దేవకీ నందన వాసుదేవ లొ డివైన్ ఎలిమెంట్స్, ట్విస్ట్ లు అదిరిపోతాయి –
‘కల్కి 2898 ఏడీ’ రివ్యూ.. ప్రభాస్ సైన్స్ ఫిక్షన్ మూవీ ఎలా ఉందంటే? | Kalki 2898 AD Movie Review
Kalki 2898 AD | పాన్ఇండియా స్టార్‌గా మారాక ప్రభాస్ నుంచి వచ్చిన ఏ సినిమాకీ రానంత హైప్ ‘కల్కి 2898ఏడీ’కి వచ్చింది. దర్శకుడిగా నాగ్ అశ్విన్ చేసింది రెండు సినిమాలే అయినా.. రెండూ గొప్ప సినిమాలు కావడం, ప్రతిష్టాత్మక వైజయంతీమూవీస్ నుంచి వస్తున్న సినిమా కావడం, నాగ్అశ్విన్ ఎంచుకున్న కథ కావడం.. అన్నింటినీ మించి అమితాబ్, కమల్ లాంటి ఆలిండియా సూపర్స్టార్లు ఇందులో భాగం కావడం.. ఇవన్నీ ఈ సినిమా హైప్‌కి గల కారణాలు కావచ్చు.
సినిమా: కల్కి2898ఏడి
తారాగణం: ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దీపిక పదుకొనే, దిషా పటానీ, రాజేంద్రప్రసాద్, శోభన..
దర్శకుడు: నాగ్అశ్విన్
నిర్మాత: సి.అశ్వనీదత్
నిర్మాణం: వైజయంతీమూవీస్
పాన్ఇండియా స్టార్‌గా మారాక ప్రభాస్ నుంచి వచ్చిన ఏ సినిమాకీ రానంత హైప్ ‘కల్కి 2898ఏడీ’కి వచ్చింది. దర్శకుడిగా నాగ్ అశ్విన్ చేసింది రెండు సినిమాలే అయినా.. రెండూ గొప్ప సినిమాలు కావడం, ప్రతిష్టాత్మక వైజయంతీమూవీస్ నుంచి వస్తున్న సినిమా కావడం, నాగ్అశ్విన్ ఎంచుకున్న కథ కావడం.. అన్నింటినీ మించి అమితాబ్, కమల్ లాంటి ఆలిండియా సూపర్స్టార్లు ఇందులో భాగం కావడం.. ఇవన్నీ ఈ సినిమా హైప్‌కి గల కారణాలు కావచ్చు. సినిమా ప్రమోషన్ విషయంలో కూడా వినూత్న పద్ధతుల్ని అనుసరించారు చిత్రయూనిట్. దాంతో సినిమాను ఎప్పుడు థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేద్దామా? అని ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూశారు. ఆ ప్రభావం వసూళ్లపై తప్పనిసరిగా ఉంటుందని చెప్పొచ్చు. 600కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 800కోట్ల బిజినెస్ చేసింది. మరి అందరి అంచనాలను ‘కల్కి 2898ఏడీ’ అందుకున్నాడా? ఊహించినట్టే విజువల్ వండర్‌గా సినిమా ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే ముందు కథలోకెళ్లాలి.
కథ
6వేల సంవత్సరాల క్రితం జరిగిన కురుక్షేత్ర సంగ్రామం చివరి అంకం నుంచి ఈ కథ మొదలవుతుంది. బ్రహ్మాస్త్ర ప్రయోగంతో ఉత్తర గర్భాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించాడు అశ్వత్థామ(అమితాబ్). కానీ కృష్ణపరమాత్మ బ్రహ్మాస్ర్తానికి అడ్డుపడి అపాండవం జరగకుండా అడ్డుకున్నాడు. ఈ దుశ్చర్యకు పాల్పడ్డ అశ్వత్థామను ‘మానని గాయాలతో ఇలా చావులేకుండా పడివుండు’ అని శపించాడు. అశ్వత్థామ శాపవిమోచనం అడగ్గా.. ‘ఉత్తర గర్భంలోని బిడ్డను చంపడానికి ప్రయత్నించి పాపం మూటగట్టుకున్న నువ్వు.. నా వచ్చే అవతారంలో తల్లి గర్భంలో ఉన్న నన్ను కాపాడి పుణ్యాన్ని మూటగట్టుకుంటావ్.. అప్పుడే నీకు శాపవిమోచనం’ అని కృష్ణుడు చెప్పాడు. ఇది జరిగిన ఆరువేల సంవత్సరాల తర్వాత అసలు కథ మొదలైంది.
