
సోల్ ట్రిప్ వంటి ట్రావెల్ అడ్వెంచరస్ టాక్ షో పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను – శ్రీకాంత్
రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్, పి.యు.ఎన్.వర్మ సమర్పణలో గండభేరుండ ఆర్ట్స్ బ్యానర్ మీద విజయ్ దాట్ల తెరకెక్కించిన ట్రావెల్ అడ్వెంచరస్ టాక్ షో ‘సోల్ ట్రిప్’. త్వరలోనే ఈ టాక్ షో మొదటి సీజన్ స్ట్రీమింగ్ కాబోతోంది. జగపతి బాబు, శ్రీకాంత్, కమెడియన్ అలీ వంటి ఆర్టిస్టులని ప్రకృతితో మమేకం చేస్తూ విజయ్ దాట్ల ప్రత్యేకంగా ముచ్చట్లు పెట్టారు. ఈ ఇంటర్వ్యూలకు సంబంధించిన ఆరు ఎపిసోడ్స్‌ని ప్రస్తుతం ఫినిష్ చేశారు. ఈ క్రమంలో ‘సోల్ ట్రిప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో..
*శ్రీకాంత్ మాట్లాడుతూ* .. ‘నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. నాకు ఎప్పుడు టైం దొరికినా ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలిసి ట్రిప్‌కు వెళ్తుంటాను. వేరే ఊరికి వెళ్లి అక్కడి కల్చర్‌కు తగ్గట్టుగా బతకడం అనే ఈ కాన్సెప్ట్ నాకు చాలా నచ్చింది. మేం దీని కోసం గోవాకి వెళ్లాం. అక్కడే అందరినీ ఇంటర్వ్యూ చేశాం. రాత్రి పూట వర్షం పడుతున్నా కూడా షూటింగ్ చేశాం. ఎంతో ఎంజాయ్ చేస్తూ షూటింగ్ చేసుకున్నాం. ఈ ఫస్ట్ సీజన్లో ఆరు ఎపిసోడ్స్ ఉన్నాయి. అన్నీ కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
*శ్యామలా దేవీ మాట్లాడుతూ* .. ‘‘సోల్ ట్రిప్’ నాకు ఎంతో సహజంగా అనిపించింది. ఈ ట్రైలర్ నాకు చాలా నచ్చింది. విజయ్ చాలా గొప్పగా చిత్రీకరించాడు. విజయ్ చిన్నతనం నుంచీ మా కుటుంబానికి ఎంతో బాగా తెలుసు. ఇంత మంచి ఆలోచన అతనికి రావడం గొప్ప విషయం. కృష్ణంరాజు గారికి కూడా ట్రిప్స్‌కి వెళ్లడం అంటే చాలా ఇష్టం. ‘సోల్ ట్రిప్’ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
*నటుడు అలీ మాట్లాడుతూ* .. ‘‘సోల్ ట్రిప్’ కోసం విజయ్ మీద నిర్మాతలు చాలా నమ్మకంతో ఉన్నారు. ఆ నమ్మకంతోనే మా అందరినీ తీసుకు వెళ్లి ఆరు ఎపిసోడ్స్ చేశాడు. విజయ్ ఇదే ఉత్సాహాంతో ఆరు వందల ఎపిసోడ్స్ చేయాలని కోరుకుంటున్నాను. అక్కడి ఫుడ్, కల్చర్‌ని పరిచయం చేస్తూ ఒక్కో ఏరియాలో మాతో విజయ్ షూటింగ్ చేశాడు. గోవా, కులు మనాలి ఇలా ఎన్నో ఏరియాల్లో విజయ్ రెక్కీ చేసి మా అందరినీ అక్కడికి తీసుకు వెళ్లాడు. ‘సోల్ ట్రిప్’ టైటిల్ డిజైన్ కూడా అద్భుతంగా ఉంది. విజయ్ ఆల్రెడీ హీరోగా మూడు సినిమాలు చేశాడు. ఇప్పుడు రైటర్, డైరెక్టర్‌గా మారిపోయాడు. ఇలానే విజయ్ ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
*విజయ్ దాట్ల మాట్లాడుతూ* .. ‘మనం ప్రకృతితో మమేకం అయినప్పుడు ఎంతో నేర్చుకుంటాం. అందుకే ఈ కాన్సెప్ట్‌ను తీసుకున్నాం. కానీ ఈ కాన్సెప్ట్‌ని నమ్మే ప్రొడ్యూసర్స్, హీరోలు కావాలి. ఆ తరువాత తమాడ మీడియా కార్తిక్‌కి ఈ ఐడియాని చెప్పాను. జగపతి బాబు గారు ఫస్ట్ నన్ను నమ్మారు. మూడు రోజుల్లోనే షూటింగ్ చేసేద్దామని అన్నారు. ఆయనకు ఇష్టమైన మారెడుమిల్లిలోనే షూటింగ్ చేశాం.ఆ తరువాత శ్రీకాంత్ గారు, అలీ, శివానీ, శివాత్మిక, ఆకాష్ పూరి, వర్ష బొల్లమ్మలతో ఎపిసోడ్స్ చేశాం. అలా మొదటి సీజన్‌ను పూర్తి చేసుకున్నాం. ఈ ప్రయాణంలో నాకు తోడుగా నిలిచిన నా టీం, నా నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు.
