
విక్రమ్ ఆన్ డ్యూటీ కంటెంట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది – ఎంఎం కీరవాణి
బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ మలియక్కల్ హీరోగా బ్రహ్మ రుద్ర దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ విక్రమ్ ఆన్ డ్యూటీ. జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రవీణ, అనిల్ కడియాల నిర్మించారు. జియో హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ సిరిస్ టాప్ వన్ లో ట్రెండ్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ కి ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ప్రెస్ మీట్ లో ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. నా మిత్రులు అనిల్ గారు ప్రవీణ కోసం ఈ వేడుకకి రావడం జరిగింది. ఈ వెబ్ సిరీస్ లో కొన్ని గ్లింప్స్ చూశాను. హంట్ అనే యూనిట్ ద్వారా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. హంట్ తో టాలెంట్ హంట్ జరగడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఇండస్ట్రీకి చాలామంది కొత్త వాళ్ళు రావాలి. కొత్త మ్యూజిక్ డైరెక్టర్ సుహాస్ కి ఆల్ ది వెరీ బెస్ట్. తన మ్యూజిక్ బిట్స్ బావున్నాయి. ఇది ఆల్రెడీ నెంబర్ వన్ స్ట్రీమింగ్ లో ఉందని తెలిసింది. హాట్స్టార్ కి కంగ్రాజులేషన్స్ హర్ష గారు తన అనుభవాన్ని రంగరించి చేస్తున్నారు. చిన్నప్పుడు కొమ్మూరి సాంబశివరావు గారి డిటెక్టివ్ నవల చదివాను. అందులో డిటెక్టివ్ తన బ్రెయిన్ ఉపయోగించి కొన్ని నేరాలని పరిశోధిస్తుంటాడు. అలాగే మధుబాబు గారి నవలల్లో యాక్షన్ కూడా ఉంటుంది. ఈ సిరిస్ ఆ రెండూ ఉంటాయని ఆశిస్తున్నాను. చివరిగా ఒక హుక్ లైన్ ఇవ్వాలంటే.. విక్రమ్ ఆన్ డ్యూటీ బికాస్ ఆఫ్ హర్ష అఫ్ డ్యూటీ. అందరికి ఆల్ ద బెస్ట్.
బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. హర్ష గారు ప్రవీణ గారు అనిల్ గారు టీమందరం కలిసి ఒక మంచి టీం వర్క్ తో ఈ ప్రాజెక్ట్ చేశాం. జియో హాట్స్టార్ నుంచి నందిని గారికి రమణ గారికి థాంక్యూ సో మచ్. ఆస్కార్ విజేత కీరవాణి గారు ఈ వేడుకకు రావడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఆషు చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ లో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు
యాక్టర్ అమర్ మాట్లాడుతూ… నిఖిల్ ని విక్రమ్ ఆన్ డ్యూటీ లో చూడడం చాలా ఆనందంగా ఉంది .తను బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ మంచి సినిమాలు చేస్తున్నాడు. ఇది కూడా చాలా అద్భుతమైన ప్రాజెక్ట్. ఇలాంటి సిరీస్ లు తను మరెన్నో చేయాలని, ఇంకా మంచి స్టార్ గా ఎదగాలని కోరుకుంటున్నాను. టీమ్ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్.
ప్రొడ్యూసర్ ప్రవీణ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. పాడుతా తీయగా ప్రోగ్రామ్ సమయంలో కీరవాణి గారిని కలిసాను. అప్పటినుంచి మా జర్నీ ఒక ఫ్యామిలీ లాగా కొనసాగుతోంది. ఆయన ఈ వేడుకకు రావడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. మా ప్రాజెక్టు జియో హాట్ స్టార్ లో రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. హర్ష గారి కథ చెప్పినప్పుడే సక్సెస్ అవుతుందని అనుకున్నాను. నందిని అనిల్ గారు ఈ ప్రాజెక్టు కోసం చాలా కష్టపడ్డారు. సమీర్ మేము చేసే ప్రతి ప్రాజెక్టులో ఉంటారు. నిఖిల్ విక్రమ్ గా అద్భుతంగా చేశారు. వేద పాత్రలో అశ్వ గారు చక్కగా నటించారు. మీ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ ప్రాజెక్ట్ చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఈ సిరీస్ మీ అందరిని ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తుంది.
నిర్మాత అనిల్ కడియాల మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఈ అవకాశం ఇచ్చిన జియో హాట్ స్టార్ టీం కి థాంక్యూ సో మచ్. విక్రమ్ అండ్ టీం అద్భుతంగా యాక్ట్ చేశారు. అందరినీ థాంక్ యూ.
డైరెక్టర్ బ్రహ్మ రుద్ర మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టు నాకు ఇచ్చిన ప్రవీణ గారు అనిల్ గారికి థాంక్యూ. టెక్నీషియన్స్ ఆర్టిస్టులు అందరూ చాలా హెల్ప్ చేశారు. పనిచేసిన ప్రతి ఒక్కరికి థాంక్యూ. మా ప్రొడ్యూసర్స్ ఎక్కడ రాజీ పడకుండా ఖర్చు చేశారు. మీ అందరికీ నచ్చుతుంది.
ఆషు రెడ్డి మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఈ ప్రాజెక్ట్ చాలా హార్డ్ వర్క్ చేసి చేశాం. నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. అనిల్ గారు ప్రవీణ్ గారు నాకు జీవితాన్ని ఇచ్చారు. ఫస్ట్ టైం హీరోయిన్ అని పిలిపించుకుంటున్నాను. అంత మంచి లైఫ్ ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు. అద్భుతమైన రివ్యూస్ వచ్చాయి. నాకు పాత్ర కోసం వెయిట్ చేస్తున్నాను. అందరికీ థాంక్యు సో మచ్
మ్యూజిక్ డైరెక్టర్ సుహాస్ మాట్లాడుతూ .. ఇది నాకు ఫస్ట్ ప్రాజెక్టు. మా నిర్మాతలకి దర్శకులకు ధన్యవాదాలు. కీరవాణి గారు ఈ వేడుకకు వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సిరీస్ పని చేసిన అందరికీ థాంక్యు.
రైటర్ శ్రీ హర్ష మాట్లాడుతూ.. ఈ అచీవ్మెంట్ ని సాధించడానికి నా జీవితంలో నాలుగేళ్లు పట్టింది. ఇది నాకు చాలా ఎమోషనల్ మూమెంట్. నేను పోలీస్ గా పని చేశాను. సినిమా అంటే పాషన్ తో ఇండస్ట్రీకి వచ్చాను. నిఖిల్ లేకపోతే ఈ షో కి ఎంత రీచ్ వచ్చేది కాదు. మా నిర్మాతలకి థాంక్యూ సో మచ్. ఈ వేడుకకు కీరవాణి గారు రావడం నాకు ఎంతో ఆనందం ఇచ్చింది. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ వేడుకలో యూనిట్ అందరూ పాల్గొన్నారు.