అది 2898వ సంవత్సరం. కలి ప్రభావంతో ప్రపంచం దాదాపుగా నిర్వీర్యమైపోయింది. లక్షలకోట్ల జీవరాసులతో, పంచభూతాత్మకమైన భూమి కళావిహీనం అయ్యింది. వనరులన్నీ నిండుకున్నాయి. నదులన్నీ ఇంకిపోయాయి. ఇక భూమిపై మిగిలింది మూడే ప్రాంతాలు. కాశీ, శంబల, కాంప్లెక్స్. తిరగబడ్డ పిరమిడ్ ఆకృతిలో ఉండే కాంప్లెక్స్.. భూసారాన్నంతటినీ పీల్చి తనలో నిక్షిప్తం చేసుకుంది. దాంతో సకలసౌకర్యాలు, సంపద కాంప్లెక్స్ పరమయ్యాయి. కాంప్లెక్స్ ఆధిపత్యంపై శంబల వాసులు నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇ
క కాశీవాసులైతే ఎలాగైనా కాంప్లెక్స్‌లో చోటు కోసం ప్రయత్నిస్తున్నారు. వారిలో భైరవ(ప్రభాస్) ఒకడు. ఎలాగైనా యూనిట్స్(డబ్బు) సంపాదించి, కాంప్లెక్స్‌లో చోటు సంపాదించడం భైరవ లక్ష్యం. దానికోసం తప్పులు కూడా చేస్తుంటాడు. ఇక కాంప్లెక్స్‌ని పాలించే రాజు సుప్రీం యాస్కిన్(కమల్‌హాసన్). భయంకరమైన నరరూపరాక్షసుడు. అతని వయసు 200ఏళ్లు. తన రాజ్యంలో స్త్రీలు గర్భం దాల్చడం నిషిద్దం. మరోవైపు పరమాత్మ రాకకోసం అశ్వత్థామ కాశీలోని ఓ భూగర్భ దేవాలయంలో ఎదురుచూస్తున్నాడు. అలాంటి పరిస్థితుల్లో తన ప్రమేయం లేకుండా సుమతి(దీపిక పదుకొనే) అనే అమ్మాయి గర్భం దాల్చింది. ఆ గర్భంలో ఉన్నది సాక్షాత్ శ్రీమన్నారాయణుడి అవతారమైన కల్కి.
కల్కి గర్భంలోకి ప్రవేశించగానే.. భూమిపై ఊహించని మార్పులు సంభవిస్తుంటాయి. అప్పటికే భూగర్భంలో దొరికిన అర్జునుడి గాండీవం(Arjuna Weapon) యాక్టివేట్ అయ్యింది. పరమాత్మ ఆవిర్భావాన్ని ముందే గమనించిన అశ్వత్థామ జనారణ్యంలోకి అడుగుపెట్టాడు. జరుగుతున్న శకునాలను గమనించిన కాంప్లెక్స్ దానికి కారణమైన సుమతి గర్భస్థశిశువును చంపడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆ తల్లి గర్భంలోని దేవదేవుడ్ని అశ్వత్థామ కాపాడగలిగాడా? యూనిట్స్ సంపాదించి కాంప్లెక్స్‌లో స్థానం సంపాదించాలనే భైరవ కోరిక నిజమైందా? అసలు ‘కల్కి’ అవరించాడా? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.