Thimmarajupalli TV next song Nijamena lyrical video Unveiled

పాపం ప్రతాప్ లో మగాళ్ళ సమస్యతో పాటు పరిష్కారం చూపించాం – తిరువీర్
టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ తిరువీర్ హీరోగా, ఎస్.పి. దుర్గ నరేష్ దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘పాపం ప్రతాప్’. కృషి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రాకేశ్ రెడ్డి గడ్డం, రుద్రదేవ్ మదిరెడ్డి సంయుక్తంగా నిర్మించారు. వరుస బ్లాక్ బస్టర్స్‌తో ఆడియన్స్‌ను అలరిస్తున్న ఈటీవి విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ నుంచి రాబోతున్న ఈ సినిమా నుంచి రీసెంట్గా రిలీజైన టీజర్‌కు మంచి అప్లాజ్ వస్తోంది. ఏప్రిల్ 17న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో పిల్ల ఎక్కడుంది సాంగ్ ని రిలీజ్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ కేఎం రాధకృష్ణ అద్భుతమైన మాస్ నెంబర్ గా కంపోజ్ చేసిన ఈ పాటకు సుద్దాల అశోక్ తేజ్ ఆకట్టుకునే సాహిత్యం అందించారు. రామ్ మిర్యాల వోకల్స్ సాంగ్ ఎనర్జీని మరింత పెంచాయి. ఈ సాంగ్ ఇన్స్టంట్ హిట్ గా నిలిచింది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రత్యేకంగా పరామర్శ సభ ప్రెస్ మీట్ ని నిర్వహించారు.
ప్రెస్ మీట్ లో హీరో తిరువీర్ మాట్లాడుతూ: పరామర్శ సభకు విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. గత సంవత్సరం మా బుజ్జమ్మ నన్ను వదిలి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఇరుగుపొరుగు వారు, ఊర్లో వాళ్లు ఎన్నో విధాలుగా నన్ను విమర్శించారు. అందరూ “పాపం ప్రతాప్” అని మాత్రమే అన్నారు… కానీ నా సమస్యకు పరిష్కారం చెప్పిన వాళ్లు ఎవరూ లేరు. ఈ నెల 17వ తేదీన నా “బుజ్జమ్మ”తో మీ ముందుకు, మీ ఊర్లో థియేటర్లలో వస్తాను. నా సమస్య ఏమిటి? దానికి పరిష్కారం ఏమిటి? అన్నది మీకు చూపిస్తాను. ఇప్పటివరకు “పాపం ప్రతాప్” అన్నవాళ్లతో “వీర ప్రతాప్” అనిపించుకుంటాను. ఏప్రిల్ 17న మీరు “వీర ప్రతాప్”ని చూస్తారు. డైరెక్టర్ నరేష్ ఈ కథ చెప్పిన దానికంటే అద్భుతంగా సినిమా తీశారు. అనుభవమున్న నిర్మాతలు, అలాగే ఈటీవీ విన్ టీమ్ మాకు అండగా ఉన్నారు. అందికే “ఫ్రీ వెడ్డింగ్” కంటే నాలుగు రెట్లు ఎక్కువ నమ్మకంతో ఉన్నాను.
ఈటీవీ విన్ కంటెంట్ హెడ్ నితిన్ చక్రవర్తి మాట్లాడుతూ: పరామర్శ సభకు విచ్చేసిన అతిథులందరికీ ధన్యవాదాలు. చాలాసార్లు మగాళ్ల కష్టాలు చాలా చిన్నవిగా కనిపిస్తాయి. కానీ నవ్వే ప్రతి ముఖం వెనుక ఎన్నో బాధలు ఉంటాయి. ఆ బాధలను నవ్విస్తూ చూపించే చిత్రం “పాపం ప్రతాప్”. ఇది కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా. ఏప్రిల్ 17న థియేటర్లకు వచ్చి చూడండి. మీ టికెట్‌కు సరిపడా వినోదం మాత్రమే కాదు, రెట్టింపు ఎంటర్టైన్మెంట్ ఇస్తాం. సమస్యలను చెప్పే సినిమాలు చాలా ఉంటాయి… కానీ “పాపం ప్రతాప్”లో పరిష్కారం కూడా ఉంది. ప్రతి మగాడి జీవితంలో ఎప్పుడో ఒకసారి ఎదురయ్యే సమస్య ఇది. ఆ సమస్యకు సమాధానం ఈ సినిమా ఇస్తుంది.
