భర్త మహాశయులకు విజ్ఞప్తి లో మంచి సర్ప్రైజ్ ఉంది. ఇది అందరికీ కనెక్ట్

Chai Bisket Launches Chai Shots – India’s First Regional Short Series OTT
Chai Bisket, the pioneers of Telugu digital entertainment for over a decade, today announced the official public launch of Chai Shots, India’s first regional short-series OTT platform. Built specifically for the “Third Screen” – the smartphone, Chai Shots offers premium, vertical, scripted entertainment with episodes under 2 minutes, designed to turn daily micro-moments into storytelling experiences.
Backed by Info Edge Ventures and General Catalyst, Chai Shots aims to revolutionise entertainment consumption in India—moving beyond endless scrolling to structured, high-quality storytelling.
A Creator-First Revolution with Two Major Announcements
1. The Creator Gateway
A direct-access portal for storytellers to pitch ideas without middlemen.
Chai Shots promises: “From Pitch to Live in just 45 Days”, streamlining approval, shooting, and release timelines.
2. ₹20 Crore Creator Fund
A massive fund to collaborate with 200+ creators over the next six months—fueling original shows and empowering new writers, directors, and actors.
Marquee Investor Backing
Chai Shots has raised a $5 million Seed Round from Info Edge Ventures and General Catalyst.
Angel investors include:
Rana Daggubati (Actor, Producer, Entrepreneur)
Sri Harsha Majety & Nandan Reddy (Founders, Swiggy)
Phanindra Sama (Founder, RedBus)
Alakh Pandey & Prateek Maheshwari (Founders, PhysicsWallah)
Aravind Sanka, Pavan Guntupalli & Rishikesh SR (Founders, Rapido)
Rohit Chennamaneni (Co-founder, Darwinbox)
Amar Nagaram (Founder, Virgio)
Industry Voices
Rana Daggubati:
“Storytelling has always been at the core of what excites me… Anurag and Sharath are true disruptors of the Telugu Film Industry.”
Ravi Yelamanchili (Mythri Movie Makers):
“A wonderful place for young creators to sprout into mainstream entertainment.”
Padma Shri Sanjeev Bikhchandani (Info Edge):
“Short-form content is the future… Chai Shots is doing a very good job.”
Rahul Humayun (General Catalyst):
“We’re thrilled to back Chai Shots as they build a pan-India content platform.”
Rohit Chennamaneni (Darwinbox):
“Really happy to be part of this and be a cheerleader.”
Phanindra Sama (RedBus):
“A great reflection of Telangana Rising.”
Rishikesh SR (Rapido):
“I wish to see Chai Shots become another unicorn.”
Sanjay Appan (Educator):
“Chai Shots tells stories that are so relatable.”
Sharath Chandra (Co-Founder & CEO):
“India is ready for this revolution… The new era of entertainment starts in Hyderabad.”
Anurag Reddy (Co-Founder & CCO):
“At Chai Shots, we don’t just create content; we create creators… Launching with 75+ original shows.”
Krishna Mohan (CTO):
“We are building an amazing product with a personalized, seamless interface.”
Expansion Plans
Chai Shots begins with a robust Telugu library and is expanding into Hindi, Tamil, Kannada, Malayalam, Marathi, Bengali, and Assamese, aiming to become Bharat’s go-to vertical entertainment platform.
About Chai Shots
India’s first regional short-series OTT platform delivering high-quality, vertical video content for mobile consumption. Part of the Chai Bisket ecosystem, with episodes under 2 minutes.
Available now on Google Play Store and Apple App Store.
names in pic – Rahul Humayun
Phanindra Sama
Rishikesh
Rohit chennamaneni
Rana Daggubati
Anurag Reddy
Sharth Chandra
Ravi Shankar
Krishna Mohan
చాయ్ బిస్కెట్ నుంచి మరో సంచలనం – ‘చాయ్ షాట్స్’ గ్రాండ్ గా లాంచ్
తెలుగు డిజిటల్ ఎంటర్టైన్మెంట్కి పదేళ్లుగా కొత్త దారులు చూపిస్తున్నచాయ్ బిస్కెట్, దేశంలోని తొలి రీజినల్ షార్ట్ సిరీస్ ఓటీటీ ప్లాట్ఫారం ‘చాయ్ షాట్స్’ ను గ్రాండ్ గా లాంచ్ చేసింది. స్మార్ట్‌ఫోన్ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన “థర్డ్ స్క్రీన్ ప్లాట్ఫార్మ్” లో 2 నిమిషాలకు లోపు ఉండే ప్రీమియం, వెర్టికల్, స్క్రిప్టెడ్ ఎపిసోడ్లు ఉంటాయి.
