ప్రేక్షకుల మనసులని గెలిచి సక్సెస్ ఫుల్ గా 25 రోజులు పూర్తి చేసుకున్న
ప్రామిసింగ్ కంటెంట్ తో “రేవు” – ఈ 23న విడుదల
వంశీ రామ్ పెండ్యాల, అజయ్, స్వాతి భీమిరెడ్డి, ఏపూరి హరి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘రేవు’. ఈ చిత్రాన్ని సంహిత్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్, పారుపల్లి ప్రొడక్షన్ పై నిర్మాత డా.మురళీ గింజుపల్లి, నవీన్ పారుపల్లి సంయుక్తంగా నిర్మించారు. నిర్మాణ సూపర్ విజన్‌గా జర్నలిస్ట్ ప్రభు, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ పర్వతనేని రాంబాబు వ్యవహరిస్తున్నారు. హరినాథ్ పులి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.ఈ చిత్రం ఆగస్ట్ 23న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో మీడియాతో ముచ్చటిస్తూ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు మూవీ యూనిట్.
రేవు ప్రెస్ మీట్లో నిర్మాత మురళి గింజుపల్లి మాట్లాడుతూ.. పిలవగానే ఈ ఈవెంట్ కు వచ్చిన పాత్రికేయ కుటుంబానికి ధన్యవాదాలు. ఇప్పటికే ట్రైలర్, మూడు అద్భుతమైన పాటలు వచ్చాయి. ఇంకో పాట కూడా ఉంది. అది త్వరలోనే వస్తుంది. సినిమా రిలీజయ్యాక ఆ పాట చూసి మరింత ఎగ్జైట్ ఫీల్ అవుతారు అని అన్నారు.
డైరెక్టర్ హరినాథ్ పులి మాట్లాడుతూ.. థ్యాంక్స్ టు తెలుగు మీడియా. ప్రతి ఈవెంట్ కి వచ్చి మమ్మల్ని ఎలివేట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు. సాంగ్స్, ట్రైలర్స్ లో ఎంత ప్రామిసింగ్ కంటెంట్ ఉందో సినిమాలో కూడా అంతే ప్రామిసింగ్ కంటెంట్ ఉంది. రేవు సినిమా ఆగస్టు 23న రిలీజ్ కానుంది. థియేటర్లో ఈ సినిమాని చూడండి అని అన్నారు.
సీనియర్ జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ.. నా పాత్రికేయ కుటుంబానికి స్వాగతం. రేవు సినిమాని ఆగస్టు 23న తీసుకురాబోతున్నాం. ఎప్పుడో సంవత్సరం క్రితం నేను ఒక అయిదు నిమిషాల ట్రైలర్ చూసాక ప్రేక్షకులకు నచ్చుతుంది ఈ సినిమా అనే కాన్ఫిడెన్స్ ఏర్పడింది. ఆ తర్వాత రాంబాబు గారు సినిమా చూసారు. మేమిద్దరం కలిసి మిత్రులు, NRI, నిర్మాత మురళి గారికి ఈ సినిమా చూపిస్తే వెంటనే ఈ సినిమాని నేను చేస్తాను, రిలీజ్ చేస్తాను అని చెప్పారు. అంతకుముందు డైరెక్టర్ హరినాథ్ పులి, మిగిలిన టీమ్ అంతా కలిసి డబ్బులు పోగేసుకొని ఈ సినిమాని ఒక దశకు తీసుకువచ్చాక మేము ఈ సినిమాలోకి వచ్చాము. నిర్మాణ పర్యవేక్షణ నేను చేస్తూ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా రాంబాబు చేస్తూ ఈ సినిమాని తీసుకొస్తున్నాము. ఈ సినిమాకి మంచి రెస్పాండ్ వస్తుంది. రేవు సినిమాకి మొదట ఒక కర్టెన్ రైజర్ ఈవెంట్ పెడితే ఆ సినిమాకు మురళీమోహన్ గారు, ఆర్జీవీ గారు రావడం, అది క్రేజీ ఈవెంట్ గా మారింది. ఆ తర్వాత ఇదే వేదికపై ఆడియో ఈవెంట్ చేసి అయిదుగురు అగ్రశ్రేణి గీత రచయితలను ఆహ్వానించి కొత్తగా చేసాము. ప్రతి ఈవెంట్ కు మంచి రెస్పాండ్ వస్తుంది. ఈ రెస్పాన్స్ చూస్తుంటే 23న సినిమా హిట్ అవుతుందని నమ్మకం కలుగుతుంది అని అన్నారు.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పర్వతనేని రాంబాబు మాట్లాడుతూ.. ఇక్కడున్న వాళ్లంతా నా పాత్రికేయ మిత్రులే. హరినాథ్ పులి చేసిన ఈ రేవు సినిమా, అతని టేకింగ్ చూసాక రాంబాబు గారితో మాట్లాడి మా ఫ్రెండ్స్ అయిన మురళి గింజుపల్లి, నవీన్ పారుపల్లి లకు చెప్పి ఈ సినిమాను ఈ స్టేజి వరకు తీసుకొచ్చాము. 23న సినిమా రిలీజ్ అయ్యాక అందరితో పర్సనల్ గా మాట్లాడతాను అని తెలిపారు.
Revu as Promising Content – Movie releasing on Aug23
The film Revu, featuring Vamsi Ram Pendyal, Ajay, Swathi Bheemireddy, and Epuri Hari in lead roles, is produced by Dr. Murali Ginjupalli and Naveen Parupalli under the banners of Samhith Entertainment and Parupalli Production. The production supervision is handled by journalist Prabhu, with senior film journalist Parvataneni Rambaabu serving as the executive producer. Directed by Harinath Puli, the film is set for release on August 23rd. Ahead of the release, the film’s team interacted with the media.
Producer Murali Ginjupalli expressed gratitude to the journalists for attending the event. He mentioned that the trailer and three excellent songs have already been released, with another song set to be released soon. He assured that audiences would find even more excitement in the film once it is released. “It will live up to the expectations set by the trailer and songs,” said he.
Harinath Puli thanked the Telugu media for their support and for lending support to every event. He emphasized that the film’s content is as promising as what has been showcased in the songs and trailers. He urged everyone to watch the movie when it releases on August 23.
Production Supervisor Prabhu shared his confidence in the film after watching a five-minute trailer a year ago. He noted that both he and Rambabu were convinced of the film’s potential, leading them to show it to friends, including NRI producer Murali, who agreed to support its release. He mentioned that they joined the project after the director and team had already invested their own resources. As the film nears its release, he expressed optimism based on the positive responses to previous events, believing the film will be a success.
Executive Producer Parvataneni Rambaabu also acknowledged the media professionals present and shared that their collective support has been instrumental in bringing the film to this stage. He promised to meet the media people personally after the film’s release on the 23rd.