అక్టోబర్ 11న రాబోతోన్న మా చిత్రాన్ని చూసి సక్సెస్ చేయండి – ఆలియా భట్
ఆలియా భట్, వేదాంగ్ రైనా ప్రధాన పాత్రల్లో నటించిన ‘జిగ్రా’ చిత్రం అక్టోబర్ 11న రిలీజ్ కాబోతోంది. ‘జిగ్రా’ చిత్రాన్ని తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ద్వారా రానా విడుదల చేస్తున్నారు. పాన్ ఇండియా డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి, గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌లు విడుదల చేసిన జిగ్రా తెలుగు ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. మంగళవారం నాడు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, రానా దగ్గుబాటి, సమంతలు ముఖ్య అథితులుగా విచ్చేశారు. త్రివిక్రమ్, సమంత చేతుల మీదుగా బిగ్ టికెట్ లాంచ్ చేశారు. అనంతరం ఈ కార్యక్రమంలో..
ఆలియా భట్ మాట్లాడుతూ.. ‘నేను మెసెజ్ చేసిన వెంటనే వచ్చిన త్రివిక్రమ్ గారికి థాంక్స్. మీరు మాట్లాడిన ప్రతీ మాట గుండెల్ని తాకింది. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్‌లో సమంత రియల్ హీరో. సమంత తన నటనతో సినిమా పరిశ్రమలో నిలబడ్డారు. సమంతకు, నాకు సరిపోయే కథను త్రివిక్రమ్ రాస్తే బాగుంటుందనిపిస్తోంది. ఆర్ఆర్ఆర్ తరువాత ఈ చిత్రంతో వస్తున్నాను. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత తెలుగు ప్రేక్షకులతో కనెక్షన్ ఏర్పడింది. నాటు నాటు పాటను నా కూతురు రాహా ఎప్పుడూ వింటూనే ఉంటుంది. మంచి చిత్రాన్ని ప్రేమించడం, ఆదరించడంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు. అందుకే నా గంగూభాయ్, బ్రహ్మాస్త్ర సినిమాను తెలుగులో రిలీజ్ చేశాం. జిగ్రా కోసం వాసన్ బాలాతో పని చేయడం ఆనందంగా ఉంది. ఆయన ఇంకా చాలా గొప్ప చిత్రాలను చేయాలి.. అందులో నాతో కొన్ని చిత్రాలు చేయాలని కోరుకుంటున్నాను. వేదాంగ్ ఈ మూవీతో స్టార్ అయిపోతాడు. రియల్ లైఫ్‌లోనూ నా బ్రదర్, ఫ్రెండ్‌లా అయిపోయాడు. రాహుల్ ఈ చిత్రంలో ఓ కీ రూల్‌ను పోషించాడు. రాహుల్‌కు సినిమా అంటే పిచ్చి. రాహుల్, వాసన్ ఇద్దరూ సెట్స్‌లో సినిమా గురించే మాట్లాడుకునేవారు. మా సినిమాను తెలుగులోకి తీసుకొస్తున్న రానాకి థాంక్స్. అక్టోబర్ 11న మా చిత్రం రాబోతోంది. యాక్షన్, డ్రామా, ఎమోషన్ ఇలా అన్నీ ఉన్న ఓ ఇంటెన్స్ సినిమా. అందరూ చూసి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
త్రివిక్రమ్ మాట్లాడుతూ.. ‘నాకు ఇష్టమైన ఇద్దరు హీరోయిన్లు ఆలియా, సమంత గారు ఇక్కడే ఉన్నారు. రజినీకాంత్ గారికి అన్ని భాషల్లో ఫ్యాన్స్ ఉన్నారు. ఆ తరువాత సమంత గారికే ఉన్నారనిపిస్తుంది. జిగ్రా ట్రైలర్ చూస్తే.. థియేటర్‌కు వచ్చి సినిమా చూడు అని పిలిచినట్టుగా అనిపించింది. జిగ్రా కోసం ఆలియా ఎంత కష్టపడ్డారో ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. ఈ మూవీ కోసం ఫిజికల్‌గానూ కష్టపడ్డారు. కొన్ని సార్లు ట్రైలర్ చూస్తేనే సినిమా సూపర్ హిట్ అని చెప్పొచ్చు. వాసన్ బాలా గారి సినిమా అంటే నా పెద్ద కొడుక్కి చాలా ఇష్టం. ఫలితం గురించి ఆలోచించకుండా సినిమాను తీసే ధైర్యం వాసన్ గారికి ఉంది. రాహుల్‌తో గుంటూరు కారం సినిమాను చేశాను. ప్రయత్నపూర్వకంగా ఏదైనా చేస్తే సక్సెస్ కాదనిపిస్తుంది. ఏదైనా సరే సహజంగా జరిగిపోవాలనేది నమ్ముతాను. నది ప్రవాహాంలా ఉండాలనిపిస్తుంది. అందులో కొన్ని సార్లు గెలవొచ్చు.. ఓడిపోవచ్చు. సమంత సెట్లో ఓ డైనమేట్‌లా ఉంటుంది. ఈ ఈవెంట్లో ఆలియాని చూస్తే కూడా డైనమేట్‌లా అనిపించారు. అక్టోబర్ 11న ఈ చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.