Info Edge Ventures, General Catalyst మద్దతుతో రూపుదిద్దుకున్న చా షాట్స్—ఎండ్లెస్ స్క్రోలింగ్ నుంచి స్ట్రక్చర్డ్, హై-క్వాలిటీ కథలు, ఎంటర్ టైన్మెంట్ వైపు ప్రేక్షకులను తీసుకువెళ్లడమే లక్ష్యం.
క్రియేటర్ల కోసం రెండు బిగ్ అనౌన్స్మెంట్స్
1. క్రియేటర్ గేట్‌వే
మధ్యవర్తులు లేకుండా నేరుగా కథలు పిచ్ చేసుకునే పోర్టల్.
“పిచ్ నుంచి లైవ్ వరకూ 45 రోజుల్లో!” అని చా షాట్స్ హామీ ఇస్తోంది.. అప్రూవల్, షూట్, రిలీజ్ మొత్తం త్వరితగతిన జరుగుతుంది.
2. ₹20 కోట్ల క్రియేటర్ ఫండ్
రాబోయే ఆరు నెలల్లో 200+ క్రియేటర్లతో కలిసి ఒరిజినల్ షోస్ రూపొందించేందుకు భారీ పెట్టుబడి.
కొత్త రైటర్స్, డైరెక్టర్లు, నటులు ఎదగడానికి పెద్ద వేదిక.
ప్రముఖ ఇన్వెస్టర్ల నుంచి భారీ మద్దతు
చాయ్ షాట్స్ ఇటీవలే $5 మిలియన్ సీడ్ రౌండ్ ను Info Edge Ventures , General Catalyst నుంచి రైజ్ చేసింది.
ఏంజెల్ ఇన్వెస్టర్లు:
రానా దగ్గుబాటి (నటుడు, నిర్మాత)
శ్రీ హర్ష మజేటి & నందన్ రెడ్డి (స్విగ్గీ వ్యవస్థాపకులు)
ఫణీంద్ర సమా (రెడ్‌బస్ స్థాపకుడు)
అలఖ్ పాండే & ప్రత్యీక్ మహేశ్వరి (ఫిజిక్స్‌వాలా వ్యవస్థాపకులు)
అరవింద్ సాంకా, పవన్ గుంటుపల్లి, రిషికేశ్ SR (రాపిడో స్థాపకులు)
రోహిత్ చెన్నమనేని (డార్విన్‌బాక్స్ సహ వ్యవస్థాపకుడు)
అమర్ నగరం (విర్జియో వ్యవస్థాపకుడు)
‘చాయ్ షాట్స్’ యాప్ లాంచ్ ఈవెంట్ లో హీరో, ప్రొడ్యూసర్ రానా దగ్గుపాటి మాట్లాడుతూ.. అందరికీ హాయ్. ఓటిటిలు లేనప్పుడు, అమితాబచ్చన్ గారు తప్పితే మిగతా స్టార్స్ ఎవరూ కూడా టీవీలోకి రానప్పుడు, తెలుగు వాళ్లకి థియేటర్ తర్వాత జెమినీ టీవీ ఒక్కటే ఉన్నప్పుడు.. ఆ సమయంలో శరత్ అనురాగ్ ని నేను కలిశాను. వీళ్లకున్న కల్చర్, ఆటిట్యూడ్, క్రియేటివ్ పర్స్పెక్టివ్ అద్భుతం. మేము కలిసి టీవీ షోలు, స్టేజి ఈవెంట్స్, మూవీ మార్కెటింగ్ ఎలా ఎన్నో చేశాం. నా ప్రతి జర్నీలో వాళ్ళు ఉన్నారు. చాయ్ షాట్స్.. కంటెంట్ క్రియేటర్స్ చేతిలో ఒక ఎక్స్ట్రీమ్ పవర్. ప్రస్తుతం 200 మంది క్రియేటర్స్ కి ఇది ఎంపార్ చేసింది. ఈరోజుల్లో ఆడియన్స్ ప్రతి దాన్ని బింజ్ వాచ్ చేస్తున్నారు. శరత్ అనురాగ్ ఆలోచనలు ఇన్నోవేటివ్ గా క్రియేటివ్ గా ఉంటాయి. వాళ్ళు తెలుగు యంగ్ ఆడియన్స్ ని అద్భుతంగా అర్థం చేసుకున్నారు. వాళ్ల జర్నీలో నేను ఒక చిన్న పార్ట్ కావడం చాలా ఆనందంగా