
Fighter Shiva Teaser Unveiled by Star Producer Ashwini Dutt
Fighter Shiva, produced under the banners of Koundinya Productions and Aruna Giri Arts by Unnam Ramesh and Narsimha Goud, is directed by Prabhas Nimmala. The film features Manikant and Aira Bansal as the lead pair, with noted actors Sunil and Vikas Vasishta playing key roles. The film’s teaser was officially launched on Saturday (August 16). Star producer Ashwini Dutt did the honours of launching the teaser.
Packed with impactful lines such as “I’ll show you what it’s like if Yama himself became a policeman” and “I’m like Pawan Kalyan… I’ll fight until I win”, the teaser has been cut brilliantly, promising a full-on mass commercial action entertainer.
While speaking at the event, *hero Manikant said* : “My father worked tirelessly to make me a hero with Fighter Shiva. Every rupee invested will be brought back with respect. This journey wasn’t easy, and at one point, we were stuck—until Ramesh garu came to our rescue. Director Prabhas loves commercial films, and every dialogue in this one is hard-hitting. Vishva garu worked tirelessly for the film, Surender’s every frame looks stunning, and Gautam’s music will connect with everyone. Fighter Shiva will surely impress all sections of the audience.”
*Director Prabhas Nimmala said* : “It’s only because of Ashwini Dutt garu and Sampath Nandi garu that Fighter Shiva has reached this stage. Sampath Nandi garu unveiled our poster, and Ashwini Dutt garu released the teaser—I thank them both. Today, I may be making a small film, but tomorrow, I will be a big director, and when newcomers approach me then, I will definitely stand by them.
We have shaped Fighter Shiva as a film with a strong social message—against the menace of drugs. Manikant plays the title role, while Sunil garu and Vikas Vasishta have given strong performances. The industry should support small films and newcomers. I will soon bring another project titled Miracle.
On a personal note, my mother passed away three months ago due to cancer. Basavatarakam Cancer Hospital gave her three extra months of life, and for that service, I sincerely thank Nandamuri Balakrishna garu. I request all actors to support us during promotions as well. Surender Reddy’s support was invaluable, Gautam’s music has come out brilliantly, and Vishwanath’s editing has elevated the film. Narsimha Goud garu wanted to introduce his son as a hero, and when I narrated this mass, action-driven subject with a message, both he and Ramesh garu stood solidly by us. Telangana is about to witness the rise of a new star in Manikant. Please bless our movie.”
*MLA Ramalingam said* : “Prabhas has worked very hard for Fighter Shiva. The film is inspired by the government’s fight against drugs. As Chiranjeevi garu always says, new talent must be encouraged—and now Manikant is stepping forward as a new hero. I urge everyone to support this film.”
*Producer Narsimha Goud said:* “I have heard many stories, but when Prabhas narrated Fighter Shiva, it truly stood out. Our Telangana CM Revanth Reddy garu is fighting against drugs, and we are carrying forward that same message through this film. Fighter Shiva will awaken the youth and resonate with audiences across all sections. The release is coming very soon.”
*Producer Unnam Ramesh said:* “Director Prabhas Nimmala has made Fighter Shiva with the government’s anti-drug fight as its foundation. Manikant has delivered a fantastic performance. This film will be a big success. For audiences, there is no small or big film—it’s all look hn about the output. And Fighter Shiva has the content to connect with everyone.”
*Music Director Gowtham Raviram said* : “I have been in the industry for 20 years and have worked on about 12 films so far. I’ve known Prabhas Nimmala for years—he has crafted a strong story. The music, visuals, and editing have shaped up beautifully, and Manikant has performed brilliantly. This movie will definitely be a grand success.”
*Cinematographer Surender Reddy said* : “Initially, Prabhas told me this would be a small film. But once I heard the story, I realized it is not small at all. He is also working on another film Miracle, which will be huge. Prabhas is immensely talented, and Manikant has delivered an outstanding performance. He will definitely rise to greater heights. Our producers Ramesh and Narsimha garu treated us like family. I wish Fighter Shiva to be a big success.”
*Actor Sridhar said* : “In Telugu cinema, we haven’t had many films with drugs as the backdrop. Now we have Ghaati and Fighter Shiva tackling the theme of drugs and marijuana. Prabhas has handled this film wonderfully. I also wish his upcoming Miracle becomes a big hit.”
*Actor Anand said* : “Prabhas anna worked extremely hard on Fighter Shiva. After this film, his range as a director will change. Manikant has performed very well, Surender Reddy’s camera work is excellent, and with such a strong team, this film is destined for big success.”
