characters played by Prajwal, Sairam, and Anirudh are hilarious. I hope you all will watch and support our Home Town series.”
Actress Shravya said: “I previously acted in 90’s A Middle Class Biopic under this banner, and now I am part of the Home Town series. I played the character of Sameera in this web series. This is the first time in my career that I’ve played a Muslim character. The reason I was able to portray this role well is the freedom our director Srikanth gave us. I’m sure the Home Town web series will impress all of you.”
‘హోం టౌన్’ వెబ్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది – స్పెషల్ ప్రివ్యూ షో ఈవెంట్ లో నటుడు రాజీవ్ కనకాల
ఆహా సబ్ స్క్రైబర్స్ కోసం వస్తున్న మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ హోం టౌన్. మన ఇంటి చుట్టు అల్లుకున్న జ్ఞాపకాలు, బంధాల నేపథ్యంతో ఈ వెబ్ సిరీస్ రూపొందింది. రాజీవ్ కనకాల, ఝాన్సీ, ప్రజ్వల్ యాద్మ, సాయిరామ్, అనీ, అనిరుధ్, జ్యోతి కీలక పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ కు శ్రీకాంత్ రెడ్డి పల్లే దర్శకత్వం వహించారు. నవీన్ మేడారం, శేఖర్ మేడారం నిర్మించారు. ఈ నెల 4వ తేదీ నుంచి హోం టౌన్ వెబ్ సిరీస్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈ రోజు మీడియా మిత్రులకు ‘హోం టౌన్’ వెబ్ సిరీస్ స్పెషల్ ప్రివ్యూ ప్రదర్శించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో
నటుడు రాజీవ్ కనకాల మాట్లాడుతూ – ‘హోం టౌన్’ వెబ్ సిరీస్ లో నటించే అవకాశం రావడం సంతోషంగా భావిస్తున్నా. ఈ సిరీస్ ను బిగ్ స్క్రీన్ మీద మీతో పాటే నేనూ చూస్తున్నా. మిగతా ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఈ ప్రివ్యూ చూసిన వారిలో కొందరికి తమ సొంత ఊరు, మరికొందరికి తమ గత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి ఉంటాయి. ఈ సిరీస్ లో పిల్లల అల్లరి చూస్తుంటే 35 ఏళ్లు వెనక్కి వెళ్లిన ఫీలింగ్ కలిగింది. నవీన్ మేడారం గారు ‘హోం టౌన్’ వెబ్ సిరీస్ కు బ్యాక్ బోన్ గా ఉండి నడిపించారు. అలాగే మా డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి పల్లె అందరికీ కనెక్ట్ అయ్యేలా సిరీస్ రూపొందించారు. టెక్నికల్ సైడ్ మంచి క్వాలిటీతో ఈ సిరీస్ తెరకెక్కింది. నాతో పాటు కలిసి నటించిన ఝాన్సీ గారికి ఇతర టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.
నిర్మాత నవీన్ మేడారం మాట్లాడుతూ- 90’s ఎ మిడిల్ క్లాస్ బయోపిక్ తర్వాత మా సంస్థలో చేసిన వెబ్ సిరీస్ ‘హోం టౌన్’. 90’s ఎ మిడిల్ క్లాస్ బయోపిక్ లో ఆ ముగ్గురు పిల్లలు ఓవర్ నైట్ స్టార్స్ ఎలా అయ్యారో ‘హోం టౌన్’ సిరీస్ రిలీజ్ తర్వాత కూడా ఇక్కడున్న ఈ ముగ్గురు పిల్లలకు కూడా అలాంటి గుర్తింపు వస్తుంది. ఈ సిరీస్ ను చేసే అవకాశం ఇచ్చిన ఆహా ఓటీటీకి థ్యాంక్స్. ‘హోం టౌన్’ ప్రొడ్యూస్ చేయడంలో దేవ్ దీప్ గాంధీ కుండు సినిమాటోగ్రాఫీ, సురేష్ బొబ్బిలి మ్యూజిక్..ఇలా నా టెక్నికల్ టీమ్ అంతా ఎంతో సపోర్ట్ చేశారు. ‘హోం టౌన్’ మా ఎంఎన్ ఓపీ బ్యానర్ కు మంచి పేరు తీసుకొస్తుందని ఆశిస్తున్నా. అన్నారు.
డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి పల్లే మాట్లాడుతూ – మనలో చాలా మంది ఊరి నుంచి సిటీకి వచ్చిన వాళ్లమే. విదేశాలకు వెళ్లినా మనకంటూ ఓ స్పెషల్ ప్లేస్ ఉంటుంది. అదే మన సొంతూరు. సొంతూరుతో ముడపడిన జ్ఞాపకాలను మర్చిపోలేం. అలాంటి ఎమోషన్స్ అన్నీ ‘హోం టౌన్’ వెబ్ సిరీస్ లో మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. చివరి ఎపిసోడ్ మాత్రం మిస్ కావొద్దు. ఈ సిరీస్ చేసే అవకాశం ఇచ్చిన నా ప్రొడ్యూసర్ నవీన్ గారికి, ఆహాకు థ్యాంక్స్ చెబుతున్నా. మొదటి రోజు నుంచే నన్ను రాజీవ్ కనకాల గారు సపోర్ట్ చేశారు. ప్రజ్వల్ నటుడిగానే కాదు రైటింగ్ సైడ్ కూడా అసిస్ట్ చేశాడు. ప్రతి ఆర్టిస్ట్ తమ బెస్ట్ పర్ ఫార్మెన్స్ ఇచ్చారు. మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ అన్నకు, మిగతా టీమ్ అందరికీ థ్యాంక్స్. అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి మాట్లాడుతూ – ‘హోం టౌన్’ వెబ్ సిరీస్ ఈవెంట్ కు వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్స్. ఈ సిరీస్ కు వర్క్ చేయడం హ్యాపీగా అనిపించింది. డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డిని చూస్తే సందీప్ రెడ్డి వంగాలా అనిపించారు. చివరి ఎపిసోడ్ లో ఎన్నో ట్విస్ట్స్ ఉంటాయి. మిస్ కాకుండా చూడండి. అన్నారు.
యాక్టర్ ప్రజ్వల్ యాద్మ మాట్లాడుతూ – ‘హోం టౌన్’ వెబ్ సిరీస్ లో నటించే అవకాశం కల్పించిన నవీన్ మేడారం గారికి ఆహాకు థ్యాంక్స్. డైరెక్టర్ శ్రీకాంత్ గారు నేను కొత్త యాక్టర్ అని చూడకుండా ఆడిషన్ చూసి అవకాశం ఇచ్చారు. ఆయనకు కృతజ్ఞతలు చెబుతున్నా. రాజీవ్ కనకాల గారు మమమ్ని ఎంతో ఎంకరేజ్ చేశారు. మమ్మల్ని ఈ వెబ్ సిరీస్ లో చూస్తే మన ఫ్రెండ్స్ బ్యాచ్ లో ఉండే క్యారెక్టర్స్ అన్నీ మీకు గుర్తొస్తాయి. ఝాన్సీ గారితో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. 90’s ఎ మిడిల్ క్లాస్ బయోపిక్ కు వచ్చిన గుర్తింపు మాలాంటి కొత్త నటీనటుల్లో ఎంతో నమ్మకాన్ని తీసుకొచ్చింది. ఒక వెబ్ సిరీస్ తో కూడా సినిమా కంటే ఎక్కువగా పేరు తెచ్చుకోవచ్చనే ఆశ కలిగించింది. ఆ సిరీస్ చేసిన సంస్థలో నాకు అవకాశం వచ్చింది, ‘హోం టౌన్’ సిరీస్ మా అందరికీ మంచి గుర్తింపు తెస్తుందని ఆశిస్తున్నాం. అన్నారు.