ఉంది. ఈ జర్నీలో వాళ్ళకి ఏది కావాలన్నా నేను చేస్తాను. ఈ ఐడియా ని సపోర్ట్ చేస్తూ ఇందులో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ అందరికీ ఆల్ ది బెస్ట్. ఇందులో ఉన్న కంటెంట్ సినిమాలాగే పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందులో ఉన్న స్టార్స్, క్రియేటర్స్ అందరు కూడా మూవీ స్టార్స్ లాగే అవ్వాలని కోరుకుంటున్నాను. తప్పకుండా నేను అన్నీ షోస్ చూస్తాను. ఇంత అద్భుతమైన ఈవెంట్ చేసిన శరత్ అనురాగ్ కి కంగ్రాజులేషన్స్.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవి శంకర్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. చాయ్ షాట్స్ లాంచ్.. మా మైత్రి మూవీ మేకర్స్ లాంచ్ లాగే ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మా రెండు సంస్థలు ఒకేసారి మొదలయ్యాయి. నాకు బిగినింగ్ నుంచి శరత్ అనురాగ్ తెలుసు. నేను మా కంపెనీలో ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. నా అవైలబిలిటీ లేకపోతే శరత్ అనురాగ్ ఎలాంటి కాల్ అయినా తీసుకోవచ్చు అని చెప్పాను. వాళ్ళకి అంత ఫ్రీడమ్ ఉంది. వాళ్ళ అచీవ్మెంట్స్ నాకు చాలా ఆనందాన్ని ఇచ్చాయి. వాళ్ళు తీసుకొచ్చిన ఇన్వెస్టర్స్ చూస్తుంటే షాక్ అనిపించింది. మా వాళ్ళు ఇంత పెద్ద వాళ్ళు అయ్యారని చాలా ఆనందంగా ఉంది. ఈ కంటెంట్ చూస్తుంటే కచ్చితంగా ఇది చాలా గొప్ప స్థాయికి వెళ్తుందని నమ్మకం వచ్చింది. వేల కోట్లకి ఎదిగే పొటెన్షియల్ ఉందని నమ్ముతున్నాను. మైత్రి మూవీ మేకర్స్ లో మేము డిఫరెంట్ కంటెంట్ ని చేసాం. కానీ ఇప్పుడు ట్రెండు రోజురోజుకీ మారిపోతుంది. చాయ్ షాట్స్ ఆలోచన చూస్తుంటే మేము కూడా వాళ్లతో కొలాబరేట్ అవ్వాలని ఉంది. ఇందులో క్రియేటర్స్ యాక్టర్స్ అందరు కూడా బిగ్ స్క్రీన్ మీదకి రావాలని కూడా కోరుకుంటున్నాను. తప్పకుండా మా సపోర్ట్ ఉంటుంది. మీరు కష్టపడి పని చేయండి. మీ బిగ్ స్క్రీన్ డ్రీమ్ కూడా నెరవేరుతుంది. మైత్రి మూవీ మేకర్స్ లో అనురాగ్ శరత్ హార్డ్ వర్క్ కూడా ఉం.ది చాలా క్రియేటివ్ ఐదియాలు ఇచ్చారు. పుష్ప 2 సినిమా ప్రమోషన్స్ చాయ్ బిస్కెట్స్ ఇచ్చిన ఐడియాలే ఇంప్లిమెంట్ అయ్యాయి. బీహార్ లో చేసిన ఈవెంట్ ఐడియా వాళ్ల నుంచి వచ్చింది. వాళ్లు చాలా క్రియేటివ్ పీపుల్. కచ్చితంగా చాలా గొప్ప స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను.