*Editor Vishwanath said* : “I got this opportunity in Fighter Shiva thanks to cinematographer Surender garu. I am grateful to director Prabhas and producers Ramesh and Narsimha garu for trusting me.”
*Cast* : Manikant, Aira Bansal, Sunil, Vikas Vasishta, Madhusudan, Yogi Khatri, Dil Ramesh, Laxman, Abhay, Anand Bharathi, Gharshana Srinivas, Master Shanvith Nimmala, and others.
*Technical Crew:*
Producers – Narsimha Goud, Unnam Ramesh
Director – Prabhas Nimmala
Cinematography – Surender Reddy, Sanjeev Loknath
Music – Gowtham Raviram
Editing – Vishwanath
Art Director – Naidu
Lyrics – Totamalla Venkata
Executive Producer – Ramesh Iggidi
PRO – Sai Satish
*ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ చేతుల మీదుగా ‘ఫైటర్ శివ’ టీజర్ విడుదల*
కౌండిన్య ప్రొడక్షన్స్, అరుణ గిరి ఆర్ట్స్ బ్యానర్ల మీద ఉన్నం రమేష్, నర్సింహ గౌడ్ నిర్మించిన చిత్రం ‘ఫైటర్ శివ’. ప్రభాస్ నిమ్మల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మణికాంత్, ఐరా బన్సాల్ జంటగా నటించారు. ఈ మూవీలో సునీల్, వికాస్ వశిష్ట వంటి వారు కీలక పాత్రలను పోషించారు. ఈ క్రమంలో శనివారం (ఆగస్ట్ 16) నాడు ‘ఫైటర్ శివ’ టీజర్‌ను లాంచ్ చేశారు. ఈ టీజర్‌ను ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ రిలీజ్ చేశారు.
‘యముడుకి పోలీస్ ఉద్యోగం దొరికితే ఎలా ఉంటుందో చూపిస్తా..’, ‘నేను పవన్ కళ్యాణ్ లెక్క.. గెలిచే వరకు పోరాడుతా’ వంటి పవర్ ఫుల్ డైలాగ్స్‌తో ‘ఫైటర్ శివ’ టీజర్‌ను అద్భుతంగా కట్ చేశారు. ఈ ‘ఫైటర్ శివ’ టీజర్‌ను గమనిస్తే ఫుల్ యాక్షన్ ఓరియెంటెడ్ మాస్ కమర్షియల్ సినిమాని చూడబోతోన్నామని అర్థం అవుతోంది. టీజర్ లాంచ్ అనంతరం..
*హీరో మణికాంత్ మాట్లాడుతూ* .. ‘నన్ను హీరోని చేయాలని ఈ ‘ఫైటర్ శివ’ కోసం మా నాన్న గారు చాలా కష్టపడ్డారు. పెట్టిన ప్రతీ రూపాయిని వడ్డీతో సహా ఇండస్ట్రీ నుంచి తీసుకు వెళ్తాను. ఈ ప్రయాణం అంత సులభంగా జరగలేదు. మధ్యలో ఇరుక్కుపోయిన మమ్మల్ని రమేష్ గారు ఒడ్డుకు తీసుకు వచ్చారు. ప్రభాస్ గారికి కమర్షియల్ చిత్రాలంటేనే చాలా ఇష్టం. ఇందులోని ప్రతీ డైలాగ్ అద్భుతంగా ఉంటుంది. మా విశ్వ గారు సినిమా కోసం చాలా కష్టపడ్డారు. సురేందర్ గారి ప్రతీ ఫ్రేమ్ అద్భుతమనే చెప్పాలి. గౌతమ్ గారు ఇచ్చిన సంగీతం అందరినీ ఆకట్టుకుంటుంది. ‘ఫైటర్ శివ’ అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది’ అని అన్నారు.
