దేవకీ నందన వాసుదేవ లొ డివైన్ ఎలిమెంట్స్, ట్విస్ట్ లు అదిరిపోతాయి –
First single Sitar Released from Mr Bachchan’
‘మిస్టర్ బచ్చన్’ నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ సితార్
డైరెక్టర్ హరీష్ శంకర్ కు మ్యూజిక్ లో మంచి టేస్ట్ వుంది, ఆయన సినిమాలు థియేటర్లలో విడుదలకు ముందే మ్యూజికల్ గా హిట్ అయ్యాయి. మాస్ మహారాజా రవితేజతో ప్రస్తుతం హరీష్ శంకర్ చేస్తున్న ‘మిస్టర్ బచ్చన్’ కూడా డిఫరెంట్ జానర్లతో కూడిన ఆల్బమ్. ప్రోమోతో ఆదరగొట్టిన తర్వాత, మేకర్స్ ఫస్ట్ సింగిల్- సితార్ లిరికల్ వీడియోని రిలీజ్ చేశారు.
సుబ్రమణ్యం ఫర్ సేల్, గద్దలకొండ గణేష్ తర్వాత మిక్కీ జె మేయర్ మళ్లీ హరీష్ శంకర్‌తో జతకట్టారు. ఈ పాట సితార్ సౌండ్స్ తో ప్రారంభమవుతుంది, ఇది మ్యాజిక్ బీట్లతో కూడిన కంప్లీట్ క్లాసికల్ నెంబర్. కెవ్వు కేక, అస్మైక యోగ అనే రెండు చార్ట్బస్టర్ల తర్వాత, హరీష్ , లిరిక్ రైటర్ సాహితీ రీయూనిట్ లో వచ్చిన ఈ పాట మెస్మరైజింగ్ లిరిక్స్ తో ఆకట్టుకుంది.
ట్రాక్‌కి అందించిన పదాలు జెమ్స్, సాకేత్ కొమండూరి, సమీర భరద్వాజ్ వోకల్స్ అద్భుతంగా వున్నాయి. అలాగే, చారులత మణి క్లాసిక్ రాగం ట్రూలీ క్లాసికల్. బ్యాక్ పాకెట్, హిప్ మూవ్‌లు ఎలిగెంట్ గా వున్నాయి.
రవితేజ స్టైలిష్ ఎటైర్ లో యంగ్ అండ్ డాషింగ్‌గా కనిపించారు. భాగ్యశ్రీ బోర్స్ గ్లామరస్ దివాలా ఆకట్టుకుంది. వీరిద్దరూ ఆకట్టుకునే కెమిస్ట్రీని పంచుకున్నారు. రవితేజ డ్యాన్స్ మూమెంట్స్ ఎక్స్ లెంట్ గా వుండగా భాగ్యశ్రీ తన ఎలిగెంట్ మూమెంట్స్ తో మెస్మరైజ్ చేసింది. శేఖర్ మాస్టర్ తన అద్భుతమైన కొరియోగ్రఫీతో విజువల్స్‌కి మరింత ఎలిగెన్స్ తీసుకొచ్చారు.
అయాంకా బోస్ విజువల్స్ చాలా ఎనర్జిటిక్ అండ్ బ్యుతీఫుల్ గా వున్నాయి. కాశ్మీర్ లోయలోని ఎక్సోటిక్ లొకేషన్లను చాలా ఆకర్షణీయంగా చూపించారు. సితార్ ఇన్స్టంట్ హిట్, బిగ్ స్క్రీన్‌పై చూసినప్పుడు పాట మరింత మెస్మరైజ్ చేస్తుంది.
ఈ సినిమాలో జగపతి బాబు, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ ఈ ప్రాజెక్ట్‌ని గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. నామ్ తో సునా హోగా అనేది సినిమా ట్యాగ్ లైన్. ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలి కాగ, ఎడిటర్ ఉజ్వల్ కులకర్ణి.
త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.
తారాగణం: రవితేజ, భాగ్యశ్రీ బోర్సే, జగపతి బాబు, సచిన్ ఖేడేకర్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: హరీష్ శంకర్
నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్
సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
సమర్పణ: పనోరమా స్టూడియోస్ & T-సిరీస్
సంగీతం: మిక్కీ జె మేయర్
డీవోపీ: అయనంక బోస్
ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి
ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో
మేకప్ చీఫ్: ఐ శ్రీనివాసరాజు