G.O.A.T మాస్ ఫన్ యాక్షన్ ఎలిమెంట్స్ తో సినిమా అందరికీ నచ్చేలా ఉంటుంది

సైక్ సిద్ధార్థ తో ఈసారి ఖచ్చితంగా హిట్ కొడుతున్నాం – శ్రీ నందు
యంగ్ హీరో శ్రీ నందు తన అప్ కమింగ్ మూవీ ‘సైక్ సిద్ధార్థ’కు రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా బ్యాకింగ్ తో వస్తున్నారు. ఈ చిత్రానికి వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించారు. స్పిరిట్ మీడియా, నందునెస్ కీప్ రోలింగ్ పిక్చర్స్ బ్యానర్లపై శ్రీ నందు, శ్యామ్ సుందర్ రెడ్డి తుడి సంయుక్తంగా నిర్మించారు.
మ్యాడ్ మాక్స్-స్టైల్ మ్యాడ్‌నెస్‌తో యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందిన సైక్ సిద్ధార్థ లో హై ఎనర్జీ ఎంటర్టైన్మెంట్ వుండబోతుంది. ఈ చిత్రంలో యామిని భాస్కర్ కథానాయికగా నటించగా, ప్రియాంక రెబెకా శ్రీనివాస్, సాక్షి అత్రీ, మౌనిక కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. డిసెంబర్ 12న సైక్ సిద్ధార్థ గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ రోజు మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో శ్రీ నందు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం.. చాలా ఎమోషనల్ గా ఉంది. ఇదంతా ఒక టీం జర్నీ. డైరెక్టర్ వరుణ్ ఆర్కిటెక్చర్ ఆ ఫీల్డ్ లో గోల్డ్ మెడల్స్ వచ్చాయి. తనకి ఫిలిం మేకింగ్ అంటే ప్యాషన్. అన్నపూర్ణ స్టూడెంట్. రామనాయుడులో డెబ్యు చేస్తున్నాడు. నాకు రైటింగ్, డైరెక్షన్ మీద మొదటి నుంచే ఆసక్తి ఉంది. కొన్ని మ్యూజిక్ వీడియోస్ కి డైరెక్షన్ చేశా. బ్రోచేవారు బ్యానర్లో నాకు డైరెక్టర్ గా ఒక సినిమా ఓకే అయింది. అప్పుడే ఒక రైటర్ కావాలంటే వరుణ్ పరిచయమయ్యాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు ఆగిపోయింది .ఆ జర్నీలో మా ఇద్దరి మధ్య ఒక నమ్మకం వచ్చింది. నిజానికి ఈ సినిమా ఒక డెమో లాగా షూట్ చేశాడు. దాన్ని ఒక ఓటీటీ సంస్థ నుంచి ఆఫర్ కూడా వచ్చింది. అయితే ఇది మంచి స్కేల్లో ఇంకా చాలామందికి రీచ్ కావాల్సిన కథ అని చెప్పను. ఆ తర్వాత మేమే ఈ సినిమాని చేయాలనుకుని నిర్ణయించుకున్నాం. వరుణ్ నా నమ్మకాలు నిలబెట్టుకున్నాడు.
ఈ సినిమాకి మీలాంటి యువకుడి కథ అనే టాగ్లైన్ పెట్టాం. ఈ కథ కూడా ఇప్పుడున్న సొసైటీకి రిలేట్ అయ్యేలాగా యూత్ కి కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. లెజెండ్రీ రాఘవేంద్రరావు గారు, డైరెక్టర్ సాయి రాజేష్ గారు, అనుదీప్ ఈ సినిమా చూసి చాలా అభినందించారు. సురేష్ బాబు గారు చూసి వెంటనే సైన్ చేశారు. నిర్మాతగా నేను ఫ్రాఫిట్ లో ఉన్నాను. ఈ సినిమాని తీసుకున్న సురేష్ బాబు గారు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇది టేబుల్ ప్రాఫిట్ ఫిలిం. పెళ్లిచూపులు సినిమాలో సెకండ్ లీడ్ గా చేశాను. ఆ సినిమా సక్సెస్ సమయంలోనే నాకు ఇలాంటి ఒక రోజు రావాలని బలంగా కోరుకున్నాను. ఈరోజు సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాని తీసుకోవడం నా డ్రీమ్ నెరవేరినట్లుగా అనిపించింది.
ఇండస్ట్రీకి వచ్చి 18 ఏళ్ళు అవుతుంది. ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో ప్రతి పాత్రకి న్యాయం చేశాను. ఏ ఒక్కరోజు కూడా నా నటన గురించి నెగిటివ్ కామెంట్స్ రాలేదు. ఆర్ సి బి లో విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్స్ ఉన్నప్పటికీ వాళ్లకి విజయం రావడానికి 18 ఏళ్లు పట్టింది. నా 18 ఏళ్ల జర్నీ అయింది. ఇప్పుడు చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నా. ఈసారి విజయం మనదే. సినిమా చూడండి. ఫస్ట్ ఆఫ్ కొందరికి నచ్చుతుంది. సెకండాఫ్ అందరికీ నచ్చుతుంది. సినిమా మీకు నచ్చకపోతే ప్రెస్ మీట్ పెట్టి మరి మీకు క్షమాపణలు చెప్తాను. ఇది పొగరుగా చెప్పడం లేదు చాలా వినయంగా చెప్తున్నాను. ఒకవేళ ఫెయిల్ అయినా ఇక్కడే ఉంటా సినిమాలు చేస్తాను. గెలిచే వరకు ప్రయత్నిస్తూనే ఉంటాను. ఈ ఒక్కసారికి ఒక ఛాన్స్ ఇవ్వండి. అందరూ థియేటర్స్ కి వచ్చి సినిమా చూడండి.