డైరెక్టర్ దుర్గా నరేష్ మాట్లాడుతూ: ఈటీవీ విన్ నితిన్ గారు నాకు గొప్ప సపోర్ట్ ఇచ్చారు. ఆయన సహాయం ఎప్పటికీ మర్చిపోలేను. రాధాకృష్ణ గారి పాటలు చిన్నప్పటి నుంచి వింటూ పెరిగాను. ఈ సినిమా కథ ఆయనకు చెప్పగానే వెంటనే ఒప్పుకున్నారు. “ పిల్ల ఎక్కడ ఉంది” పాట కోసం దాదాపు రెండు నెలలు శ్రమించాం. ఫైనల్‌గా అద్భుతమైన ట్యూన్ వచ్చింది. ప్రతి విజువల్‌కు సరిపోయేలా సుద్దాల అశోక్ తేజ గారు సాహిత్యం అందించారు. రామ్ మిర్యాల గారు అద్భుతంగా పాడారు. తిరువీర్ గారు మొదటి రోజు నుంచి ఎంతో సపోర్ట్ చేశారు. ఈ సినిమాలో ప్రసాద్ గారి కామెడీ ప్రత్యేకంగా ఉంటుంది. నిర్మాత రాకేష్ గారు ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమా తీశారు. అందరికీ ధన్యవాదాలు.
అవసరాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో నాకు ఒక మంచి, కొత్త రోల్ చేసే అవకాశం వచ్చింది. ఈ టీమ్‌తో పని చేయడం చాలా ఆనందంగా అనిపించింది. తప్పకుండా ఈ సినిమా మీ అందరినీ అలరిస్తుంది.
ప్రసాద్ బెహరా మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. డైరెక్టర్ నరేష్ గారు ఈ సినిమాలో మంచి అంశాన్ని సరదాగా చూపించారు. నవ్వులు పూయించే సినిమా ఇది. ఏప్రిల్ 17న థియేటర్లకు వచ్చి హాయిగా ఎంజాయ్ చేయండి.
మ్యూజిక్ డైరెక్టర్ కె.ఎం. రాధాకృష్ణ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. దాదాపు పది సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్లీ మంచి ప్రాజెక్ట్‌తో వచ్చాను. ఇది నాకు ఒక కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. డైరెక్టర్ నరేష్ ఎంతో కష్టపడి ఈ సినిమా తీశారు. నాకు మళ్లీ మంచి పాటలు చేసే అవకాశం వచ్చింది. “ఆనంద్”, “గోదావరి”, “చందమామ” లాంటి ఫీల్ మళ్లీ ఈ పాటల్లో కనిపిస్తుంది.“ పిల్ల ఎక్కడ ఉంది” లాంటి మాస్ సాంగ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. సుద్దాల అశోక్ తేజ గారు అద్భుతమైన సాహిత్యం అందించారు. ఈ సినిమాతో మళ్లీ ఒక మంచి కమ్‌బ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నాను.
ప్రొడ్యూసర్ రుద్రదేవ్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. రాధాకృష్ణ గారు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్. డైరెక్టర్ ఈ సినిమాను ఎంతో శ్రద్ధతో తీశారు. పాటలు అద్భుతంగా వచ్చాయి. మీ అందరి సపోర్ట్ కావాలి.
ప్రొడ్యూసర్ రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ సినిమాతో మీ ముందుకు రావడం ఆనందంగా ఉంది. రాధాకృష్ణ గారి మ్యూజిక్కు నేను పెద్ద అభిమాని. ఆయనతో పని చేయడం గర్వంగా ఉంది. ఈ సినిమా చాలా బాగా వచ్చింది. మీ అందరి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను.
తారాగణం:
తిరువీర్, పాయల్ రాధాకృష్ణ, రాశి, అజయ్ ఘోష్, శ్రీనివాస్ అవసరాల, రఘు బాబు, గోపరాజు రమణ, దేవి ప్రసాద్, రవి ఆంథోనీ, ప్రసాద్ బెహరా, అనంత బాబు, బాషా తదితరులు.
సాంకేతిక బృందం:
రచన & దర్శకత్వం: ఎస్.పి. దుర్గ నరేష్
నిర్మాతలు: గడ్డం రాకేష్ రెడ్డి, రుద్రదేవ్ మధి రెడ్డి
నిర్మాణ సంస్థలు: ఈటీవీ విన్, కృషి ఎంటర్టైన్మెంట్స్
సంగీత దర్శకుడు: కె.ఎం. రాధాకృష్ణ
నేపథ్య సంగీతం: సురేష్ బొబ్బిలి
సినిమాటోగ్రఫీ: విశ్వేశ్వర్ ఎస్.వి
ఎడిటర్: అన్వర్ అలీ
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ, అనంత శ్రీరామ్, రహమాన్
ప్రొడక్షన్ డిజైనర్: అరవింద్ ములే
కాస్ట్యూమ్ డిజైనర్స్: ప్రియాంక విన్నకోట, ఆర్తి వీరబోయిన
సౌండ్ డిజైన్: వందన, వరుణ్
కొరియోగ్రాఫర్: ఈశ్వర్ పెంటి
పీఆర్ఓ: వంశీ-శేఖర్