*దర్శకుడు ప్రభాస్ నిమ్మల మాట్లాడుతూ* .. ‘ అశ్వనీదత్, సంపత్ నంది గారి వల్లే ఈ ‘ఫైటర్ శివ’ ఇక్కడి వరకు వచ్చింది. మా మూవీ పోస్టర్‌ను సంపత్ నంది గారు, టీజర్‌ను అశ్వనీదత్ గారు రిలీజ్ చేసినందుకు థాంక్స్. నేను ఇప్పుడు చిన్న సినిమా తీస్తున్నాను కావొచ్చు.. భవిష్యత్తులో మాత్రం నేను పెద్ద దర్శకుడిని అవుతాను. అప్పుడు నా వద్దకు సాయం కోసం వచ్చే కొత్త వారికి కచ్చితంగా అందుబాటులో ఉంటాను. ఓ సందేశాత్మకంగా చిత్రంగా ‘ఫైటర్ శివ’ను తెరకెక్కించాం. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా మన ప్రభుత్వాలు ఎంతో ప్రయత్నిస్తున్నాయి. టైటిల్ రోల్లో మణికాంత్ నటించారు. సునీల్ గారు, వికాస్ వశిష్ట వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు. చిన్న సినిమాల్ని, కొత్త వారిని ఇండస్ట్రీలో ప్రోత్సహించాలి. ‘మిరాకిల్’ అనే ఓ చిత్రాన్ని కూడా చేయబోతోన్నాను. అది కూడా త్వరలోనే ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. మూడు నెలల క్రితం క్యాన్సర్‌తో మా అమ్మ గారు మరణించారు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో మా అమ్మ గారికి ట్రీట్మెంట్ జరిగింది. ఆ ట్రీట్మెంట్, హాస్పిటల్ వల్లే మా అమ్మ గారు ఇంకో మూడు నెలలు ఎక్కువగా బతికారు. ఇంత గొప్ప సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నందమూరి బాలకృష్ణ గారికి థాంక్స్. రిలీజ్ టైంలో అయినా ఆర్టిస్టులు ప్రమోషన్స్‌కి సహకరిస్తే బాగుంటుంది. సురేందర్ రెడ్డి గారి సహకారం వల్లే ఇక్కడి వరకు వచ్చాను. గౌతమ్ సంగీతం అద్భుతంగా వచ్చింది. విశ్వనాథ్ ఎడిటింగ్ బాగా కుదిరింది. అందరి సహకారం వల్లే అవుట్ పుట్ బాగా వచ్చింది. నర్సింహ గౌడ్ గారు వాళ్ల అబ్బాయిని హీరోగా పరిచయం చేయాలని అనుకున్నారు. ఆ క్రమంలో యాక్షన్, మాస్, కమర్షియల్, మెసెజ్ ఓరియెంటెడ్ ‘ఫైటర్ శివ’ సబ్జెక్ట్ చెప్పాను. రమేష్ గారు మా వెన్నంటే నిల్చున్నారు. తెలంగాణ నుంచి మణికాంత్ అనే స్టార్ హీరో రాబోతోన్నాడు. మా మూవీని అందరూ ఆశీర్వదించండి’ అని అన్నారు.
*ఎమ్మెల్యే రామలింగం మాట్లాడుతూ* .. ‘‘ఫైటర్ శివ’ కోసం ప్రభాస్ ఎంతో కష్టపడ్డారు. ప్రభుత్వం డ్రగ్స్ మీద చేసే పోరాటం ఆధారంగా ‘ఫైటర్ శివ’ను తెరకెక్కించారు. చిరంజీవి గారు ఎప్పుడూ కూడా కొత్త వాళ్లు రావాలని చెబుతుంటారు. ఇప్పుడు మణికాంత్ అనే కొత్త హీరో రాబోతోన్నారు. ‘ఫైటర్ శివ’ను అందరూ ఆదరించండి’ అని అన్నారు.
*నిర్మాత నర్సింహా గౌడ్ మాట్లాడుతూ* .. ‘నేను చాలా కథలు విన్నాను. ఓ టైంలో ప్రభాస్ గారు ఈ ‘ఫైటర్ శివ’ స్టోరీ చెప్పారు. ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు డ్రగ్స్ మీద పోరాడుతున్నారు. అదే సందేశాన్ని ఈ మూవీతో మేం ఇవ్వబోతోన్నాం. యువతను మేల్కొపేలా మా ‘ఫైటర్ శివ’ ఉంటుంది. త్వరలోనే ఈ మూవీ విడుదల కాబోతోంది. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా మా చిత్రం ఉంటుంది’ అని అన్నారు.
*నిర్మాత ఉన్నం రమేష్ మాట్లాడుతూ* .. ‘డ్రగ్స్ నిర్మూలించాలనే ప్రభుత్వ పోరాటాన్ని ఆధారంగా తీసుకుని ‘ఫైటర్ శివ’ను మా దర్శకుడు ప్రభాస్ నిమ్మల తెరకెక్కించారు. మణికాంత్ ఈ చిత్రంలో అద్భుతంగా నటించారు. ‘ఫైటర్ శివ’ పెద్ద విజయం సాధిస్తుంది. చిన్న సినిమా.. పెద్ద సినిమా.. అన్న తేడా లేకుండా అవుట్ పుట్‌ను బట్టి ఆడియెన్స్ ఆదరిస్తారు. ‘ఫైటర్ శివ’ అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది’ అని అన్నారు.
