మంచి కంటెంట్ తో “మన్మయి” టీజర్ – రాజ్ కందుకూరి
G2H మీడియా పతాకంపై సంతోష్ కృష్ణ, వైష్ణవి కృష్ణ, సిజు మీనన్,ప్రధాన పాత్రధారులుగా పులుగు రామకృష్ణారెడ్డి దర్శకత్వంలో, నిర్మాతలు రామకృష్ణారెడ్డి, శ్రీహరి రెడ్డి, కిరణ్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఎమోషనల్ ఎంటర్టైనర్ “మన్మయి”. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నేడు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా టీజర్ ఆవిష్కరణ జరుపుకుంది. ఈ కార్యక్రమంలో ఆర్టిస్ట్ నాగ మహేష్, బాలీవుడ్ ఆర్టిస్ట్ కరెన్ సింగ్ , ఆర్టిస్ట్ జయంత్, ఆర్టిస్ట్ యోగి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా…
నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ – “మన్మయి” టీజర్ లాంఛ్ కు రమ్మని డైరెక్టర్ రామకృష్ణరెడ్డి గారు నన్ను ఇన్వైట్ చేశారు. కొన్ని స్టిల్స్ చూపించారు. బాగున్నాయనిపించింది. ఇక్కడకి వచ్చి టీజర్ చూశాక మంచి కంటెంట్ తో సినిమా చేస్తున్నట్లు అర్థమైంది. “మన్మయి” సినిమా మీ ఆదరణ పొందాలి. మంచి సక్సెస్ కావాలని టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.
డైరెక్టర్ పులుగు రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ – మా “మన్మయి” సినిమా టీజర్ విడుదల చేసిన ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి గారికి థ్యాంక్స్ చెబుతున్నా. ఈ రోజు మా టీజర్ లాంఛ్ ఈవెంట్ కు వచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. “మన్మయి” ఒక ఎమోషనల్ లవ్ ఎంటర్ టైనర్. ప్రేక్షకులకు ఒక మంచి అనుభూతిని పంచే సినిమా అవుతుంది. మంచి మూవీ చేశామనే అనుకుంటున్నాం. మీ ఆశీస్సులు కావాలి. అన్నారు.
నిర్మాత శ్రీహరి రెడ్డి మాట్లాడుతూ – మా “మన్మయి” సినిమా టీజర్ విడుదల చేసిన ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి గారికి కృతజ్ఞతలు చెబుతున్నాను. ఈ రోజు మా టీజర్ లాంఛ్ ఈవెంట్ కు వచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మంచి లవ్ స్టోరీతో మిమ్మల్ని మూవీ ఆకట్టుకుంటుంది. అన్నారు.
నిర్మాత కిరణ్ రెడ్డి మాట్లాడుతూ – మా “మన్మయి” సినిమా టీజర్ కు వచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మా మూవీ టీజర్ మీకు నచ్చిందనే ఆశిస్తున్నాను. సినిమాను కూడా ఆదరించాలని కోరుకుంటున్నా. అన్నారు.
హీరో సంతోష్ కృష్ణ మాట్లాడుతూ – నాకు ఈ మూవీలో నటించే అవకాశం ఇచ్చిన మా బ్రదర్ రామకృష్ణా రెడ్డి గారికి థ్యాంక్స్. మా మన్మయి మూవీ టీజర్ స్క్రీన్ మీద మీరు చూసి చప్పట్లు కొట్టగానే చాలా సంతోషంగా అనిపించింది. మీకు టీజర్ నచ్చిందంటే మా వర్క్ నచ్చిందనే భావిస్తున్నాం. ఇది ఒక ఎమోషనల్ మూవ్ మెంట్ మా అందరికీ. మనసుకు హత్తుకునే మంచి లవ్ స్టోరీతో మీ ముందుకు త్వరలోనే రాబోతున్నాం. అన్నారు.
నటుడు శిజు మాట్లాడుతూ – దేవి సినిమాతో మీ అందరికీ గుర్తుండిపోయాను. ఆ సినిమా రిలీజై పాతికేళ్లవుతోంది. డైరెక్టర్ గారు “మన్మయి” కథ చెప్పినప్పుడు ఇదొక డిఫరెంట్ లవ్ స్టోరీ అనిపించింది. ప్రేక్షకులకు ఒక కొత్త ఫీల్ కలిగించే సినిమా అవుతుంది. అన్ని ఎమోషన్స్ కథలో బాగా కుదిరాయి. అన్నారు.
