
కర్మాఖ్య ట్రైలర్ అద్భుతంగా ఉంది.. జులై 31న థియేటర్స్‌లో చూసి ఆదరించండి – లేడీ సూపర్ స్టార్ విజయశాంతి
సమైరా, సముద్రఖని, అభిరామి ప్రధాన పాత్రల్లో అభినయ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న థ్రిల్లింగ్ ‘కర్మాఖ్య’. మై ఫిల్మ్ ప్రొడక్షన్స్ PVT LTD బ్యానర్ పై వడ్డేపల్లి శ్రీ వాణీనాథ్, యశ్వంత్ రాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, సాంగ్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. జూలై 31న ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కానుంది. తాజాగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ వేడుకకు లేడి సూపర్ స్టార్ విజయశాంతి ముఖ్య అతిథి హాజరయ్యారు.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. ఈ సినిమా టైటిల్ నాకు చాలా నచ్చింది. మొదట ‘కామాఖ్య’ అనే టైటిల్ చెప్పినప్పుడు చాలా పవర్‌ఫుల్‌గా అనిపించింది. కామాఖ్య అమ్మవారు పవర్ ఫుల్. ఖచ్చితంగా విజయం సాధిస్తుందని అనుకున్నాను. అయితే కొన్ని కారణాల వల్ల ఇప్పుడు ‘కర్మాఖ్య’ అని పెట్టారు. అందులో కూడా అమ్మవారి పేరు ఉంది. అభి గుండు కొట్టించుకోవాల్సిన అవసరం లేదు. సినిమా డెఫినెట్‌గా హిట్ అవుతుంది. ఈ మధ్య మంచి సబ్జెక్టులతో ఇండస్ట్రీలోకి వస్తున్నారు. నిజానికి చిన్న సినిమాల్లో దమ్ముంది, సబ్జెక్ట్ ఉంది. మేమందరం కూడా చిన్న సినిమాలు చేస్తూ ఈ స్థాయికి వచ్చాం. తప్పకుండా మంచి సబ్జెక్ట్ ఉన్న చిన్న సినిమాలను విజయవంతం చేయాలని మీడియాను, ప్రేక్షకులను కోరుతున్నాను. ఈ సినిమాతో దర్శకుడు అభినయ కృష్ణ విజయం సాధిస్తాడని నమ్మకం ఉంది. మీడియా కూడా ఇలాంటి చిన్న సినిమాలకు మంచి చోటు కల్పించి ప్రోత్సాహం ఇవ్వాలని కోరుకుంటున్నాను. హీరోయిన్ సమైరా చాలా చక్కగా చేసింది. తెలుగు కూడా చాలా చక్కగా మాట్లాడటం అభినందనీయం. ట్రైలర్ చూసినప్పుడు మ్యూజిక్‌లో ఒక వైబ్రేషన్ వినిపించింది. ట్రైలర్ చాలా బాగుంది. ఆర్టిస్టులు అందరూ కూడా చాలా చక్కగా చేశారు. ఈ సినిమాలో నటించిన ఆనంద్ గారు కూడా చాలా మంచి నటుడు. ఈ సినిమాకి నిర్మాతలు చాలా ఖర్చు పెట్టారు. వాళ్ల ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ప్రజలందరూ జులై 31న థియేటర్లకు వచ్చి ఈ సినిమాను ఆదరించి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను.
మధు యాష్కీ మాట్లాడుతూ… లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారు ఈ కార్యక్రమానికి వచ్చి బ్లెస్సింగ్స్ అందించడం నిజంగా ఈ టీమ్ మొత్తానికి గొప్ప ప్రోత్సాహం. ఈ సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తోంది. నేను సినిమాలను తరచుగా చూస్తుంటాను. నాకు సినిమా మంచి కాలక్షేపం. మంచి సినిమా వస్తే తప్పకుండా చూడాలనిపిస్తుంది. ‘కర్మాఖ్య’ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. దర్శకుడు అభినయ కృష్ణకు, టీమ్ మొత్తానికి ఆల్ ది వెరీ బెస్ట్. మీడియా కూడా ఈ సినిమాను బాగా ప్రమోట్ చేయాలని కోరుకుంటున్నాను. నిర్మాతలకు కూడా ఆల్ ది వెరీ బెస్ట్. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను.