చాయ్ బిస్కెట్ శరత్ మాట్లాడుతూ.. హాయ్ ఎవ్రీబడీ. టెన్ ఇయర్స్.. 2 బిలియన్ వ్యూస్, అద్భుతమైన స్టోరీస్, టాలెంట్.. ఇదొక గొప్ప ప్రయాణం. మా లైఫ్ లో నెక్స్ట్ చాప్టర్ మొదలు పెడుతున్నాం. షార్ట్ సిరీస్ ఓటిటి ప్లాట్‌ఫామ్ ని లాంచ్ చస్తున్నాం. ఈ ఆలోచన వచ్చినప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే ఏమిటి అనే ఫండమెంటల్ క్వశ్చన్ మమ్మల్ని మేము అడిగాం. పూర్వకాలం మనం మనమందరం ఎంటర్టైన్మెంట్ కోసం రాత్రుళ్ళు చలిమంట దగ్గర కూర్చుని కథలు చెప్పుకునే వాళ్ళం. ఎమోషన్స్ కనెక్షన్స్ మనకి కథలు ద్వారానే వచ్చాయి. అది మన డిఎన్ఏ లోనే ఉంది. ప్రస్తుత రోజుల్లో ఆ ఎంటర్టైన్మెంట్ ని మూడు స్క్రీన్స్ రిప్లేస్ చేశాయి. బిగ్ స్క్రీన్, టీవీ, మొబైల్ స్క్రీన్. థియేటర్ అంటే మనందరికీ ఒక పండగ. టీవీ ఇంట్లో రిలాక్స్ అవ్వడానికి ఎంటర్టైన్ అవ్వడానికి చూస్తాం. మూడో డివైస్ మొబైల్. ఈరోజు మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. రోజులో దాదాపుగా ఆరు గంటలు మనం మొబైల్ ని యూస్ చేస్తున్నామని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. ఇంతసేపు మనం యూస్ చేస్తున్న ఫోన్స్ కి కంటెంట్ ఏమిటి అనే ప్రశ్న వేసుకుంటే.. అక్కడ మాకు చాలా గ్యాప్ కనిపించింది. అప్పుడు మేము మిగతా దేశాల్లో ఏం చేస్తున్నారని గమనించాం. అమెరికా చైనా వాళ్లు మొబైల్ ఫోన్ వర్టికల్ ఫార్మెట్ కంటెంట్ వుండాలని ఫిగర్ అవుట్ చేశారు. ఇది చైనాలో ఏడు బిలియన్ డాలర్ల మార్కెట్, యూఎస్ లో రెండు, అలాగే కొరియా జపాన్‌లో కూడా బిలియన్ డాలర్ మార్కెట్ ఉంది. ప్రపంచమంతా మొబైల్ కోసం చేసిన వర్టికల్ షాట్స్ కంటెంట్స్ ని ఎంకరేజ్ చేస్తుంది. కానీ భారతదేశం కింగ్ ఆఫ్ స్టోరీ టెల్లర్స్. మనకి ప్రపంచంలోనే బెస్ట్ స్టోరీస్ ఉన్నాయి. కాకపోతే వర్టికల్ కంటెంట్ లో మనం ఎక్కడో ఇంకా వెనకాల ఉండిపోయాం. చైనా కొరియన్ కంటెంట్ డబ్బింగ్ లో చూస్తున్నాం. అందుకే నేను అనురాగ్, కృష్ణ సాయి, చాయ్ బిస్కెట్ టీ, కొంతమంది ఫ్రెండ్స్ కలిసి షార్ట్ సిరీస్ ఓ టి టి ప్లాట్‌ఫామ్ లాంచ్ చేస్తున్నాం.ఇండియాలో దీంతో ఒక కొత్త ఎరా మొదలు కాబోతుంది.అది హైదరాబాద్ నుంచే స్టార్ట్ కావడం ఆనందంగా వుంది. ఇది చాలా ఫాస్ట్ గా షార్ప్ గా ఎంగేజింగ్ గా ఉండబోతుంది అందర్నీ చాలా క్యూట్ ఎంటర్టైన్ చేస్తుంది. ఫిక్షన్ నా చేస్తున్నాం ప్రస్తుతం తెలుగులో స్టీమ్ చేస్తున్నాం త్వరలోనే అన్ని భాషల్లో లాంచ్ చేస్తాం. చాయ్ షాట్స్ ని మేము రెండు నెలల క్రితమే లాంచ్ చేశాం. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రిజల్ట్స్ మైండ్ బ్లోయింగ్ అనిపించింది. రెండేళ్లలోనే మూడున్నర లక్షల డౌన్లోడ్ జరిగాయి. ఆడియన్స్ ప్రతి సిరిస్ బింజ్ వాచ్ చేస్తున్నారు. ఈ ఎంకరేజ్మెంట్ తోనే చాయ్ షాట్స్ ఓటీటీ ని లాంచ్ చేస్తున్నాం.
