
సరస్వతి మంచి సోషల్ మెసేజ్ ఉన్న ఎంగేజింగ్ ఫిలిం – వరలక్ష్మిశరత్ కుమార్
వెర్సటైల్ పాత్రలతో అలరిస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ స్వీయ దర్శకత్వంలో, తన సోదరి పూజా శరత్ కుమార్ తో కలిసి దోస డైరీస్ బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రం’సరస్వతి’. హై-కాన్సెప్ట్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులలో క్యురియాసిటీ పెంచింది. మార్చి 6న ఈ సినిమా థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ డైరెక్టర్, వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ వేడుకకి విచ్చేసిన స్వప్న దత్ గారికి నందిని గారికి సిమ్రన్ గారికి అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. బాలయ్య గారికి నాని గారికి, అడివి శేష్ గారికి, సమంత గారికి, నయనతార గారికి, గోపి గారికి, బన్నీ వాస్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్, నటీనటులకు పేరుపేరునా కృతజ్ఞతలు. తమన్ గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. మా నటీనటులు లేకపోతే సినిమా ఇంత అద్భుతంగా వచ్చేది .ప్రకాష్ రాజ్ గారు, ప్రియమణి గారు నా విజన్ ని మరో స్థాయికి తీసుకువెళ్లారు. తమ పాత్రలకు ప్రాణం పోశారు. ఇందులో ప్రతి పాత్ర కూడా చాలా అర్థవంతంగా ఉంటుంది.
మా సినిమాకి వెన్నుముకగా నిలిచిన ఈటీవీ యాజమాన్యానికి కృతజ్ఞతలు. పూజ ఈ సినిమాని చాలా కంట్రోల్ గా చేసింది. ఈ సినిమాతో మా నాన్నగారి ని గర్వపడేలా చేస్తానని నమ్ముతున్నాను. రాధిక గారి సపోర్ట్ ని మర్చిపోలేను. ఫ్యామిలీ అందరికీ థాంక్యు. మా ఆయన నిక్ సపోర్ట్ తోనే ఈ జర్నీ స్టార్ట్ అయ్యింది. ఆయన ప్రతి అడుగులో ఎంతగానో ప్రోత్సహించారు. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ నిక్.
ఈ సందర్భంగా ప్రవీణ్ కి థాంక్యూ చెప్పాలి. తన కారణంగా డైరెక్షన్ స్టార్ట్ చేశాను. స్త్రీలని గౌరవించడం మనందరి కర్తవ్యం. అలాంటి మంచి సందేశం వున్న సినిమా ఇది. సోషల్ మెసేజ్ తో పాటు ఎంగేజింగ్ గా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు కూడా నాకు చాలా గొప్ప ప్రేమ అభిమానాన్ని ఇచ్చారు. నావల్ల ఏమవుతుందో అది మీకు ఈ సినిమా ద్వారా ఇస్తున్నాను. ఫస్ట్ టైం చూసినవారు ట్విస్ట్ లని రివీల్ చేయకూడదని కోరుతున్నాను. మీ అందరి ప్రేమ అభిమానాలకు కృతజ్ఞతలు. మార్చి 6న తప్పకుండా ఈ సినిమా ధియేటర్స్ లో చూస్తారని కోరుకుంటున్నాను.
హీరో శరత్ కుమార్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇక్కడ విమెన్ పవర్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఒక నటిగా వరలక్ష్మీ విజయంలో నా పాత్ర ఏమీ లేదు. కాకపోతే ఈ ప్రపంచం ఎలా ఉంటుంది ఎలా బిహేవ్ చేయాలని చిన్నప్పటి నుంచి చెప్తుండేవాడిని. సరస్వతి లాంటి కథ ఖచ్చితంగా చెప్పాలి. స్త్రీలని గౌరవించడం మనందరి కర్తవ్యం. పూజకి చాలా మంచి ప్రొడక్షన్స్ స్కిల్స్ ఉన్నాయి. సరస్వతిలో కొన్ని క్లిప్స్ చూశా.ను చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు. వరలక్ష్మి పూజ టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. ఇందులో మంచి టెక్నీషియన్స్ పనిచేశారు. తమన్ గొప్ప మ్యూజిక్ ఇచ్చారు. అలాగే కెమెరా వర్క్ కూడా చాలా బాగుంది. అంతిమంగా ప్రేక్షకులే నిర్ణయితలు. తప్పకుండా ఈ సినిమాకి వాళ్ళు చాలా మంచి తీర్పు ఇస్తారని నమ్ముతున్నాను.
రాధిక శరత్ కుమార్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం సరస్వతి ధైర్యాన్ని ఇచ్చే సినిమా. వరలక్ష్మి విషయంలో చాలా గర్వంగా ఉన్నాను. తను ఈ కథ చెప్పినప్పుడు నాకు చాలా నచ్చింది. వరలక్ష్మి చేస్తున్న ఫస్ట్ సినిమా చూసినప్పుడే తప్పకుండా ఒక మంచి నటి అవుతుందని భావించాం. మా నమ్మకం నిజమైంది. అప్పుడే తనకి తెలుగు సినిమాలపై దృష్టి పెట్టమని చెప్పాను. తెలుగు ప్రేక్షకులకి నచ్చితే అద్భుతంగా సెలబ్రేట్ చేస్తారు. నేను నా బెస్ట్ సినిమాలన్నీ తెలుగులోనే చేశాను. సరస్వతి లాంటి కథ చాలా అరుదుగా వస్తుంది. ఇలాంటి కథ చెప్పడానికి ధైర్యం కావాలి. అలాంటి కథని వరలక్ష్మి చెప్పడం నాకు చాలా గర్వంగా ఉంది. ఇది ఒక మౌనంగా ఉన్న చాలా మంది అమ్మాయిలకి ఒక ధైర్యాన్నిస్తుంది. టీమ్ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్
ప్రొడ్యూసర్ స్వప్న దత్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఈ సినిమా ట్రైలర్ చూశాను. చాలా నచ్చింది. తప్పకుండా ఈ సినిమా థియేటర్స్ లో చూస్తాను. ఎందుకంటే ఇది ఒక ఇంపార్టెంట్ స్టోరీ. తప్పకుండా ఇది ఒక మంచి సినిమాగా నిలిచిపోతుంది. ఈటీవీ గ్రేట్ కంటెంట్ ని అందిస్తుంది. వరలక్ష్మి చాలా అద్భుతంగా తీర్చిదిద్దింది. తప్పకుండా ఈ సినిమా చాలా మంచి విజయాన్ని సాధిస్తుందని నమ్ముతున్నాను.
