ఆడియెన్స్‌ను ఎడ్యుకేట్ చేసేలా ఉంటుంది “జనక అయితే గనక” – నిర్మాత దిల్ రాజు
వెర్సటైల్ యాక్టర్ సుహాస్, సంగీర్తన హీరో హీరోయిన్లుగా దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’. శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రాన్ని సందీర్ రెడ్డి బండ్ల డైరెక్ట్ చేశారు. సెప్టెంబర్ 7న ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ మీడియా ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమంలో…
దిల్ రాజు మాట్లాడుతూ.. ‘జనక అయితే గనక’ సెన్సార్ అయింది.యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. ఆల్రెడీ టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. సుహాస్ తన ప్రతీ సినిమాతో ఒక్కో మెట్టు ఎక్కుతూనే ఉన్నాడు. కొత్త కథలను చెప్పేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఓ మామూలు స్థాయి నుంచి వచ్చి ఇప్పుడు ఆయన ఎంచుకుంటున్న కథలు, స్క్రిప్ట్‌లు చాలా గొప్పగా ఉన్నాయి. సుహాస్ అంటే మినిమం గ్యారెంటీ అని యూఎస్ డిస్ట్రిబ్యూటర్లు కూడా చెబుతున్నారు. దిల్ రాజు ప్రొడక్షన్ అంటే ఫ్యామిలీతో చూడదగ్గ సినిమానే ఉంటుంది. కాకపోతే ఈ సినిమా కథ కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. కాస్త పక్కకు జరిగి ఈ కథను చేసినా ఆ లైన్ దాటకుండా తీశాం. ఆడియెన్స్‌ను ఎడ్యుకేట్ చేసేలా ఉంటుంది. సినిమా గురించి నేను తక్కువ మాట్లాడతాను. సినిమానే ఎక్కువ మాట్లాడాలని కోరుకుంటున్నాను. విజయ్ బుల్గానిన్ మంచి పాటలు ఇచ్చారు. మలయాళీ అమ్మాయి అయినా తెలుగు నేర్చుకుని డబ్బింగ్ చెప్పారు. చిన్న చిత్రాలకు ప్రీమియర్లు బాగానే కలిసి వస్తున్నాయి. ఈ పెయిడ్ ప్రీమియర్లు అనేది కూడా ఓ స్ట్రాటజీనే. మేం సెప్టెంబర్ 6న ప్రీమియర్లు వేస్తున్నాం. మంచి చిత్రాన్ని ఇస్తే ఆడియెన్స్ కచ్చితంగా ఆదరిస్తారు. మీడియా, ఆడియెన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందా? అని వెయిట్ చేస్తున్నాను. ఈ సినిమా మాత్రం ఆద్యంతం నవ్వించేలా ఉంటుంది. ఓ మంచి సందేశాన్ని ఇచ్చారు అనే ఆలోచనతో థియేటర్ నుంచి బయటకు వస్తారు’ అని అన్నారు.
దర్శకుడు సందీప్ రెడ్డి బండ్ల మాట్లాడుతూ.. ‘ప్రశాంత్ నీల్ టీంలోకి నన్ను దిల్ రాజు గారే పంపారు. అక్కడ చాలా నేర్చుకున్నాను. ప్రశాంత్ నీల్ గారికి ఈ కథ తెలుసు. బాగుందని మెచ్చుకున్నారు’ అని అన్నారు.
సుహాస్ మాట్లాడుతూ.. ‘‘జనక అయితే గనక’ సెన్సార్ అయింది. చాలా బాగా వచ్చింది. ఆడియెన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందా? అని వెయిట్ చేస్తున్నాను. స్క్రిప్ట్ విన్నప్పుడు నవ్వుతూనే ఉన్నాను. సినిమాను చేస్తున్న టైంలోనే ఈ డిస్ట్రిబ్యూషన్ గురించి దిల్ రాజు గారిని అడిగాను. ఓవర్సీస్లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నాను అని చెప్పాను. ఆయన కూడా ఓకే అన్నారు.’ అని అన్నారు.
ఎడిటర్ కోదాటి పీకే మాట్లాడుతూ.. ‘అందరూ కలిసి చూసేలా సినిమా ఉంటుంది. వాట్సాఫ్ ఫార్వార్డ్లా మా సినిమా గురించి అందరికీ చెప్పండి’ అని అన్నారు.
విజయ్ బుల్గానిన్ మాట్లాడుతూ.. ‘సినిమా చాలా బాగా వచ్చింది. ఆర్ఆర్ బాగా కుదిరింది. మా మూవీ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను’ అని అన్నారు.