కామాఖ్య ఎక్స్ ట్రార్డినరీ ఫిల్మ్. పవర్ ఫుల్ థ్రిల్లర్ – సముద్రఖని

కామాఖ్య ఎక్స్ ట్రార్డినరీ ఫిల్మ్. పవర్ ఫుల్ థ్రిల్లర్ – సముద్రఖని
సమైరా, సముద్రఖని, అభిరామి ప్రధాన పాత్రల్లో అభినయ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న థ్రిల్లింగ్ ‘కామాఖ్య’. మై ఫిల్మ్ ప్రొడక్షన్స్ PVT LTD బ్యానర్ పై వడ్డేపల్లి శ్రీ వాణీనాథ్, యశ్వంత్ రాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ ఈ సినిమా టీజర్ ని లాంచ్ చేశారు.
టీజర్ లాంచ్ ఈవెంట్ లో యాక్టర్ సముద్రఖని మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మా దర్శక నిర్మాతలకు టీమ్ అందరికీ ధన్యవాదాలు. అభిరామి మేడం గారికి నేను అభిమానిని. వారితో కలిసి నటిస్తున్న రెండో సినిమా ఇది. మరెన్నో చిత్రాలు కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాను ఈ సినిమా టైటిల్ కామాఖ్య అని చెప్పగానే మరో ఆలోచన లేకుండా చేసేద్దాం అని చెప్పాను. ఆ పవర్ నాకు తెలుసు. నా కెరీర్ లో ఒక ప్రాజెక్టు విషయంలో చాలా ఆలస్యం అయింది. ఆ సమయంలో అమ్మవారి దర్శనం కోసం వెళ్లాను. అక్కడ ఓ ఋషి నన్ను పేరుతో పిలిచి మాట్లాడారు. ఆ సందర్భంలో నా ప్రాజెక్ట్స్ సంగతి చెప్పాను. దర్శనం చేసుకొని వెళ్ళు అయిపోతుంది అన్నారు. తమిళనాడు ల్యాండ్ అయిన వెంటనే హీరోతో మీటింగ్ అనే మెసేజ్ వచ్చింది. అది అమ్మవారి పవర్. సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ అక్కడి వెళ్లి అన్నదానం చేసి వచ్చాను. సరిగ్గా ఆరు నెలలకి అభి ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పారు. చేసేద్దాం అన్నాను. ఇది ఎక్స్ ట్రార్డినరీ మూవీ. అమ్మవారి అనుగ్రహం అందరిపై వుండాలని కోరుకుంటున్నాను. తప్పకుండా అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.
డైరెక్టర్ అభినయ కృష్ణ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది అందరికీ మంచి జరగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. కామాఖ్య నేను దర్శకత్వం వహించిన రెండో చిత్రం. మొదటి చిత్రం చిరంజీవా. ఆ చిత్రంలో యమధర్మరాజుకి ఒక గుడి ఉందని, అది తెలంగాణలోనే ఉందని చెప్పడం జరిగింది. కామాఖ్య అమ్మవారి నేపథ్యంలో ఈ చిత్రాన్ని ఒక ఉత్కంఠభరితంగా ప్రజెంట్ చేస్తూ మీ ముందుకు తీసుకు వస్తున్నాం. సముద్రఖని గారు, అభిరామి గారు సమైరా గారు ఇలా అద్భుతమైన నటీనటులందరూ కూడా వాళ్ల కోసమే ఈ పాత్రలు సృష్టించామా అన్నంత సహజంగా వారి వారి పాత్రల్లో ఒదిగిపోయారు. నా స్నేహితుడు రిశాంక్ అలాగే బాహుబలికి పనిచేస్తున్నప్పుడు సెంథిల్ గారి దగ్గర పరిచయమైన రమేష్.. మేము ముగ్గురం కలిసి ఈ కథను ముందుకు తీసుకెళ్ళాం. అనుకున్న సమయంలో అనుకున్న బడ్జెట్లో ఈ సినిమాని తీగలిగాం. దీనికి మా టీమ్ అందరూ ఎంతగానో సపోర్ట్ చేశారు. టీజర్ మీ అందరికీ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఆ ఆసక్తిని ముందు ముందు వచ్చే కంటెంట్ లో కూడా కొనసాగిస్తాము. దృశ్యం సినిమా తరహాలో ఉండే మంచి థ్రిల్లర్ ఇది. త్వరలో ఈ సినిమా మీ ముందుకు రాబోతోంది. ఒక నటుడిగా నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. అలాగే ఇప్పుడు దర్శకుడుగా కూడా ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను.