యాక్టర్ సాయిరామ్ మాట్లాడుతూ – 90’s ఎ మిడిల్ క్లాస్ బయోపిక్ తర్వాత మా అందరికీ మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత అదే సంస్థలో ‘హోం టౌన్’ సిరీస్ చేసే అవకాశం వచ్చింది. ఈ సిరీస్ తో నాకు ఎన్నో మంచి మెమొరీస్ దక్కాయి. రాజీవ్ గారితో నాకు ఎక్కువగా సీన్స్ లేవు గానీ సెట్ లో బాగా ఎంజాయ్ చేశాం. ప్రజ్వల్, ఆనీ, అనిరుధ్…ఇలా మా గ్యాంగ్ అంతా మిమ్మల్ని బాగా ఎంటర్ టైన్ చేస్తుంది. ఆహాలో ‘హోం టౌన్’ తప్పకుండా చూడండి. అన్నారు.
యాక్టర్ అనిరుధ్ మాట్లాడుతూ – ‘హోం టౌన్’ వెబ్ సిరీస్ కు రాజీవ్ గారి తర్వాత సెలెక్ట్ అయ్యింది నేనే. ఈ సిరీస్ లో శాస్త్రి అనే క్యారెక్టర్ లో నటించాను. డైరెక్టర్ శ్రీకాంత్ గారు నన్ను చూడగానే నా కథలో శాస్త్రి క్యారెక్టర్ నువ్వేరా అని వెంటనే కన్ఫర్మ్ చేశారు. చెడు చూడకు, మాట్లాడకు, వినకు అనే మూడు కోతుల్లా ప్రజ్వల్, సాయిరామ్ నా క్యారెక్టర్స్ ఉంటాయి. ఈ సిరీస్ తో మా అందరికీ మంచి గుర్తింపు దక్కుతుందని ఆశిస్తున్నాం. అన్నారు.
యాక్ట్రెస్ అనీ మాట్లాడుతూ – ‘హోం టౌన్’ వెబ్ సిరీస్ లో ఆఫర్ వచ్చినప్పుడు ఈ సిరీస్ తప్పకుండా బాగుంటుంది. నా కెరీర్ కు మంచి ప్రాజెక్ట్ అవుతుందని అనిపించింది. సెట్ లో మాకు డైరెక్టర్ శ్రీకాంత్ గారు ఎంతో ఫ్రీడమ్ ఇచ్చి వర్క్ చేయించారు. అందుకే సీన్స్ అన్నీ చాలా బాగా వచ్చాయి. రాజీవ్, ఝాన్సీ గారితో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. చివరి ఎపిసోడ్ ఎలా ఉంటుందో అనే సస్పెన్స్ నేను కూడా ఫీల్ అవుతున్నా. మీతో పాటు నేనూ ఆహాలోనే ఆ ఎపిసోడ్ చూడాలి. ప్రజ్వల్, సాయిరామ్, అనిరుధ్ క్యారెక్టర్స్ హిలేరియస్ గా ఉంటాయి. మీరంతా మా ‘హోం టౌన్’ సిరీస్ ను చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
యాక్ట్రెస్ శ్రావ్య మాట్లాడుతూ – ఈ బ్యానర్ లో గతంలో 90’s ఎ మిడిల్ క్లాస్ బయోపిక్ లో నటించాను. ఇప్పుడు ‘హోం టౌన్’ సిరీస్ చేశాను. ఈ వెబ్ సిరీస్ లో సమీర అనే క్యారెక్టర్ లో నటించాను. ఫస్ట్ టైమ్ నా కెరీర్ లో ఒక ముస్లిం క్యారెక్టర్ చేశాను. ఈ పాత్రలో బాగా నటించానంటే అందుకు మా డైరెక్టర్ శ్రీకాంత్ గారు ఇచ్చిన ఫ్రీడమ్ కారణం. ‘హోం టౌన్’ వెబ్ సిరీస్ మీ అందరినీ ఆకట్టుకుంటుంది. అన్నారు.