చాయ్ బిస్కెట్ అనురాగ్ మాట్లాడుతూ.. మా కెరీర్ బిగినింగ్ నుంచి కొత్త కంటెంట్ క్రియేటర్స్ తో వర్క్ చేస్తున్నాం. వాళ్ళ దగ్గర చాలా మంచి ఎనర్జీ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు కూడా దేశవ్యాప్తంగా ఉండే మంచి కంటెంట్ క్రియేటర్స్ తో కంటెంట్ చేయాలని భావించాం. మీరు చూసినప్పుడు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇప్పటివరకు మేము చేసిన 75 షోస్ లో కొత్త టాలెంట్ ని చూస్తారు. కొత్త టాలెంట్ ని తీసుకురావాలనేది మా ప్రయత్నం. ఈ యాప్ ఓపెన్ చేస్తే ఇండియా మొత్తం చూసేలా ఉండాలి. అందుకే మేము మూలల్లోకి వెళ్లి ఒక గొప్ప కంటెంట్ తీసుకురావాలని ప్రయత్నించాం. మేము ఇందులో ఇంకో మంచి ఫీచర్ తీసుకొచ్చాం. ఒక షో చూసినప్పుడు ఇందులో టెక్నీషియన్స్ యాక్టర్స్ అందరి పేర్లు ఉంటాయి.పర్ఫార్మెన్స్ నచ్చితే ఆ పేరు దగ్గరికి వెళ్లి క్లాప్ కూడా ఇవ్వచ్చు. మీకు నచ్చితే వాళ్లకి కొంత మనీ కూడా కాంట్రిబ్యూట్ చేయొచ్చు. మేము కొత్తగా యాడ్ చేసిన ఫీచర్ ఇది.
సీటీవో కృష్ణ మాట్లాడుతూ.. శరత్ అనురాగ్ తో కలిసి వర్క్ చేయడం చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది. మేం చాలా అద్భుతమైన ప్రోడక్ట్ ని తయారు చేశాం. వర్టికల్ పాటర్న్ లో తయారుచేసిన కంటెంట్. ప్రతి ఎపిసోడ్ రెండు నిమిషాలు ఉంటుంది. ప్రతి ఎపిసోడ్లో మంచి హుక్ పాయింట్ ఉంటుంది. ఈ యాప్ యూస్ చేయడానికి అందరికీ అనువుగా ఉంటుంది. చాలా ఈజీగా నావిగేట్ చేయొచ్చు. చాలా ఈజీ క్విక్ గా ఉంటుంది. ఇందులో ఉండే కంటెంట్ మీ అందరికీ నచ్చుతుంది. పేమెంట్ మోడ్ కూడా చాలా ఈజీ. మా వీఐపీ మెంబర్ ఇవ్వండి. కంటెంట్ ని ఎంజాయ్ చేయండి.
రాపిడో సహ వ్యవస్థాపకుడు రిషికేశ్.. అందరికీ హాయ్. శరత్ స్టొరీ టెల్లింగ్ హిస్టరీ చెబుతున్నప్పుడు చాలా ఆసక్తికరంగా అనిపించింది. చాయ్ షాట్స్ ఎంటర్టైమెంట్, స్టొరీ టెల్లింగ్ ని రీడిఫైన్ చేస్తుంది. అది హైదరాబాదు నుంచి స్టార్ట్ కావడం చాలా అనందంగా వుంది. తప్పకుండా చాయ్ షాట్స్ మరో యూనికాన్ ఇండస్ట్రీ అవుతుంది.