*మ్యూజిక్ డైరెక్టర్ గౌతం రవిరాం మాట్లాడుతూ* .. ‘నేను ఇండస్ట్రీలోకి వచ్చి 20 ఏళ్లు అవుతోంది. ఇప్పటి వరకు ఓ 12 చిత్రాలు చేశాను. మరికొన్ని సినిమాలు చేతిలో ఉన్నాయి. ఇప్పుడు ‘ఫైటర్ శివ’ అని వస్తున్నాను. ప్రభాస్ నిమ్మల నాకు ఎన్నో ఏళ్ల నుంచి తెలుసు. ఆయన మంచి కథను రాసుకున్నారు. మ్యూజిక్, విజువల్స్, ఎడిటింగ్ బాగుంది. మణికాంత్ అద్భుతంగా నటించాడు. ఈ మూవీ గొప్ప విజయం సాధిస్తుంది’ అని అన్నారు.
*కెమెరామెన్ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ* .. ‘ప్రభాస్ నాకు ముందుగా చిన్న సినిమా అని చెప్పాడు. ‘ఫైటర్ శివ’ కథ విన్నాక ఇది చిన్న మూవీ కాదని నాకు అర్థమైంది. ‘మిరాకిల్’ అని ప్రభాస్ మరో మూవీని చేస్తున్నారు. ప్రభాస్ ఎంతో టాలెంటెడ్ పర్సన్. మణికాంత్ ఈ మూవీలో అదరగొట్టేశాడు. అతను మున్ముందు మరింత ఎత్తుకు ఎదుగుతాడు. నిర్మాతలైన రమేష్, నర్సింహ గారు మా అందరితో ఎంతో సరదాగా ఉండేవారు. ‘ఫైటర్ శివ’ పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
*నటుడు శ్రీధర్ మాట్లాడుతూ* .. ‘డ్రగ్స్ బ్యాక్ డ్రాప్లో మన తెలుగులో ఎక్కువ సినిమాలు రావడం లేదు. ఇప్పుడు ‘ఘాటీ’, ‘ఫైటర్ శివ’ అనే చిత్రాలు డ్రగ్స్, గంజాయి మెయిన్ టాపిక్‌గా రాబోతోన్నాయి. ప్రభాస్ అన్న ఈ మూవీని అద్భుతంగా తీశారు. ఆయన తీయబోతోన్న ‘మిరాకిల్’ కూడా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
*నటుడు ఆనంద్ మాట్లాడుతూ* .. ‘ప్రభాస్ అన్న ఈ ‘ఫైటర్ శివ’కి చాలా కష్టపడ్డారు. ‘ఫైటర్ శివ’ తరువాత ప్రభాస్ అన్న రేంజ్ మారుతుంది. ఆయన పెద్ద దర్శకుడు కాబోతోన్నారు. మణికాంత్ ఈ మూవీలో చక్కగా నటించాడు. సురేందర్ రెడ్డి కెమెరా వర్క్ బాగుంది. మంచి టీం కలిసి చేసిన ఈ చిత్రం పెద్ద విజయం కావాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
*ఎడిటర్ విశ్వనాథ్ మాట్లాడుతూ* .. ‘కెమెరామెన్ సురేందర్ గారి వల్ల నాకు ఈ ‘ఫైటర్ శివ’ అవకాశం వచ్చింది. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన దర్శకుడు ప్రభాస్, నిర్మాతలు రమేష్ గారికి, నర్సింహా గారికి థాంక్స్’ అని అన్నారు.
నటీనటులు : మణికాంత్, ఐరా బన్సాల్, సునీల్, వికాస్ వశిష్ట, మధుసూదన్, యోగి ఖత్రి, దిల్ రమేష్, లక్ష్మణ్, అభయ్, ఆనంద్ భారతి, ఘర్షణ శ్రీనివాస్, మాస్టర్ శాన్విత్ నిమ్మల తదితరులు
సాంకేతిక బృందం
నిర్మాతలు: నర్సింగ్, ఉన్నం రమేష్
దర్శకుడు: ప్రభాస్ నిమ్మల
సినిమాటోగ్రఫీ: సురేందర్ రెడ్డి, సంజీవ్ లోక్‌నాథ్
సంగీతం: గౌతం రవిరామ్
ఎడిటింగ్: విశ్వనాథ్
ఆర్ట్ డైరెక్టర్: నాయుడు
సాహిత్యం: తోటమల్ల వెంకట
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రమేష్ ఇగ్గిడి
PRO: సాయి సతీష్