సెలెబ్రిటీల మీద బయట వచ్చే రూమర్లను బేస్ చేసుకుని తెరకెక్కిన “మిస్టర్ సెలెబ్రిటీ” – టీజర్ విడుదల
సుదర్శన్ పరుచూరి హీరోగా మిస్టర్ సెలెబ్రిటీ అనే సినిమాను ఎన్. పాండురంగారావు, చిన్నరెడ్డయ్య సంయుక్తంగా ఆర్పి సినిమాస్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. ఈ మూవీకి చందిన రవి కిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో వరలక్ష్మీ శరత్ కుమార్, శ్రీ దీక్ష, నాజర్, రఘుబాబు వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశారు. సోమవారం నాడు టీజర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
‘రామాయణం కాలంలో చాకలి వాడు అన్న పుకార్ల మాటలకు సీతాదేవీ అరణ్య వాసం, అగ్ని ప్రవేశం చేయాల్సి వచ్చింది.. కాలం మారింది కానీ ఈ పుకారు మాటల వల్ల పోయే ప్రాణాలు ఇంకా పోతూనే ఉన్నాయి’ అంటూ ప్రారంభమైన ఈ టీజర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలన్నీ కూడా ఇందులో ఉన్నాయని అర్థం అవుతోంది. సుదర్శన్ యాక్టింగ్, యాక్షన్ కూడా ఈ టీజర్లో హైలెట్ అవుతోంది. రూమర్లు, పుకార్లను బేస్ చేసుకుని ఈ కథను ప్రజెంట్ ట్రెండ్‌కు తగ్గట్టుగా దర్శకుడు రవి కిషోర్ తెరకెక్కించినట్టుగా కనిపిస్తోంది. టీజర్ లాంచ్ అనంతరం ఈ కార్యక్రమంలో..
పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ‘నేను, మా తమ్ముడు కలిసి ఈ సినిమాను చూశాం. మా తమ్ముడు చాలా మంచి విమర్శకుడు. సుదర్శన్ బాగున్నాడని, సినిమా బాగుందని మెచ్చుకున్నారు. హీరోల కొడుకులు హీరోలు అవుతుంటారు.. కానీ మా మనవడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. పగ తీర్చుకోవడానికి ఈ జన్మ ఎత్తాను.. ప్రేమ కోసం ఇంకో జన్మ ఎత్తుతాను అని ఖైదీ కథను సింగిల్ లైన్లో చెప్పాం. ప్రేక్షకుడు ఊహించింది జరగాలి.. కానీ ఊహించని టైంలో జరగాలి. ఇవన్నీ ఈ మూవీలో జరుగుతాయి. సెలెబ్రిటీల మీద బయట వచ్చే రూమర్లను బేస్ చేసుకుని ఈ కథను రాసుకున్న దర్శకుడు రవి కిషోర్ సినిమాను బాగా తీశారు. గిరిబాబుతో మాకు విడదీయలేని బంధం ఉంది.రఘు బాబు తెరపై అద్భుతంగా నవ్విస్తాడు. సాయి మాధవ్ బుర్రా చాలా మంచి రచయిత. మ్యాటర్ ఉన్న డైలాగ్ రైటర్. ఆడియెన్స్ కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్‌తో తీసిన ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలి’ అని అన్నారు.