ఈ సినిమా కోసం నేను 18 కిలోలు తగ్గాను. ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా కనిపించడానికి చాలా హార్డ్ వర్క్ చేశాను. ఈ క్యారెక్టర్ పై అర్జున్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ లేదు కానీ ఫిలిం మేకింగ్ పరంగా డైరెక్టర్ సందీప్ రెడ్డివంగా గారి ప్రభావం ఉంది. ఆయన ఒక కొత్త ఫిలిం మేకింగ్ లాంగ్వేజ్ ని పరిచయం చేశారు. గ్రామర్ ఆఫ్ ఎడిటింగ్ ఫిలిం మేకింగ్ చాలా కొత్తగా ప్రయత్నించారు. ఈ సినిమా మొదలెట్టినప్పుడే రానా గారికి ఇలాంటి కంటెంట్ నచ్చుతుంది ఆయనకి తప్పకుండా చూపిద్దామని అనుకున్నాం. మేము అనుకున్నదిఈరోజు నిజమైంది. సెన్సార్ బోర్డు సభ్యులకి ఈ సినిమా చాలా నచ్చింది. సినిమా గురించి చాలా గొప్పగా మాట్లాడారు. నా కెరీర్ కి ఇది బంగారు బాట లాంటి సినిమా అవుతుంది. మీరందరూ నా జర్నీ చూస్తున్నారు. నేను ఈరోజు ఎమోషనల్ అయ్యాను. సినిమా చూసిన తర్వాత మీరు ఎమోషనల్ నన్ను హగ్ చేసుకునే రోజు డిసెంబర్ 12 అవుతుందని నేను నమ్ముతున్నాను.
డైరెక్టర్ వరుణ్ రెడ్డి మాట్లాడుతూ… ట్రైలర్ మీ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉంది. నందు కసితో వర్క్ చేయడం వల్లనే ఇంత అద్భుతంగా వచ్చింది. పెళ్లిచూపులు కేరాఫ్ కంచరపాలెం తర్వాత సురేష్ గారు పూర్తిగా కొన్న సినిమా ఇది. సురేష్ బాబు గారు రాత్రి చూసి పొద్దున్నే కలవమన్నారు. ఆయన ఇంత త్వరగా ఎప్పుడు కూడా నిర్ణయం తీసుకోరు. గత పదేళ్ళలో ఇంత త్వరగా నిర్ణయం తీసుకున్నది ఇదే మొదటిసారి. మంచి హై ఇచ్చే టీం తో ఈ సినిమా చేయడం జరిగింది. అందుకే ఇంత ఎనర్జీతో మాట్లడుతున్నాం. తప్పకుండా సినిమా మీ అందరిని ఎంటర్టైన్ చేస్తుంది. అందరు కూడా ఈ సినిమాని గెలిపించాలని కోరుకుంటున్నాను.
హీరోయిన్ యామిని భాస్కర్ మాట్లాడుతూ… చాలా గ్యాప్ తర్వాత నా సినిమా రిలీజ్ అవుతుంది. మీడియా ప్రేక్షకులు నన్ను చాలా పాజిటివ్‌గా ఎంకరేజ్ చేశారు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. మీ అందరికీ మీ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను. డైరెక్టర్ వరుణ్ చాలా సెన్సిబుల్ గా ఈ కథని రాశారు. ఇందులో రెండు క్యారెక్టర్స్ చాలా అద్భుతంగా డిజైన్ చేయడం జరిగింది. డిసెంబర్ 12న ఈ సినిమా మీ ముందుకు వస్తుంది. తప్పకుండా అందరూ చూసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.
దర్శకత్వం: వరుణ్ రెడ్డి
ఎడిషనల్ స్క్రీన్‌ప్లే: శ్రీ నందు
నిర్మాతలు: శ్రీ నందు, శ్యామ్ సుందర్ రెడ్డి తుడి
సంగీతం: స్మరన్ సాయి
డిఓపి: కె ప్రకాష్ రెడ్డి
ఎడిటర్: ప్రతీక్ నూతి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రోహిత్ మక్కపాటి
సౌండ్ డిజైనర్లు: చతుర్వేది తిరునగరి, ఉదయ్ అప్పల
మిక్సింగ్ ఇంజనీర్: సంతోష్ వోడ్నాల
కలర్ గ్రేడింగ్: శ్రీ సారథి స్టూడియోస్
ప్రొడక్షన్ హౌస్: స్పిరిట్ మీడియా, నందునెస్ కీప్ రోలింగ్ పిక్చర్స్
డిస్ట్రిబ్యూషన్: ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్
పీఆర్వో: వంశీ శేఖర్
మార్కెటింగ్: స్పిరిట్ మీడియా
డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ: సౌత్బా
