
కుబేర కు యునానిమస్ బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన ప్రేక్షకులకు థాంక్ యూ – కింగ్ నాగార్జున
సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న లేటెస్ట్ యునినామస్ బ్లాక్ బస్టర్ శేఖర్ కమ్ముల ‘కుబేర’. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి SVCLLPపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని హై బడ్జెట్ హై ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మించారు. కుబేర తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలై యునానిమస్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని అద్భుతమైన బుకింగ్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
ప్రెస్ మీట్ లో కింగ్ నాగార్జున మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మీడియా అందరికీ థాంక్యు. ఫస్ట్ టైం యునానమస్ గా బ్లాక్ బస్టర్ రివ్యూలు వచ్చాయి. ఎందులోనూ 3 రేటింగ్ కి తక్కువ లేదు. అంత యునానిమస్ గా సినిమా అందరికీ నచ్చింది. నిర్మాతలు సునీల్, పుష్కర్ రామ్మోహన్ గారికి థాంక్యూ. శేఖర్ తో నాకు ఎప్పటి నుంచో సినిమా చేయాలని ఉంది. సుమంత్, చైతన్య, అమల వీళ్లంతా పనిచేయడానికి ముందు నుంచే శేఖర్ తో వర్క్ చేయాలని ఉండేడి. శేఖర్ కూడా ‘మీతో ఒక స్టైలిష్, ఫ్యామిలీ సినిమా చేయాలని వుందని’ చెప్తుండేవారు. ఫైనల్ గా మా కాంబినేషన్లో ‘కుబేర’ వచ్చింది. ఇది బ్యూటిఫుల్ క్యారెక్టర్. నాకు ఎప్పటినుంచో ఒక కొత్త క్యారెక్టర్ చేయాలని ఉండేది. శేఖర్ సినిమాలన్నీ చూశాను. ఆయన క్యారెక్టర్ కి అద్భుతంగా న్యాయం చేస్తారు. ఈ కథ వినగానే నాది మెయిన్ కరెక్ట్ అనిపించింది. ప్రతి పాత్ర కూడా నేను చేసిన దీపక్ క్యారెక్టర్ చుట్టూనే తిరుగుతుంది. ఈ కథ వినగానే ఇది దీపక్ కథ అనిపించింది. శేఖర్ కూడా దీన్ని అలానే చెప్పారు. దీపక్ క్యారెక్టర్ ఆర్క్ అద్భుతంగా ఉంటుంది. అది నాకు చాలా నచ్చింది. ఈ సినిమాలో మిగతా క్యారెక్టర్ ఆర్క్స్ ఒకేలా ఉంటాయి. కానీ దీపక్ క్యారెక్టర్ లో త్రీ షేడ్స్ ఇచ్చారు. అందుకే ఈ క్యారెక్టర్ బాగా నచ్చి ఓకే చెప్పాను. నా క్యారెక్టర్ కి వచ్చిన రెస్పాన్స్ గొప్ప ఆనందం ఇచ్చింది. ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మిస్సమ్మ మాయాబజార్ గుండమ్మ కథ ఈ సినిమా అన్నిట్లో కూడా హీరో ఎవరని చెప్పలేం. అందులో కథ హీరో. అవన్నీ కూడా డైరెక్టర్ ఫిలిమ్స్. కుబేర కూడా అవుట్ అండ్ అవుట్ శేఖర్ కమ్ముల గారి ఫిలిం. ఈ సినిమా కోసం ప్రాణం పోశారు. వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్. సినిమాని ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చేసిన ఆడియన్స్ అందరికీ థాంక్యూ’అన్నారు.