సమంత మాట్లాడుతూ.. ‘ఆలియా నటన అంటే నాకు చాలా ఇష్టం. హీరోయిన్లుగా మాపై కొంత బాధ్యత ఉంటుంది. అమ్మాయిలు వారి జీవితాలకు వాళ్లే హీరోలు అని చెప్పేందుకు అప్పుడప్పుడు ఇలాంటి కథలు చెప్పాల్సి వస్తుంది. ఆలియా ఒకవైపు నటిస్తూనే.. మరో వైపు సినిమాలు నిర్మిస్తూ ఉన్నారు. రాహుల్‌తో 15 ఏళ్ల బంధం.. త్రివిక్రమ్ గారెతో మూడు చిత్రాలు చేశాను. సురేశ్ ప్రొడక్షన్స్ నుంచి నాకు మంచి చిత్రాలు వచ్చాయి. వీళ్లంతా నా జిగ్రాలు.ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. వాసన్ బాలా అద్భుతంగా తీశారు. వేదాంగ్‌కు మంచి సక్సెస్ రావాలి. రాహుల్ ప్రతీ ప్రయాణంలో నేను ఉన్నాను. రానా గత నెలలోనే ఓ ఫీమేల్ ఓరియెంటెడ్ చిత్రాన్ని ఇచ్చారు. ఇప్పుడు జిగ్రాను ఇస్తున్నారు. ప్రతీ అమ్మాయికి రానా లాంటి బ్రదర్ ఉండాలి. తెలుగు ప్రేక్షకులు ఎంతగా ప్రేమిస్తారు అనేది జిగ్రాతో ఆలియాకు మరింత తెలుస్తుంది. తెలుగు ప్రేక్షకులు ప్రేమ వల్లే నేను ఈ రోజు ఇలా ఈ స్థాయిలో ఉన్నాను. అక్టోబర్ 11న ఈ చిత్రాన్ని అందరూ చూడండి’ అని అన్నారు.
రానా మాట్లాడుతూ.. ‘బాహుబలి కోసం ధర్మ ప్రొడక్షన్ ముందడుగు వేసింది. ఆలియా సేన జిగ్రాతో మరింత ఎక్కువ అవ్వాలని కోరుకుంటున్నాను. సమంత గారెతో ఓ బేబీ చేశాం. వాసన్ బాలాకు ఆల్ ది బెస్ట్. అక్టోబర్ 11న ఈ చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.
వాసన్ బాలా మాట్లాడుతూ.. ‘జిగ్రా అంటే ధైర్యం.. యాక్టింట్ అంటే ఆలియా. నేను చెప్పాలని అనుకున్నదంతా కూడా ట్రైలర్లో చెప్పేశాను. అక్టోబర్ 11న మా చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.
రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ.. ‘సమంత, ఆలియా వంటి నటీనటులు ఉండటం అదృష్టం. ఈ కథకు ఓకే చెప్పే టైంలో సమంతతోనే ఉన్నాను. నా జీవితంలో మంచి జరిగే ప్రతీ సందర్భంలో సమంత ఉంటుంది. ఆలియా భట్ అద్భుతమైన నటి. ఆమెతో నటించడం ఆనందంగా ఉంది. వాసన్ బాలా చాలా మంచి వ్యక్తి. వేదాంగ్ ఈ మూవీ తరువాత స్టార్ అవుతాడు. తెలుగులోకి ఎప్పుడూ కొత్త కంటెంట్‌ను తీసుకొస్తున్న రానాకి థాంక్స్. ఆలియా విశ్వరూపం.. వాసన్ బాలా విధ్వంసం అక్టోబర్ 11న చూడండి’ అని అన్నారు.
వేదాంగ్ రైనా మాట్లాడుతూ.. ‘ఇక్కడకు రావడం ఇదే మొదటి సారి. తెలుగు ఆడియెన్స్ ఎంతో గొప్పగా స్వాగతిస్తున్నారు. జిగ్రాతో సిల్వర్ స్క్రీన్ మీదకు ఎంట్రీ ఇస్తున్నాను. అలియా గారు నాకు ఎంతగానో సపోర్ట్‌గా నిలిచారు. ఈ చిత్రానికి పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మా సినిమాకు రానా గారు మంచి సహకారాన్ని అందిస్తున్నారు. జిగ్రా మీ అందరినీ ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నా’ అని అన్నారు.