మోడ్రన్ గా వుండే నేటి ట్రెండ్ కు తగిన అమ్మాయిని – కావ్యథాపర్
Yevam Movie Review | చాందిని చౌదరి ‘యేవమ్’ మూవీ రివ్యూ
Yevam Movie Review | టాలీవుడ్ నటుడు నవదీప్ తన సొంత నిర్మాణ సంస్థ సి-స్పేస్ ప్రొడక్షన్స్ పతాకంపై ‘యేవమ్’ అనే సినిమా నిర్మించిన విషయం తెలిసిందే. చాందిని చౌదరి ప్రధాన పాత్రలో వచ్చిన ఈ చిత్రంలో వశిష్ట సింహా, జై భారత్, ఆషురెడ్డి, యుగంధర్ కీలక పాత్రల్లో నటించారు.
Yevam Movie Review | టాలీవుడ్ నటుడు నవదీప్ తన సొంత నిర్మాణ సంస్థ సి-స్పేస్ ప్రొడక్షన్స్ పతాకంపై ‘యేవమ్’ అనే సినిమా నిర్మించిన విషయం తెలిసిందే. చాందిని చౌదరి ప్రధాన పాత్రలో వచ్చిన ఈ చిత్రంలో వశిష్ట సింహా, జై భారత్, ఆషురెడ్డి, యుగంధర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు ప్రకాష్ దంతులూరి దర్శకత్వం వహించగా.. నవదీప్, పవన్ గోపరాజు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. అయితే ఈ సినిమా ఎలా ఉంది అని రివ్యూ చూసుకుంటే.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. వికారాబాద్‌లో వరుసగా హత్యలు జరుగుతుంటాయి. అయితే ఈ హత్యలు ఎవరు చేస్తున్నారు అనేది ఎవరికి అంతు చిక్కని విషయంగా మారుతుంది. ఈ క్రమంలోనే అక్కడకు ట్రైనీ పోలీస్ ఆఫీసర్‌గా సౌమ్య(చాందిని చౌదరి) అడుగుపెడుతుంది. ఇక ఆ పోలీస్ స్టేషన్లో ఇన్ఛార్జ్ అభిరాం (భరత్‌రాజ్).. ఎప్పుడూ డ్యూటీ అంటూ పనిలోనే నిమగ్నమై ఉంటాడు. మరోవైపు అమ్మాయిల బలహీనతలతో ఆడుకొంటూ, కృత్రిమమైన ఆనందాన్ని తీర్చుకొనే సైకో యుగంధర్ (వశిష్ట సింహా) తనని పట్టుకోవడం అభిరాంకు సవాల్‌గా మారుతుంది. అయితే ఈ సైకో కేసుని సవాలుగా తీసుకుంటుంది సౌమ్య. ఈ క్రమంలోనే సైకోని పట్టుకోవడానికి వెళ్లిన సౌమ్యకి ఏం జరుగుతుంది. వశిష్ట సింహా దొరికాడా లేదా? అసలు వశిష్ట సింహా సైకోగా మారడానికి గల కారణం ఏమిటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఇదో క్రైమ్ థ్రిల్లర్. అయితే క్రైమ్‌ని చూపించిన విధానం, థ్రిల్ రెండూ అలరిస్తాయి. ఫస్ట్ హాఫ్ కొద్దిసేపు స్లోగా సాగిన సౌమ్య ఎంట్రీ తర్వాత ఇంట్రెస్టింగ్గా సాగుతుంది, ముఖ్యంగా యుగంధర్ అమ్మయిలను ఎలా ట్రాప్ చేస్తున్నాడో చూపించి ఇంటర్వెల్ కి అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారు. ఇక రెండో భాగం యుగంధర్ని ఎలా పట్టుకోవాలి అని సౌమ్య వేసిన ప్లాన్ ప్రేక్షకులను అలరిస్తుంది. స్క్రీన్ ప్లే కూడా కొత్తగా ఉంటుంది. తెలంగాణ ఒగ్గు కథని కథలో పర్ఫెక్ట్గా చూపించారు.
నటీనటులు : ఒక సాధారణ యువతి పోలీస్ ఆఫీసర్ అయితే ఎలా ఉంటుంది. తనకి తన డ్యూటీతో పాటు సోషల్ లైఫ్‌లో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంది అనే పాత్రలో చాందిని నటించి మంచి మార్కులు సంపాదించింది. ఇక అషురెడ్డి కాసేపే కనిపించినా తన బోల్డ్ క్యారెక్టర్‌తో మెప్పించింది. కన్నడ నటుడు యుగంధర్ కూడా విలన్ పాత్రలో అలరించాడు.
సాంకేతిక అంశాలు.. కీర్తన శేష్ అందించిన ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సినిమాటోగ్రఫీ విజువల్స్ కూడా ఒకే అనిపించాయి. రైటింగ్ పరంగా ఇంకా మెరుగ్గా ఉండాల్సిన సినిమా ఇది. ఆర్ట్ డిపార్ట్మెంట్ పనితనం మూవీలో కనిపిస్తుంది. కథ కథనం కొత్తగానే ట్రై చేసి దర్శకుడు ప్రకాష్ దంతులూరి పర్వాలేదనిపించాడు. నిర్మాణ పరంగా కూడా నవదీప్ బాగానే ఖర్చు పెట్టినట్టు తెలుస్తుంది. చివరిగా ఒక సాధారణ ఆడపిల్ల పోలీస్ ఆఫీసర్ అయితే త
ప్లస్ పాయింట్స్ : చాందిని చౌదరి నటన, కన్నడ నటుడు యుగంధర్, కీర్తన శేష్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, తెలంగాణ సంస్కృతిలో భాగమైన ఒగ్గు కథ కాన్సెప్ట్
మైనస్ పాయింట్స్ : ఫస్ట్ ఆఫ్ స్లో నరేషన్, కథలో ఆసక్తి తగ్గడం.
రేటింగ్ : 2.75/5