అభిరామి మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. కామాఖ్య బ్యూటిఫుల్ ఫిలిం. ఇప్పటివరకు నేను ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు. నన్ను ఇంత కొత్తగా చూపించిన డైరెక్టర్ అభిగారికి థాంక్యూ సో మచ్. ఈ సినిమాలో పనిచేస్తున్న యాక్టర్స్ టెక్నీషియన్స్ అందరు కూడా చాలా ప్రతిభావంతులు. ఒక చిన్న సినిమా వెనకాల చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. టీం అందరూ కూడా ఈ సినిమా కోసం కలిసికట్టుగా పనిచేశారు. ఈ సినిమాకి సపోర్ట్ చేస్తూ ఆడియన్స్ వద్దకి తీసుకువెళ్లాలని మీడియా వారిని కోరుతున్నాను. తప్పకుండా అందరూ కూడా ఈ సినిమాని థియేటర్స్ లో చూడాలని ఆశిస్తున్నాను.
సమైరా మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇది నా ఫస్ట్ మూవీ. నా తొలి చిత్రం ఫిమేల్ సెంట్రిక్ గా ఉండడం అలాగే కామాఖ్య అనే అనే పవర్ఫుల్ టైటిల్ ఈ సినిమాకి ఉండడం అదృష్టంగా భావిస్తున్నాను. తప్పకుండా మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సముద్రఖని గారు అభిరామి గారు టీంలో అందరూ నాకు ఎంతో ప్రోత్సహించారు. చాలా మంచి సూచనలు ఇచ్చారు. వారితో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. అభి గారు ఈ సినిమాని అద్భుతంగా తీర్చిదిద్దారు. నాకు ఈ సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. ఇది చాలా మంచి థ్రిల్లర్ మూవీ. కచ్చితంగా మీకు థ్రిల్ ఇస్తుంది అందరూ కూడా మా మూవీని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.
ప్రొడ్యూసర్ వాణినాథ్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇది చాలా స్పెషల్ ప్రాజెక్టు. మా టీం మంచి క్లారిటీ విజన్ తో ఈ సినిమాని అద్భుతంగా రూపొందించారు. మా ప్రొడక్షన్లో వస్తున్న ఫస్ట్ మూవీ ఇది. తప్పకుండా అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ ఈవెంట్ లో మూవీ టీం అందరూ పాల్గొన్నారు.
తారాగణం: సమైరా, సముద్రఖని, అభిరామి, ఆనంద్, శరణ్య ప్రదీప్,వైష్ణవ్, ధనరాజ్, రాఘవ, ఐశ్వర్య
కథ, దర్శకత్వం: అభినయ కృష్ణ
బ్యానర్: మై ఫిల్మ్ ప్రొడక్షన్స్ PVT LTD
నిర్మాతలు: వడ్డేపల్లి శ్రీ వాణీనాథ్, యశ్వంత్ రాజ్
DOP: రమేష్ కుశేందర్ రెడ్డి
క్రియేటివ్ డైరెక్టర్: రిషాన్
సంగీతం: గ్యాని
ఎడిటర్: వరప్రసాద్
ఆర్ట్: భూపతి యాదగిరి
VFX: ఫణి విహారి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శ్రీహరి గౌడ్
పీఆర్వో: వంశీ శేఖర్
డిజిటల్: హాస్టాగ్ మీడియా