పరుచూరి సుదర్శన్ మాట్లాడుతూ.. ‘మిస్టర్ సెలెబ్రిటీతో ఇండస్ట్రీలోకి పరిచయం అవుతుండటం ఆనందంగా ఉంది. నేను హీరో అవుతానని చెప్పగానే మా తాత గారు నాకు కొన్ని పరీక్షలు పెట్టారు. ఎవ్వరికీ నా గురించి చెప్పకుండా జూనియర్ ఆర్టిస్ట్‌గా పని చేశాను. సినిమా కష్టాలన్నీ దగ్గరగా చూశాను. ఈ కథ నన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఆ విషయాన్ని మా తాత గారికి చెప్పాను. ఒళ్లు దగ్గర పెట్టుకుని నటించు అని చెప్పారు. రఘుబాబు గారి కామెడీతో సెట్లో సీన్ చేస్తున్నప్పుడు చాలా నవ్వేవాడ్ని. సాయి మాధవ్ గారంటే నాకు చాలా ఇష్టం. గొప్ప రచయితే కాకుండా మంచి వ్యక్తి. అందరూ మా సినిమాను చూసి మా టీంను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
డైరెక్టర్ రవి కిషోర్ మాట్లాడుతూ.. ‘మిస్టర్ సెలెబ్రిటీ కథ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఓ ప్రయోగాత్మక కథ. సుదర్శన్ గారికి ఈ కథను చెప్పినప్పుడు చాలా బాగుందని అన్నారు. పరుచూరి గారికి స్క్రిప్ట్ చూపించాం. చిన్న చిన్న కరెక్షన్స్ చేశారు. మా హీరో సుదర్శన్ సెట్లో అందరి కంటే ముందు వచ్చేవారు. ఎంతో ఒదిగి ఉండేవారు. నిర్మాత గారు మాకు ఏం కావాలో అది ఇచ్చారు.. ఎంత పెద్ద ఆర్టిసుల్ని అయినా మాకు ఇచ్చారు. సాధారణ వ్యక్తి నుంచి సెలెబ్రిటీల వరకు ఇబ్బంది పడే ఇష్యూని సినిమాలో చూపించాను. చిన్న సమస్యలే కదా? చిన్న మాటలే కదా? అనిపించొచ్చు. కానీ ఎంత ప్రభావం చూపిస్తుందో ఈ సినిమాలో ఉంటుంది. ఈ మూవీకి క్లైమాక్స్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. మా సినిమా అందరికీ నచ్చుతుంది’ అని అన్నారు.
చిన్న రెడ్డయ్య మాట్లాడుతూ.. ‘సుదర్శన్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. పరుచూరి వారి ఇంటి నుంచి హీరోని పరిచయం చేస్తుండటం ఆనందంగా ఉంది. ఈ జనరేషన్‌కు తగ్గ కంటెంట్‌తో సినిమాను తీశాం. ఈ మూవీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
ఎడిటర్ శివ శర్వాణి మాట్లాడుతూ.. ‘ఈ చిత్రానికి ఎడిటర్‌గా నాకు ఛాన్స్ ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. సినిమా చాలా బాగా వచ్చింది. మమ్మల్ని ఆశీర్వదించేందుకు వచ్చిన పరుచూరి వెంకటేశ్వరరావు గారికి థాంక్స్. ఈ మూవీ అందరినీ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు.
రఘుబాబు మాట్లాడుతూ.. ‘సుదర్శన్ అద్భుతంగా నటించాడు. మొదటి సినిమానే అయినా అన్నీ సింగిల్ టేక్‌లోనే చేసేశారు. తెలుగుని చాలా స్పష్టంగా పలికారు. పరుచూరి గారి మనవడు అంటే ఆ మాత్రం ఉంటుంది. నేను ఈ చిత్రంలో మంచి పాత్రను పోషించాను. సినిమా చాలా బాగా వచ్చింది. అందరూ చూడండి’ అని అన్నారు.
