Ardham Chesukovu Enduke Lyrical Song Released from Drinker Sai
అత్యంత ఘనంగా నాగన్న మూవీ ట్రైలర్ విడుదల
చాందిని క్రియేషన్స్ బ్యానర్ పై మహేష్ కుమార్ హీరోగా, చిత్రం శ్రీను ప్రధాన పాత్రలో నెక్కింటి నాగరాజు నిర్మిస్తున్న తాజా చిత్రం నాగన్న. ఈ చిత్రాన్ని సతీష్ కుమార్, మహేష్ కుమార్ ఇద్దరు దర్శకత్వం చేస్తున్నారు. వీరితో పాటు సింధు సిరి, చందన, రూప, జనర్థాన్, స్వాతి ఘట్కర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రం నుంచి నేడు ట్రైలర్ విడుదలైంది. ఈ సందర్భంగా చిత్రం యూనిట్ మీడియా సమావేశం నిర్వహించారు. ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా తీసి, థియేటర్, ఓటీటీలలో విడుదల చేయడం అంటే ఎంత కష్టమో అందిరికి తెలిసిందే. ఈ విషయంలో డైరెక్టర్స్ సతీష్ కుమార్, మహేష్ కుమార్ ల కృషి అద్భతం అని సమావేశానికి వచ్చిన అతిథులు కొనియాడారు.
ఈ సమావేశంలో డైరెక్టర్ సతీష్ కుమార్ మాట్లాడుతూ.. ఈ సినిమాకు ప్రత్యేక్షంగా, పరోక్షంగా పనిచేసినా, హెల్ప్ చేసిన ప్రతీ ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదిత్య మ్యూజిక్ లో పాటలు వచ్చేలా కృషి చేసిన నిరంజన్, మాధవ్ ఇద్దరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సినిమా ఇంత బాగా రావడానికి ప్రొడ్యూసర్ నెక్కంటి నాగరాజు ఇచ్చిన ప్రోత్సాహం ఎంతో ఉంది అని పేర్కొన్నారు.
హీరోయిన్ సింధూ మాట్లాడుతూ.. తెలుగు అమ్మాయిగా పుట్టినందుకు సంతోషంగా ఉందన్నారు. ముఖ్యంగ జై కుమార్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఫ్రెండ్ తో ఆడిషన్ కు వెళ్లి సెలెక్ట్ అయినట్లు చెప్పారు. ఇక షూటింగ్ సమయంలో డైరెక్టర్, నిర్మాత చూపెట్టిన కేర్ మర్చిపోలేదని పేర్కొన్నారు. షూటింగ్ అంతా చాలా కంఫర్టుగా జరిగిందని, తెలుగు అమ్మాయిలను సపోర్ట్ చేయండి అని పేర్కొన్నారు.
తొమ్మిది రోజుల్లో షూటంగ్ చేయడం అంటే మాములు విషయం కాదని, దీనికి దర్శకుడు సతీష్ కుమార్, అలాగే మహేష్ కుమార్ ఇద్దరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు నటి రూప.
జనార్థన్ మాట్లాడుతూ.. ఈ సినిమా అవకాశం ఇచ్చినందుకు నిర్మాత నెక్కంటి నాగరాజుకు కృతజ్ఞతలు తెలిపారు. ట్యాలెంటెడ్ డైరెక్టర్స్ సతీష్, మహేష్ ఇద్దరికి థ్యాంక్స్ చెప్పారు.
హీరో, డైరెక్టర్ మహేష్ మాట్లాడుతూ.. 12 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో పనిచేస్తూ చాలా మందితో పరిచయం ఉందని, ఈ కథ పట్టుకొని, చాలా మంది హీరోల దగ్గరకు వెళ్లి కథ చెప్పాము, అలా నాలుగు సంవత్సరాలు గడిచిపోయాయి. ఇక ప్రొడ్యూసర్ నాగరాజు అన్న నన్నే హీరోగా పెట్టి చేయన్నారు. దాంతో కథను చాలా తొందరగా ఫినిష్ చేయాలి అని చాలా ప్రణాళికతో సినిమా పూర్తి చేసినట్లు చెప్పారు. ఈ సినిమా ఓటీటీలో వస్తుందని, సొంతంగా థియేటర్లో విడుదల చేస్తన్నట్లు చెప్పుకొచ్చారు. ఈ సినిమా జర్నీలో కలిసి పనిచేసిన చాలా మందికి థ్యాంక్స్ చెప్పారు.
ఇక ట్రైలర్ విషయానికి వస్తే ఒక ఊరిలో ఉండే కొంత మంది కుర్రళ్లు ఒక నిధి కోసం పాటుపడుతారని, ఈ వేటలో వారికి నిధి దొరికిందా లేదా అనే కథాంశంతో ఈ సిినిమా తెరకెక్కినట్లు తెలుస్తుంది. యూట్యూబ్ లో విడుదలైన ఈ ట్రైలర్ పై మంచి ప్రశంసలు వస్తున్నాయి. ఈ చిత్రం విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు.
నటీనటులు : చిత్రం శ్రీను, మహేష్ కుమార్, సింధు సిరి, చందన, రూప, జనర్థాన్, స్వాతి ఘట్కర్
బ్యానర్ : చాందిని క్రియేషన్స్
డైెరెక్టర్ : సతీష్ కుమార్, మహేష్ కుమార్
ప్రొడ్యూసర్ : నెక్కంటి నాగరాజు
డిఒపి, ఎడిటర్ : లక్ష్మీకుమార్
కొరియోగ్రాఫర్ : మహేష్ కుమార్
మ్యూజిక్ డైరెక్టర్ : శ్రీ వసంత్
పీఆర్ఓ: హరీష్, దినేష్