
Cult Producer SKN Stands By Pawan Kalyan Fan Prem Kumar’s Family With ₹2 Lakh Financial Assistance
Young producer SKN has once again showcased his kind and compassionate nature by extending financial support to the family of Prem Kumar, a die-hard fan of Power Star and Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan, who recently passed away in an unfortunate accident.
SKN provided financial assistance of ₹2 lakh to Prem Kumar’s family. The amount was handed over to the family members through Andhra Pradesh Green Committee Chairman Konidela Naga Babu.
SKN has been earning appreciation for consistently extending a helping hand to those in need and standing by families during difficult times. He has particularly earned a reputation among Mega fans for being at the forefront whenever they face an unfortunate situation or require support.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమాని కుటుంబానికి అండగా నిలిచిన నిర్మాత ఎస్ కేఎన్
యంగ్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందిన పవర్ స్టార్, ఏపీ డిఫ్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిమాని ప్రేమ్ కుమార్ కుటుంబానికి ఎస్ కేఎన్ 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఆంధ్రప్రదేశ్ గ్రీన్ కమిటీ చైర్మన్ కొణిదెల నాగబాబు చేతుల మీదుగా ఈ ఆర్థిక సాయాన్ని ప్రేమ్ కుమార్ కుటుంబ సభ్యులకు అందజేశారు ఎస్ కేఎన్. అవసరంలో ఉన్న వారికి తన వంతు సాయం అందిస్తూ అందరి ప్రశంసలు పొందుతున్నారు ఎస్ కేఎన్. ముఖ్యంగా మెగాభిమానులకు ఎక్కడ ఏ ఆపద వచ్చినా ఏ సాయం కావాల్సినా ముందుంటారనే పేరు తెచ్చుకున్నారు ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్.
