
గాయపడ్డ సింహం కాన్సెప్ట్ చాలా బావుంది.. మంచి హ్యుమర్ ఉన్న సినిమా – దిల్ రాజు
డిఫరెంట్ ఎంటర్టైనర్స్ చేస్తున్న తరుణ్ భాస్కర్, రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌తో కలిసి ‘గాయపడ్డ సింహం’ తో అలరించబోతున్నారు. ఈ చిత్రాన్ని సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ నిర్మిస్తున్నాయి. పవన్ సాదినేని ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఇటివల విడుదలైన ఫన్ ఫిల్డ్ ట్రైజర్, న్ ప్రమోషనల్ ర్యాప్ సాంగ్ కు కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా మేకర్స్ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
ఈ ప్రాజెక్ట్‌కు మరింత బలాన్ని చేకూరుస్తూ, దిల్ రాజు థియేట్రికల్ హక్కులను కొనుగోలు చేసి, ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి, విష్ణు ఓయ్, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రల్లో నటించారు. చిత్రానికి స్ట్రాంగ్ టెక్నికల్ టీం పనిచేసింది. విద్యా సాగర్ చింత సినిమాటోగ్రాఫర్, స్వీకర్ అగస్తి సంగీత దర్శకుడు, ప్రొడక్షన్ డిజైనర్ చంద్రిక గొర్రెపాటి, సూర్య ప్రకాష్ జ్యోసుల కథను అందించారు.
రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ప్రెస్ మీట్ లో ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. తరుణ్ భాస్కర్ గాయపడ్డ సింహం గురించి చెప్పారు. పవన్ ని ఈ సినిమా కాన్సెప్ట్ గురించి అడిగాను. ముందు ఈ టీజర్ చూపించారు. టీజర్ చాలా నచ్చింది. తర్వాత మొత్తం కాన్సెప్ట్ చెప్పారు. నాకు చాలా నచ్చింది. దీంతో ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా మేము రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చాం. కాన్సెప్ట్ చాలా బాగుంది. టీజర్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మంచి హ్యూమర్ ఉన్న సినిమా ఇది. ఈ సినిమాని మా ఎస్విసి ద్వారా వరల్డ్ వైడ్ రిలీజ్ చేయబోతున్నాం. టీమ్ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. ప్రమోషన్స్ కి కొత్తగా ప్రయత్నం చేయాలని ఈ ఇలా యూనిక్ గా ఈవెంట్ ని నిర్వహించడం జరిగింది. మే 1 ఈ సినిమా రిలీజ్ అవుతుందని రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం జరిగింది. అయితే దానికి కూడా కండిషన్స్ అప్లై. ఎందుకంటే ఏప్రిల్ 30కి పెద్ది సినిమా ఆల్రెడీ అనౌన్స్ అయింది. ఆ సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ ఉంటుంది. ఆ సినిమా వచ్చినప్పుడు ఈ సినిమాకి థియేటర్స్ మేమే ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి కండిషన్స్ అప్లై అని చెప్పాము. మళ్ళీ మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. అవసరమనకుంటే ఒక వారం రోజులు వెనక్కి జరుపుకునే అవకాశం కూడా ఉంటుంది. మంచి కాన్సెప్ట్ తో ఈ సినిమా చేసినందుకు టీమ్ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్.
ప్రొడ్యూసర్ భాను కిరణ్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. దిల్ రాజు గారు ఈ సినిమాని రిలీజ్ చేయడానికి తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆయన టచ్ చేసిన ఏ సినిమా అయినా అద్భుతంగా ఆడుతుంది. ఆయన ఏది పట్టుకుంటే అది గోల్డ్ మైన్. ఈ సినిమా కూడా గోల్డ్ మైన్ అవుతుందని ఆయన ముందుగానే ఊహించారు. మాలాంటి యంగ్ ఫిలిం మేకర్స్ ని సపోర్ట్ చేస్తున్న దిల్ రాజు గారికి థాంక్యూ సో మచ్. ఆయన డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న సినిమాలో మేం భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాకి మిగతా బిజినెస్ కూడా చాలా బాగుంది. మ్యూజిక్ రైట్స్ జీ వాళ్లే తీసుకున్నారు. ఓటీటీ కూడా లాక్ అయింది. థియేటర్స్ లో కూడా అద్భుతంగా ఆడుతుంది.
పవన్ సాదినేని మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. దిల్ రాజు గారికి స్పెషల్ థాంక్యూ. ఆయనకి టీజర్ కాన్సెప్ట్ నచ్చి ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు. అది మాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. మే 1న ఈ సినిమా రిలీజ్ అనుకుంటున్నాము. ఏప్రిల్ 30న పెద్ది వస్తోంది. థియేటర్స్ విషయంలో ఏదైనా ఇబ్బంది కలిగితే దానికి అనుకూలంగా డేట్ మార్చుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. ఈ సినిమా టీజర్ కి సాంగ్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో చాలా సర్ ప్రైజ్ లు ఉంటాయి. ఒకదాని తర్వాత ఒకటి మేము రివిల్ చేస్తాము.
డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమా రిలీజ్ చేస్తున్న దిల్ రాజు గారికి ధన్యవాదాలు. నాకు ఈ సినిమా కోసం ఫస్ట్ సపోర్ట్ చేసింది పవన్ గారు. అలాగే వారికి తోడుగా నిర్మాతలు, జి టీం అందరూ కూడా సపోర్ట్ చేశారు. మా అందరికీ సపోర్ట్ గా దిల్ రాజుగారు రావడం చాలా పాజిటివ్ గా ఉంది. గాయపడ్డ సింహం మే1, థియేటర్స్ లో కలుద్దాం.
తారాగణం: తరుణ్ భాస్కర్, ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి, విష్ణు ఓయి, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్, తదితరులు
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: కశ్యప్ శ్రీనివాస్
సమర్పణ: పవన్ సాదినేని
నిర్మాతలు: కళ్యాణ చక్రవర్తి మంతిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సాల్
బ్యానర్లు: సప్తస్వ మీడియా వర్క్స్, POV స్టోరీస్, జీ స్టూడియోస్
DoP: విద్యా సాగర్ చింత
సంగీతం: స్వీకర్ అగస్తీ
ఎడిటర్: విప్లవ్ నిషాదం
ప్రొడక్షన్ డిజైనర్: చంద్రిక గొర్రెపాటి
కథ: సూర్య ప్రకాష్ జ్యోసుల
కాస్ట్యూమ్ డిజైనర్: అపూర్వ రెడ్డి
క్రియేటివ్ ప్రొడ్యూసర్: శ్రీని జోస్యుల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పెన్మత్స అజయ్ వర్మ
PRO: వంశీ-శేఖర్
డిజిటల్ మీడియా: హ్యాష్‌ట్యాగ్ మీడియా
సౌండ్ డిజైన్: సింక్ సినిమాస్
Vfx & టైటిల్ యానిమేషన్: ఎగ్ వైట్
పబ్లిసిటీ డిజైన్: ఎల్లోటూత్స్