*సతీష్ వేగేశ్న మాట్లాడుతూ* .. ‘ప్రకృతిలో ఇంటర్వ్యూ చేయడం, ప్రకృతితో మమేకం అయ్యే ఇలాంటి కాన్సెప్ట్‌ను తీసుకు వచ్చిన విజయ్‌కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఇంత వరకు ఎన్నో ఇంటర్వ్యూలు చూసి ఉన్నాం. కానీ ఈ ‘సోలో ట్రిప్’ ట్రైలర్‌లోని ఇంటర్వ్యూ మాత్రం అద్భుతంగా ఉంది. ప్రతీ ఒక్క ఆర్టిస్ట్ ఎన్నో జీవిత సత్యాల్ని చెప్పాలి. అందరికీ స్పూర్తినిచ్చేలా వారి మాటలున్నాయి. ఆరు ఎపిసోడ్స్ కాదు.. ఆరు వందల ఎపిసోడ్స్ చేయాలి’ అని అన్నారు.
*రిధా ఖాన్ మాట్లాడుతూ* .. ‘నేచరత్లో కనెక్ట్ చేసే ఈ ఇంటర్వ్యూ కాన్సెప్ట్ నాకు చాలా నచ్చింది. ‘సోల్ ట్రిప్’ ఇలా ముందుకు వెళ్తూనే ఉండాలి. విజయ్ గారికి మంచి సక్సెస్ రావాలి. మా రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్, గోపాల్ మామకి మంచి విజయాలు దక్కాలి’ అని అన్నారు.
*పి.యు.ఎన్.వర్మ మాట్లాడుతూ* .. ‘‘సోల్ ట్రిప్’ అనే పేరులోనే ఓ వైబ్ ఉంది. పాటలు, ట్రైలర్ చూసిన తరువాత అందరూ ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు. ప్రకృతితో మమేకం అయ్యేలా చూపించారు. విజయ్‌కి కంగ్రాట్స్. ఇలాంటి కాన్సెప్ట్ ఇండియాలోనే ఫస్ట్ టైం అని చెప్పుకోవచ్చు. ఇది ఇలానే ముందుకు కొనసాగుతూనే ఉండాలని కోరుకుంటున్నాం’ అని అన్నారు.
*టెక్నికల్ టీం*
బ్యానర్: గండభేరుండ ఆర్ట్స్
సమర్పణ: రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్, పి.యు.ఎన్.వర్మ
కాన్సెప్ట్ • హోస్ట్ • దర్శకుడు: విజయ్ దాట్ల
CEO: కుషీ
సహ నిర్మాతలు: చైతన్య కలిదిండి, కొల్లి గోపాల కృష్ణ, ఉదయ్ సందీప్
లైన్ ప్రొడ్యూసర్స్: చల్లా సాంబయ్య, గుండ ప్రభాకర్
కో-డైరెక్టర్: కన్నా శ్రీకృష్ణ
సంగీతం: సాహిత్య సాగర్
DOP: అచ్చుత్ వర్మ
ఎడిటర్: అనిల్ కుమార్ వర్మ అల్లూరి
క్రియేటివ్ ప్రొడ్యూసర్: కార్తీక్ అన్నం
ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: సిద్దు వర్మ, రాజశేఖర్, నాగ
పి.ఆర్.ఓ: చంద్ర వట్టి కూటి, మోహన్ తుమ్మల