దర్శకుడు అభినయ కృష్ణ మాట్లాడుతూ… మా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారికి ధన్యవాదాలు. ‘కర్తవ్యం’ సినిమా ఎన్నిసార్లు చూశానో లెక్కలేదు. ఆమె చిత్రాలు నాకు ఎంతగానో స్ఫూర్తినిచ్చాయి. అలాగే మధు యాష్కీ గారికి కూడా ధన్యవాదాలు. మీ అందరికీ ట్రైలర్ నచ్చడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాకు మొదట ‘కామాఖ్య’ అనే టైటిల్ ఖరారు చేశాం. అయితే కొన్ని కారణాల వల్ల టైటిల్ మార్చుకోవాల్సి వచ్చింది. ఇప్పటికే ఆ పేరుతో చాలా ప్రమోషన్స్ చేశాం. దీంతో మరో పేరు సూచించమని సోషల్ మీడియాలో వీడియో పెట్టాను. ఆ సమయంలో చాలామంది వినూత్నమైన పేర్లు పంపించారు. అందరికీ ధన్యవాదాలు. మేము ‘కామాఖ్య’ టైటిల్‌కు దగ్గరగా ఉండే సౌండింగ్‌తో ‘కర్మాఖ్య’ అనే టైటిల్‌తో వస్తున్నాం. ఇది అమ్మవారి ఎలిమెంట్ ఉన్న క్రైమ్ థ్రిల్లర్. మీరు ఈ సినిమా చూసి 100 శాతం థ్రిల్ అవుతారని నమ్ముతున్నాను. ఈ సినిమాకు హిట్ టాక్ రాకపోతే నేను గుండు కొట్టించుకుంటాను. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్‌తో చెప్పడం కాదు. నా సబ్జెక్ట్‌పై, నేను పడిన కష్టంపై ఉన్న నమ్మకంతో చెబుతున్న మాట. ఒకవేళ నేను తప్పు అయితే, నాకు నేనే ఇచ్చుకున్న పనిష్మెంట్గా భావిస్తాను. జులై 31న సినిమాను రిలీజ్ చేస్తున్నాం. మీడియా కూడా మాకు సహకారం అందించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా పైసా వసూల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఒక మలయాళం, హాలీవుడ్ సినిమా చూసిన ఫీలింగ్ మీకు కలుగుతుంది. ఈ సినిమాలో పనిచేసిన టీమ్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ప్రతి క్యారెక్టర్‌కు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. పేరు మారిన చాలా సినిమాలు విజయవంతమయ్యాయి. మా సినిమా కూడా తప్పకుండా గొప్ప విజయం సాధిస్తుందని నమ్ముతున్నాం. నా తొలి సినిమాకు బెస్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చింది. ఈ సినిమాకు కూడా అవార్డు వస్తే ఆనందమే. ఒకవేళ నాకు కాకపోయినా మా టీమ్‌లో ఎవరికైనా అవార్డు వచ్చినా అదే ఆనందాన్ని పొందుతాను. ఈ సినిమా విజయం సాధిస్తే ఆ క్రెడిట్ మొత్తం మా టీమ్‌ది. ఒకవేళ విజయం సాధించకపోతే ఆ బాధ్యత మొత్తం నాదే. నాకు సపోర్ట్ చేయడానికి వచ్చిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. జులై 31న ఈ సినిమాను థియేటర్లలో ఎక్స్పీరియన్స్ చేయండి. మీకు నచ్చితే మరో నలుగురికి చెప్పండి. మౌత్ పబ్లిసిటీ ద్వారా మా సినిమా ప్రేక్షకులకు చేరుతుందని మాకు నమ్మకం ఉంది.
సమైరా మాట్లాడుతూ… విజయశాంతి మేడమ్ గారికి థ్యాంక్యూ. వారు మా సినిమా కార్యక్రమానికి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇది నా తొలి సినిమా. నా తొలి ట్రైలర్ లాంచ్ కూడా. అందుకే ఇది నాకు చాలా స్పెషల్ మూమెంట్. నటి కావాలనేది నా కల. అది ఈ సినిమాతో నెరవేరినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో పనిచేసిన అందరూ నాకు ఎంతో సపోర్ట్ చేశారు. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది. అందరూ ఈ సినిమాను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను.
శరణ్య మాట్లాడుతూ… మేమంతా ఎంతో కష్టపడి ఈ సినిమా చేశాం. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. జులై 31న సినిమా విడుదలవుతోంది. తప్పకుండా అందరూ థియేటర్లలో చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ సినిమాతో అభి గారికి మరో అవార్డు రావాలని కోరుకుంటున్నాను.
నిర్మాత వడ్డేపల్లి శ్రీ వాణీనాథ్ మాట్లాడుతూ… విజయశాంతి గారికి, మధు యాష్కీ గారికి ధన్యవాదాలు. అలాగే సునీల్ నారంగ్ గారికి, నవీన్ గారికి ధన్యవాదాలు. మా సినిమా డిస్ట్రిబ్యూషన్ తీసుకుని మాపై నమ్మకం ఉంచారు. ఈ సినిమా కోసం అందరూ చాలా కష్టపడి పని చేశారు. మా దర్శకుడు అభినయ కృష్ణ ఎంతో నిజాయితీగా, అంకితభావంతో ఈ సినిమాను తెరకెక్కించారు. తప్పకుండా ఆయనకు అవార్డు వస్తుందని నమ్ముతున్నాను. ట్రైలర్ మీకు ఒక ప్రివ్యూ మాత్రమే. సినిమా మాత్రం పూర్తి స్థాయి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. జులై 31న అందరం థియేటర్లలో కలుద్దాం.
రవికుమార్ పనస మాట్లాడుతూ…ఈ సినిమా నేను చూశాను. చాలా అద్భుతంగా వచ్చింది. నిర్మాతలకు, నటీనటులకు, టెక్నీషియన్లందరికీ అభినందనలు. దర్శకుడు అభికి ఈ సినిమా ద్వారా మరో అవార్డు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
తారాగణం: సమైరా, సముద్రఖని, అభిరామి, ఆనంద్, శరణ్య ప్రదీప్, వైష్ణవ్, ధనరాజ్, రాఘవ, ఐశ్వర్య
కథ, దర్శకత్వం: అభినయ కృష్ణ
బ్యానర్: మై ఫిల్మ్ ప్రొడక్షన్స్ PVT LTD
నిర్మాతలు: వడ్డేపల్లి శ్రీ వాణీనాథ్, యశ్వంత్ రాజ్
DOP: రమేష్ కుశేందర్ రెడ్డి
క్రియేటివ్ డైరెక్టర్: రిషాన్
సంగీతం: గ్యాని
ఎడిటర్: వరప్రసాద్
ఆర్ట్: భూపతి యాదగిరి
VFX: ఫణి విహారి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శ్రీహరి గౌడ్
పీఆర్వో: వంశీ శేఖర్
డిజిటల్: హాస్టాగ్ మీడియా