డైరెక్టర్ శేఖర్ కమ్ముల మాట్లాడుతూ..అందరికి నమస్కారం. చాలా ఎమోషనల్ గా ఉంది. ఈ సినిమా కథ పుట్టినప్పటినుంచి చాలా డిఫరెంట్ గా చేద్దాం, హాలీవుడ్ స్థాయిలో తీద్దాం, రియల్ లొకేషన్స్ లో చేద్దాం, ముంబైని కొత్తగా చూపిద్దామని ఆశ. నాగార్జున గారి దగ్గరికి అదే ఆశతో వెళ్ళాము. చాలా డిఫరెంట్‌గా తీద్దామని అని ఆయనకి చెప్పాను. ఆయనకి చాలా నచ్చింది. ఆయన అద్భుతంగా చేశారు. ఈ జర్నీలో మాకు ఆయన ఎంతో ధైర్యాన్ని నింపి ముందుకు నడిపారు. అలాగే ధనుష్ గారు కూడా. ఇది సామాన్యమైన సినిమా కాదు. సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా అని ప్రీరీలీజ్ ఈవెంట్లో చెప్పాను. అది ఈరోజు నిజమైంది. నేను చేసిన సినిమాల్లో ఇది వన్ ఆఫ్ ది ఫైనెస్ట్, హానెస్ట్, ట్రూ ఫిలిం. ఇంత కొత్తగా జెన్యూన్ గా సినిమా తీసినప్పుడు ఇందులో చాలా లేయర్స్ చెప్పడానికి ప్రయత్నించాను. ఆ క్రమంలో కాస్త లెంత్ ఉండవచ్చు. ఈ సినిమాని మీరు మరోసారి చూసినప్పుడు మీకు తెలియని లేయర్స్ కూడా కొత్తగా కనిపిస్తాయి. సినిమా తగ్గించాలని డైరెక్టర్ కి గాని, టీం కి గాని తెలియని విషయం కాదు. కానీ ఇది చెప్పాల్సిన విషయం. కచ్చితంగా చెప్పి తీరాలి. ఒక పాయింట్ ని నిజాయితీగా చెప్పడమే మా ధర్మం. ఇప్పుడు మీరు ఇచ్చిన యునానిమిస్ రిపోర్ట్ తో చాలా ప్రౌడ్ గా ఉంది. ఈ స్థాయి మీరు ఇచ్చారని భావిస్తున్నాను. ఈ సినిమాకి గొప్ప స్థాయి ఇచ్చిన మీడియా కి, ప్రేక్షకులకు ధన్యవాదాలు. నాగర్జున, ధనుష్ గారి పర్ఫార్మెన్స్ కి థియేటర్స్ లో వస్తున్న రెస్పాన్స్ అద్భుతంగా ఉంది. చాలా మంచి టేకింగ్.. డైరెక్షన్..ప్రొడక్షన్.. అన్నిటి గురించి ప్రేక్షకులు చాలా గొప్పగా మాట్లాడుతున్నప్పుడు చాలా గర్వంగా ఆనందంగా అనిపిస్తోంది. మీ అందరి సపోర్ట్ కి థాంక్యూ. ఇది ఒక కంప్లీట్ ఫిలిం’అన్నారు.
నిర్మాత సునీల్ నారంగ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. కుబేర పెద్ద సూపర్ హిట్. ఆడియన్స్ , మీడియా వారికి థాంక్యూ వెరీ మచ్. సినిమా పట్ల చాలా ఆనందంగా ఉన్నాం. ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని కథ విన్నప్పుడే చెప్పాను. శేఖర్ కమ్ముల గారు గ్రేట్ డైరెక్టర్. ఫ్యూచర్ లో కూడా ఆయన అన్ని సూపర్ హిట్ సినిమాలు తీస్తారు. నాగార్జున గారికి థాంక్ యూ. ఆయన చాలా సపోర్ట్ చేశారు. ఆయన సపోర్ట్ తోనే సినిమాని అనుకున్న సమయంలో రిలీజ్ చేయగలిగాం. నిన్న సెకండ్ షో చూస్తున్నప్పుడు మైండ్ బ్లోయింగ్ గా ఉంది. ఈరోజు కూడా బుకింగ్స్ టెర్రిఫిక్ గా ఉన్నాయి. ఇది డే బై డే పెరుగుతూ వెళుతుంది. ఎక్కడ తగ్గదు. మీడియా, ఆడియన్స్ సపోర్టుకి థాంక్యూ వెరీ మచ్’అన్నారు.
నిర్మాత పుష్కర రామ్మోహన్ మాట్లాడుతూ..అందరికీ నమస్కారం. మేము చాలా ఆనందంగా వున్నాం. శేఖర్ గారు అద్భుతమైన సినిమా ఇచ్చారు. సినిమాకి ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ రిపోర్ట్ వచ్చిం.ది ఈ క్రెడిట్ అంతా టీం అందరికీ దక్కుతుంది. నిర్మాతలుగా మేము చాలా హ్యాపీగా ఉన్నాం. నాగార్జున గారికి, ధనుష్ గారికి, శేఖర్ గారికి అందరికీ థాంక్యూ. ఇంత అద్భుతమైన విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకి కృతజ్ఞతలు’అన్నారు