
Balan First Look Poster Unveiled
Renowned for their grand filmmaking, KVN Productions in collaboration with Thespian Films are producing a massive Malayalam film. The movie is directed by Chidambaram, the filmmaker of Manjummel Boys, with a script penned by Aavesham fame director Jithu Madhavan. The film is being produced by Venkat K Narayana and Shailaja Desai Fen. The project has been officially titled “Balan”, and its first look poster has been unveiled.
Recently, the film was formally launched with a traditional pooja ceremony, and the first schedule of shooting has already begun. With this film, KVN Productions is making its debut in the Malayalam film industry. Taking to social media, KVN Productions stated that they are proud to present this film in association with Thespian Films and that the regular shoot is now underway. The makers also confirmed that more updates about Balan will be revealed soon.
Technical Crew
Editor – Vivek Harshan
DOP – Shyju Khalid
Music – Sushin Shyam
PRO – GS K Media (Suresh – Srinivas)
Writer – Jithu Madhavan
Producers – Venkat K Narayana, Shailaja Desai Fen
Director – Chidambaram
ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌసెస్ కేవీఎన్ ప్రొడక్షన్స్, తెస్పియన్ ఫిలింస్, “మంజుమ్మెల్ బాయ్స్” ఫేం డైరెక్టర్ చిదంబరం కాంబో మూవీ “బాలన్” ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
గ్రాండియర్ ఫిలిం మేకింగ్ కు మారుపేరైన కేవీఎన్ ప్రొడక్షన్స్, తెస్పియన్ ఫిలింస్ సంయుక్తంగా మలయాళంలో ఓ హ్యూజ్ మూవీని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి “ఆవేశం” ఫేమ్ డైరెక్టర్ జితూ మాధవన్ అందించిన స్క్రిప్ట్ తో “మంజుమ్మెల్ బాయ్స్” చిత్ర దర్శకుడు చిదంబరం దర్శకత్వం వహిస్తున్నారు. వెంకట్ కె నారాయణ, శైలజా దేశాయి ఫెన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి “బాలన్” అనే టైటిల్ ఖరారు చేసి, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.
తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది. తొలి షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభించారు. ఈ చిత్రంతో మలయాళ చిత్ర పరిశ్రమలోకి కేవీఎన్ ప్రొడక్షన్స్ అడుగుపెడుతోంది. తెస్పియన్ ఫిలింస్ తో కలిసి తాము ఈ చిత్రాన్ని సగర్వంగా సమర్పిస్తున్నామని, రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించామని సోషల్ మీడియా పోస్ట్ ద్వారా కేవీఎన్ ప్రొడక్షన్స్ పేర్కొంది. “బాలన్” చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.
టెక్నికల్ టీమ్
—————-
ఎడిటర్ – వివేక్ హర్షన్
డీపీవో – షైజు ఖాలిద్
మ్యూజిక్ – సుషిన్ శ్యామ్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
రచన – జితూ మాధవన్
నిర్మాతలు – వెంకట్ కె నారాయణ, శైలజా దేశాయి ఫెన్
దర్శకత్వం – చిదంబరం