హీరోయిన్ ప్రియమణి మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఇలాంటి అద్భుతమైన సినిమాలో భాగంగా చాలా ఆనందంగా ఉంది ఇది మనసులో నిలిచిపోయిన కథ. కథ చెప్పినప్పుడు చాలా నచ్చింది. ఈ జర్నీ నాకొక కేక్ వాక్ లా అనిపించింది. వరలక్ష్మి చాలా అద్భుతంగా ప్లాన్ చేసింది. తను అద్భుతమైన డైరెక్టర్. సినిమాకి ఏం కావాలో తనకి పర్ఫెక్ట్ గా తెలుసు. ఈ సినిమాని సపోర్ట్ చేసిన అందరికీ థాంక్యూ. ఇలాంటి సినిమాలు ఆడియన్స్ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను
పూజా శరత్ కుమార్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. నాకు ఈ అవకాశం ఇచ్చిన వరలక్ష్మికి థాంక్యూ. సినిమాకి అందరూ చాలా అద్భుతంగా సపోర్ట్ చేశారు. ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. సినిమా థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. తప్పకుండా అందరూ థియేటర్స్ కి వచ్చి సినిమా చూస్తారని కోరుకుంటున్నాను
నికోలాయ్ సచ్దేవ్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. సరస్వతీ అద్భుతమైన సినిమా. పూజ సైలెంట్ కిల్లర్ లా పని చేసింది. సరస్వతి లాంటి ఒక మంచి సినిమా వరలక్ష్మి చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. వరలక్ష్మి విషయంలో గర్వంగా ఫీల్ అవుతున్నాను. సరస్వతి టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది.
ఈటీవీ విన్ కంటెంట్ హెడ్ నితిన్ చక్రవర్తి మాట్లాడుతూ.. వరలక్ష్మి గారు బోర్న్ డైరెక్టర్. అందరూ 9టు 5 జాబ్ చేస్తారు. 9 టు 5 షూటింగ్ ఫస్ట్ టైం చూశాను. వరలక్ష్మి గారి సెట్ లో అంతా చాలా ప్లాన్డ్ గా ఉంది. చాలా ఫోకస్డ్ గా వర్క్ చేస్తున్నారు. వరలక్ష్మి గారికి జస్ట్ బిగినింగ్ మాత్రమే. వారి నుంచి చాలా అద్భుతమైన కంటెంట్ రాబోతుంది. సరస్వతి వెరీ ఎంగేజింగ్ ఫిలిం. థియేటర్స్ లో చూడండి. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు
డైరెక్టర్ బి నందిని రెడ్డి మాట్లాడుతూ.. రాధిక గారు సిమ్రాన్ గారు శరత్ కుమార్ గారు అందరినీ ఒక చోట చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. వరలక్ష్మి గారు స్క్రీన్ మీద ఎంత అందంగా ఉన్నారో డైరెక్టర్గా కూడా అంత హుందాగా కనిపిస్తున్నారు. ప్రతి క్యారెక్టర్ ని కూడా పర్ఫెక్ట్ గా సెలెక్ట్ చేశారు. ఈ సినిమాని చూడడానికి ఎదురుచూస్తున్నాను. యాక్టింగ్ చేస్తూ డైరెక్ట్ చేయడం అనేది చాలా పెద్ద ఛాలెంజ్. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చాలా పెద్ద విజయాన్ని సాధిస్తుందని నమ్ముతున్నాను
హీరోయిన్ సిమ్రాన్ మాట్లాడుతూ.. సరస్వతి ఈవెంట్ కి రావడం చాలా ఆనందంగా ఉంది. టీమ్ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. ట్రైలర్ చూశాను. చాలా థ్రిల్లింగ్ గా ఉంది. మంచి సస్పెన్స్ ఉంది. తప్పకుండా ఈ సినిమా కూడా చాలా అద్భుతంగా ఉంటుందని భావిస్తున్నాను. మార్చి 6 కోసం ఎదురుచూస్తున్నాను
సప్తగిరి మాట్లాడుతూ… వరలక్ష్మి గారికి హాట్సాఫ్. 25 రోజుల్లో ఈ సినిమాని మంచి క్యాలిటీలో కంప్లీట్ చేశారు. ఇందులో చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. మా సరస్వతి దేవికి లక్ష్మీ కటాక్షం ప్రాప్తిరస్తు. వరలక్ష్మి గారు గెలవాలి. మా అందరినీ గెలిపించాలి తప్పకుండా ఈ సినిమా చాలా మంచి విజయాన్ని సాధిస్తుంది. ఈ వేడుకలో మూవీ యూనిట్ అందరూ పాల్గొన్నారు.