హీరోయిన్ వైష్ణవి కృష్ణ మాట్లాడుతూ – “మన్మయి” సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఎమోషనల్ రోలర్ కోస్టర్ సినిమా అనుకోవచ్చు. తెలుగు మూవీస్ లో ఒక క్లాసిక్ గా మిగిలిపోతుందని చెప్పగలను. అమేజింగ్ టీమ్ తో వర్క్ చేశాను. ఈ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ కు థ్యాంక్స్. అన్నారు.
నటీనటులు – సంతోష్ కృష్ణ, వైష్ణవి కృష్ణ, సిజు మీనన్, యోగి కత్రి, జయంత్, నేహాల్ గంగావత్, మెహబూబ్ భాష, శిరీష, భూపతి, సాయి, కల్కి, రాజేశ్వరి తదితరులు
టెక్నికల్ టీమ్
సంగీతం: వరికుప్పల యాదగిరి
బ్యాగ్రౌండ్ మ్యూజిక్: మహి మదన్. ఎం .ఎం
డి ఓ పి: కె కే రావు
అడిషనల్ డి. ఓ. పి: కిషోర్ బోయిడపు
ఎడిటర్: సాయిబాబు తలారి
కొరియోగ్రఫీ: చందు
పిఆర్ఓ: వీరబాబు
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్; సుబ్బారావు
నిర్మాతలు: పులుగు రామకృష్ణారెడ్డి, శ్రీహరి రెడ్డి, కిరణ్ రెడ్డి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పద్మజ ఇరకసాని
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పులుగు రామకృష్ణారెడ్డి
“Manmayi” Teaser released by Producer Raj Kandukuri
“Manmayi,” an emotional entertainer featuring Santosh Krishna, Vaishnavi Krishna, and Siju Menon in lead roles, is directed by Pulugu Ramakrishna Reddy and jointly produced by Ramakrishna Reddy, Srihari Reddy, and Kiran Reddy under the G2H Media banner. The film, which has completed all its production activities, had its teaser launched today at Prasad Labs in Hyderabad by the prominent producer Raj Kandukuri. Artists Nag Mahesh, Bollywood artist Karan Singh, artist Jayant, and artist Yogi, among others, attended the event.
Producer Raj Kandukuri expressed his thoughts, saying, “Director Ramakrishna Reddy invited me for the ‘Manmayi’ teaser launch and showed me some stills, which looked impressive. After watching the teaser here, I understood that the film has good content. I wish the ‘Manmayi’ movie to receive your support and become a big success. All the best to the team.”
Director Pulugu Ramakrishna Reddy said, “I thank the prominent producer Raj Kandukuri for releasing the teaser of our movie ‘Manmayi.’ Thanks to everyone who attended our teaser launch event today. ‘Manmayi’ is an emotional love entertainer that will provide a great experience for the audience. We believe we have made a good movie. We seek your blessings.”
Producer Srihari Reddy added, “I am grateful to the prominent producer Raj Kandukuri for releasing the ‘Manmayi’ movie teaser. Thanks to everyone who attended our teaser launch event today. The movie will captivate you with a great love story.”
Producer Kiran Reddy expressed, “Thanks to everyone who attended the ‘Manmayi’ movie teaser launch. I hope you liked our movie teaser and request you to support the movie as well.”
Hero Santosh Krishna said, “Thanks to my brother Ramakrishna Reddy for giving me the opportunity to act in this movie. I felt very happy when you applauded the ‘Manmayi’ movie teaser on the screen. If you liked the teaser, it means you liked our work. This is an emotional moment for all of us. We are coming soon with a beautiful love story that will touch your hearts.”
Actor Siju mentioned, “I am remembered by everyone through the movie ‘Devi,’ which was released twenty-five years ago. When the director narrated the ‘Manmayi’ story, it felt like a different love story. The movie will provide the audience with a new feeling. All emotions have been well integrated into the story.”
Heroine Vaishnavi Krishna said, “‘Manmayi’ will have all emotions and can be called an emotional roller coaster. I can say that it will remain a classic in Telugu movies. I worked with an amazing team and thank the director and producers for giving me the opportunity to act in this film.”
Cast includes Santosh Krishna, Vaishnavi Krishna, Siju Menon, Yogi Katri, Jayant, Nehal Gangawat, Mehboob Bhasha, Sirisha, Bhupathi, Sai, Kalki, Rajeshwari, and others.
Technical Team:
- Music: Varikuppala Yadagiri
- Background Music: Mahi Madan M.M.
- D.O.P: K.K. Rao
- Additional D.O.P: Kishore Boyidapu
- Editor: Saibabu Talari
- Choreography: Chandu
- P.R.O: Veerababu
- Production Executive: Subbarao
- Producers: Pulugu Ramakrishna Reddy, Srihari Reddy, Kiran Reddy
- Executive Producer: Padmaja Irakasani
- Story, Screenplay, Direction: Pulugu Ramakrishna Reddy