
భైరవం సినిమాకి ఇంత అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చిన ఆడియన్స్ కి థాంక్ యూ – సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ భైరవం. విజయ్ కనకమేడల దర్శకత్వంలో, శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ భారీ నిర్మించారు. పెన్ స్టూడియోస్ డాక్టర్ జయంతీలాల్ గాడా సమర్పించారు. మే 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
ప్రెస్ మీట్ లో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ..అందరికీ నమస్కారం. మా అందరికీ కొంచెం గ్యాప్ వచ్చినా ఆడియన్స్ నుంచి ఇంత సపోర్టు, ప్రేమ రావడం మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ సినిమా తప్పకుండా మీరందరూ థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయాలి. ఇలాంటి మంచి సినిమా చూస్తే మీకు కూడా ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది. ఆ రోజంతా ఎనర్జిటిక్ గా ఉంటారు. ఇలాంటి సినిమా మీరందరూ చూసి మమ్మల్ని ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా టీమ్ అందరికీ ధన్యవాదాలు. డైరెక్టర్ విజయ్ గారు ఈ సినిమాని ది బెస్ట్ గా తీశారు. ఆయన ఈ సినిమాతో టాప్ డైరెక్టర్స్ లిస్టులోకి చేరారు. ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. మనోజ్ అన్న రోహిత్ అన్న అద్భుతంగా చేశారు. వాళ్లు లేకపోతే ఈ సినిమానే లేదు. వాళ్ళు పెట్టిన ఎఫర్ట్ ప్రతి ఫ్రేమ్ లో కనిపించింది. చాలా మంది ఫోన్ చేసి ముగ్గురు కూడా పర్ఫార్మెన్స్ ఇరగదీశారు అని చెప్పడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఆకలితో ఉన్నప్పుడు వేటాడినట్టు పర్ఫార్మెన్స్ చేశారని చెప్తుంటే హ్యాపీగా అనిపించింది. ఇది నా టెన్త్ ఫిలిం. ఇండస్ట్రీ కి వచ్చి 10 ఏళ్ళు అవుతుంది. అలాగే నా మొదటి సినిమా అల్లుడు శీను చిత్రానికి గాను తెలంగాణ ప్రభుత్వ నుంచి బెస్ట్ ఫిలిం అవార్డ్ వచ్చింది. నాకు ఈరోజు వెరీ హ్యాపీ మూమెంట్. ఈ సందర్భంగా తెలంగాణ గవర్నమెంట్ కి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇది నాకు వెరీ మెమొరబుల్ డే. ఈ సినిమాని, నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్యూ. తప్పకుండా ఈ సినిమాని అందరూ థియేటర్స్ లోనే చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను’అన్నారు
హీరో మంచు మనోజ్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. భైరవం సినిమాకి గొప్ప విజయం ఇచ్చినందుకు ఆడియన్స్ కి థాంక్యూ. ఈ సినిమా మాకు ఇచ్చిన డైరెక్టర్ విజయ గారికి జీవితాంతం రుణపడి ఉంటాం. సినిమాని అద్భుతంగా ప్రజెంట్ చేశారు. మా టీమ్ అందరికీ థాంక్ యూ. తమ్ముడు సాయి శ్రీనివాస్ గ్రేట్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. రోహిత్ బాబాయ్ కంగ్రాజులేషన్స్. 9 సంవత్సరాలు తర్వాత వచ్చిన నాకు ఇంత ప్రేమ ఆదరణ చూపించిన ప్రతి ఒక్కరికి థాంక్యూ. రేపటి నుంచి ప్రతి ఒక్క ఊరికి రావడం జరుగుతుంది. ఇది విజల్స్ వేసి గోల చేసే సినిమా. ప్రతి ఒక్కరూ వెళ్లి థియేటర్స్ లో చూడండి. ఈ సినిమాని ఇంకొంచెం పెద్ద విజయం చేసి సూపర్ డూపర్ హిట్ చేస్తారని కోరుకుంటున్నాను.’అన్నారు
హీరో నారా రోహిత్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చిన ఆడియన్స్ అందరికి థాంక్యూ. చాలా మంచి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. ఈ సినిమా ఇంకా పెద్ద హిట్ కావాలి. ఇంకా చూడని ప్రేక్షకులు తప్పకుండా వెళ్లి చూడండి. సినిమాకి ఆడియన్స్ నుంచి చాలా మంచి అప్రిషియేషన్ వస్తుంది. ఇంత మంచి పాత్ర ఇచ్చిన డైరెక్టర్ గారికి థాంక్యూ. నిర్మాత రాదా మోహన్ గారికి మా టీమ్ అందరికీ థాంక్యు. నా కెరీర్ లో ఇలాంటి క్యారెక్టర్ ఎప్పుడు చేయలేదు. ఆ క్యారెక్టర్ ఇంత గొప్ప రెస్పాన్స్ రావడం చాలా ఆనందాన్నిచ్చింది. మా బ్రదర్స్ మనోజ్ సాయి అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చారు. వాళ్ళు పర్ఫార్మెన్స్ కి కూడా మంచి అప్రిసియేషన్ రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. తప్పకుండా సినిమా చూడండి. మీరందరూ ఎంజాయ్ చేస్తారు’అన్నారు
హీరోయిన్ అతిధి శంకర్ మాట్లాడుతూ… తెలుగు చిత్ర పరిశ్రమలోకి నాకు ఇంత చక్కని స్వాగతం పలికిన అందరికీ థాంక్యు. సినిమాని అద్భుతంగా సపోర్ట్ చేసిన ఆడియన్స్ కి థాంక్యూ. మీ సపోర్టు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ థాంక్యు. సినిమాని ఆడియన్స్ మరింత పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను.
డైరెక్టర్ విజయ్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. నా గత రెండు సినిమాలు కంటే ఈ సినిమాతో నాకు హ్యూజ్ సక్సెస్ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులకు నా ధన్యవాదాలు. అందరూ హీరో ఫ్యాన్స్ సినిమాని సపోర్ట్ చేశారు. వారి సపోర్టు ఎప్పుడు మర్చిపోలేనిది. మార్నింగ్ నుంచి సినిమా చాలా అద్భుతంగా వుందని కాల్స్ మెసేజ్‌లు వస్తున్నాయి. ఓవర్సీస్ లో కూడా చాలా అద్భుతమైన టాక్ వచ్చింది. ఈ సినిమా మరింత అద్భుతమైన విజయం సాధిస్తుందని నమ్మకం ఉంది’అన్నారు
నిర్మాత రాధా మోహన్ మాట్లాడుతూ… అందరికి నమస్కారం. సినిమాకి ఎంత అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. మా ముగ్గురు హీరోలు చాలా అద్భుతంగా పెర్ఫాం చేశారు. మాకు చాలా సపోర్ట్ చేశారు. మా టీమ్ అందరికీ ఈ సందర్భంగా థాంక్స్ చెప్తున్నాను. ప్రతి ఒక్కరు టీంలో కష్టపడ్డారు. ఆ కష్టానికి తగిన ఫలితం దొరికింది. దానికి చాలా సంతోషంగా ఉంది. ప్రేక్షకులు ఈ సినిమాని ఇంకా గొప్పగా ఆదరించాలని కోరుకుంటున్నాను.
మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ పాకాల మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఆడియన్స్ కి థాంక్యూ. సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. టీమ్ అందరికీ కంగ్రాజులేషన్స్. ఈ సినిమాని తప్పకుండా థియేటర్స్ లో చూడండి. ఇంత మంచి సక్సెస్ ఇచ్చిన ఆడియన్స్ కి థాంక్యూ’అన్నారు.