సాయి మాధవ్ బుర్రా మాట్లాడుతూ.. ‘మిస్టర్ సెలెబ్రిటీ అనే టైటిల్లోనే చాలా పాజిటివిటీ ఉంది.. తెలిసింది మాట్లాడితే స్వేచ్చ.. తెలియంది మాట్లాడితే నేరం.. తెలిసింది నిజం అనుకుని మాట్లాడటం పొరపాటు.. తెలుసు అనుకుని మాట్లాడటం మహా పాపం.. చాలా మంచి పాయింట్‌తో సినిమాను తీశారు. సుదర్శన్ మంచి నటుడు. నా గురువు గారి మనవడు. నేను కూడా సుదర్శన్‌తో ఒక సినిమా చేస్తున్నాను. త్వరలోనే దానికి సంబంధించిన ప్రకటన వస్తుంది. దర్శకుడు ఈ మూవీని బాగా తీశాడనిపిస్తుంది. ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
తారాగణం: వరలక్ష్మి శరత్ కుమార్, సుదర్శన్ పరుచూరి, శ్రీ దీక్ష, నాజర్, రఘుబాబు తదితరులు
సాంకేతిక వర్గం
బ్యానర్ – RP సినిమాస్
నిర్మాత -చిన్న రెడ్డయ్య, ఎన్.పాండురంగారావు
రచయిత, దర్శకుడు – చందిన రవి కిషోర్
కెమెరామెన్ – శివ కుమార్ దేవరకొండ
సంగీతం – వినోద్ యజమాన్య
పాటలు – గణేష్, రాంబాబు గోసాల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – వెంకట్ రెడ్డి
ఎడిటర్ – శివ శర్వాణి
పీఆర్వో – సాయి సతీష్
Paruchuri Brothers Grandson Paruchuri Sudarshan Grand Debut With Mr Celebrity Co-starring Varalaxmi Sarathkumar, Gripping Teaser Unleashed
Legendary writers Paruchuri Brothers’ grandson Paruchuri Sudarshan is making a grand entry into films as a hero with a captivating crime thriller Mr Celebrity. Before making his debut, the young hero took training in all aspects such as acting, dances, and fights, to make his mark in the industry. The film Mr Celebrity is directed by Chandina Ravi Kishore, and produced by Chinnareddiah and N. Pandurangarao on RP Cinemas banner. The makers kick-started the promotions by unleashing the film’s teaser. Paruchuri Venkateswara Rao did the honours of launching the teaser. The grand teaser launch event was attended by Raghu Babu, Sai Madhav Burra, and several others as special guests.
The Teaser opens with a powerful dialogue from Varalaxmi Sarathkumar: “Ramayana Kaalamlo Battalu Uthukkune Vaadu Anna Pukaaru Maata Valla Sita Devi Aranya Vaasam Chesinappatikee, Agni Vaasam Cheyalsochindi… Kaalam Maarindi… Kaanee, Ee Pukaru Maatala Valla Poye Pranalu Inka Pothune Untaayi…” It then reveals a social activist who is assaulted by a popular YouTuber, with even the police seemingly helpless. However, the protagonist is determined to take on the case, asserting, “Nenevaro Meeku Thelvadu… Ee Ammayevaro Naaku Thelvadu… Muggurini Oka Chota Kalipindi…”
The Teaser also features the protagonist reassuring the victim, “Ee Problem Solve Ayye Varaku Elanti Situations Lo Aina Nenu Nee Pakkana Untaa…” It showcases the antagonist’s masked crimes and his ominous challenge: “Inkoka 48 Hours Lo Mimmalni Celebrities Chesi Maree Champuthaa…”
The Teaser promises that Mr Celebrity is going to be an engaging crime thriller with intriguing elements in the narrative. There seems to be some twists and turns in the narrative with a strong confrontation between the protagonist and antagonist.
Paruchuri Sudarshan delivered a strong performance. The youngster who oozed style and swag performed some deadly stunts. His dialogue delivery also stands out. Varalaxmi Sarathkumar is a great value addition.
Director Chandina Ravi Kishore has picked a captivating story and narrated it engagingly. Shiva Kumar Dewarakonda’s camera work is outstanding, while Vinod Yajamanya’s background score complements the visuals. Shiva Sharvani is the editor.
With its intense narrative and powerful performances, the Teaser sets high expectations for the film.
Cast: Varalaxmi Sarathkumar, Sudarshan Paruchuri, Sri Deeksha, Nasar, Raghubabu, and others.
Technical Crew:
Writer & Director – Chandina Ravi Kishore
Producers – Chinnareddiah and N.Pandurangarao
Banner – RP Cinemas
Dop – Shiva Kumar Dewarakonda
Music – Vinod Yajamanya
Lyricist – Ganesh, Rambabu Gosala
Editor – Shiva Sharvani
Executive Producer – Venkat Reddy
Pro – Sai Satish
Audiography –
Sound Effects – Sriniwas
Dialogue Recordist – Ram Reddy
Art Director – Ravi, Ganesh
Stunt Master – Lanka Rajesh
Dance Choreographer -Jittu, Baba, Mohan Krishna, Sunil Ponnam
Costume Designer- Ravi
Vfx – Santosh Pampana
Publicity Designer – Gowtham
Music Label- Divo Music