రెడ్‌బస్ వ్యవస్థాపకుడు ఫణీంద్ర మాట్లాడుతూ.. చాయ్ షాట్స్ రిఫ్లెక్షన్ ఆఫ్ తెలంగాణ రైసింగ్. చాయ్ షాట్స్ లో టాప్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేశారు. అలాంటి ఇన్వెస్టర్స్ నుంచి ఇన్వెస్ట్మెంట్ తీసుకురావడం గ్రేట్ థింగ్. షాట్స్ లో చాలా వరకూ వల్గర్ కంటెంట్ చేస్తారు. కానీ మీరు గమనిస్తే చాయ్ షాట్స్ కంటెంట్ చాలా అద్భుతంగా ఉంటుంది. కస్టమర్స్ టైంకి వ్యాల్యూ ఇచ్చేలా ఉంటుంది. ఇలాంటి మంచి సంస్థలు నేను భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. ఇండియా వ్యాప్తంగా ఉండే కంటెంట్ క్రియేటర్స్ కి ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తుంది. తప్పకుండా ఇది అద్భుతాలు చేస్తుందని నమ్మకం ఉంది.
డార్విన్‌బాక్స్ సహ వ్యవస్థాపకుడు రోహిత్ చెన్నమనేని మాట్లాడుతూ.. నేను చాయ్ బిస్కెట్ కి ఫ్యాన్. శరత్ వచ్చి మేము టెక్నాలజీ యాప్ కంపెనీని స్టార్ట్ చేయబోతున్నామని చెప్పారు. తను ఈ కంటెంట్ ఐడియా చెప్పినప్పుడు నాకు చాలా నచ్చింది. శరత్ అనురాగ్ ఫ్యాషన్ అద్భుతం. హైదరాబాదు నుంచి ఇది మొదలు కావడం ఆనందంగా ఉంది. ఇందులో పాట కావడం చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఇది హైదరాబాదు నుంచి మొదలై ఒక గ్లోబల్ కంపెనీ గా ఎదుగుతుందని నమ్మకం ఉంది. తెలుగు డబ్బింగ్ షాట్స్ ఫ్యూచర్లో ప్రపంచమంతా చుస్తారని నమ్ముతున్నాను.
సెంట్రల్ క్యాటలిస్ట్ రాహుల్ హుమాయున్ మాట్లాడుతూ.. అందరికీ హాయ్.. శరత్ ని కలిసినప్పుడు చాలా ఎనర్జిటిక్ గా అనిపించింది. తను చాలా రా ఎమోషన్ తో మాట్లాడాడు. తనకి కంటెంట్ మీద చాలా పాషన్ ఉంది .ఈ రోజుల్లో కంటెంట్ కింగ్. చాయ్ బిస్కెట్ తో కలిసి పనిచేయడం చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది. మేము ఇండియా కోసం కంటెంట్ ని బిల్డ్ చేస్తున్నాం. ఇలాంటి కల్చర్ ని కచ్చితంగా ఆడియన్స్ ముందుకు తీసుకెళ్తారని నమ్మకం ఉంది. హైదరాబాదు నుంచి ఇది మొదలు కావడం చాలా ఆనందంగా ఉంది. ఈ జర్నీ కోసం చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. ఈ ఈవెంట్ లో చాయ్ బిస్కెట్ టీం, క్రియేటర్స్ అందరూ పాల్గొన్నారు.
ప్రస్తుతం మ్యాసీవ్ తెలుగు లైబ్రరీతో లాంచ్ అయిన చాయ్ షాట్స్ భారత్‌లోని మొబైల్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా రూపుదిద్దుకున్న ప్లాట్‌ఫారమ్‌గా ఎదగాలనే లక్ష్యంతో త్వరలో హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బంగ్లా, అస్సామీస్ భాషల్లో విస్తరించబోతోంది. .
చాయ్ షాట్స్ గురించి:
భారతదేశంలో తొలి రీజినల్, షార్ట్-సిరీస్ ఓటీటీ—స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల కోసం రూపొందించిన హై-క్వాలిటీ వెర్టికల్ వీడియో ప్లాట్‌ఫారమ్. 2 నిమిషాల లోపు ఎపిసోడ్లతో కథలను కొత్తగా చెప్పే ప్రయత్నం. గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్లలో అందుబాటులో ఉంది.
