Electrifying Breezy Number Chinni Chinni Unveiled From Itlu Arjuna

Amma… naku aa abbayi kavali Teaser Released
నిర్మాతగా శైలజ రెడ్డి – హీరోగా పవన్ మహావీర్ లకు ఉజ్వల భవిష్యత్తునిచ్చే చిత్రం అమ్మా… నాకు ఆ అబ్బాయి కావాలి – టీజర్ రిలీజ్ వేడుకలో అతిధుల అభిభాషణ
జిఎస్ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై పవన్ మహావీర్ ను హీరోగా పరిచయం చేస్తూ… ప్రముఖ మహిళా వ్యాపారవేత్త శైలజ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వినూత్న ప్రేమకధా చిత్రం “అమ్మా… నాకు ఆ అబ్బాయి కావాలి”. శివాల ప్రభాకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వర్షిక, సుహానా హీరోయిన్లు. సుమన్, రావు రమేష్, రాజీవ్ కనకాల, సత్యకృష్ణ, సుజాత తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటూ త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం టీజర్ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాదులోని ప్రసాద్ ల్యాబ్ లో అత్యంత ఘనంగా జరిగింది!!
ఆంధ్రప్రదేశ్ ఫిలిం డవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ భరత్ భూషణ్, నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్, ఫెడరేషన్ అధ్యక్షులు వల్లభనేని అనిల్, ఫిలిం చాంబర్ ప్రధాన కార్యదర్శి కే అశోక్ కుమార్, దర్శకుల సంఘం అధ్యక్షులు విఎన్ ఆదిత్య, సీనియర్ ఫిలిం జర్నలిస్టులు ప్రభు, సురేష్ కొండేటి, ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ వేడుకలో పాల్గొన్నారు. “తొలి చిత్రంతోనే అన్ని శాఖల పట్ల అవగాహన పెంచుకున్న శైలుజా రెడ్డి సినిమా నిర్మాణ రంగంలోనూ అసాధారణ విజయం సాధించడం ఖాయమని” అతిథులు ఆకాంక్షించారు. “హీరోగా పరిచయమవుతున్న పవన్ మహావీర్ ను చూస్తుంటే… ఇది అతని తొలి చిత్రం అనిపించలేదని, అతనిలో అంత ఈజ్ ఉందని” అన్నారు. “లండన్ లో మెడిసిన్ చదువుతున్న పవన్ మహావీర్ టాలీవుడ్ కు దొరికిన మరో మంచి హీరో” అని కొనియాడారు!!
“అమ్మా… నాకు ఆ అబ్బాయి కావాలి” చిత్రం అత్యద్భుతంగా రూపొందడంలో సహకరించిన సాంకేతిక నిపుణులకు, నటీనటులకు, టీజర్ విడుదలకు అతిథులుగా విచ్చేసిన చిత్ర ప్రముఖులకు నిర్మాత శైలజ రెడ్డి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. నిర్మాతగా శైలజ
రెడ్డి, హీరోగా పవన్ మహావీర్ లకు ఉజ్వల భవిష్యత్తు ఉందని దర్శకుడు శివాల ప్రభాకర్ పేర్కొన్నారు. ఈ చిత్రంలో నటించే అవకాశం లభించడం పట్ల హీరోయిన్స్ వర్షిక, సుహానా, సుజాత, చైల్డ్ ఆర్టిస్ట్ సుప్రీతి సంతోషం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, పబ్లిసిటీ డిజైనర్: వివారెడ్డి, ఫైట్స్; నందు, కొరియగ్రఫీ : భాను మాస్టర్ – మొయిన్ మాస్టర్, సంగీతం: సాయి కార్తీక్, ఛాయాగ్రహణం: మహేందర్.ఎం., ఎడిటర్: నందమూరి హరి, కో-డైరెక్టర్: రావుశ్రీ, నిర్మాత: జి. శైలజ రెడ్డి, స్క్రీన్ ప్లే – దర్శకత్వం: శివాల ప్రభాకర్!!
