
Vishwanath & Sons Set For Grand Worldwide Release On August 14th
Suriya’s much-awaited family drama Vishwanath & Sons is officially set for a grand worldwide theatrical release on August 14th. Directed by blockbuster filmmaker Venky Atluri and produced by Suryadevara Naga Vamsi & Sai Soujanya, the film is expected to offer audiences a wholesome entertainer packed with emotions, humour and heartwarming family moments.
Ever since the teaser & title announcement, the film has created tremendous excitement among audiences. The first look posters featuring Suriya alongside a child brought back the actor’s vintage charm and instantly connected with family audiences.
After delivering back-to-back successful films like SIR/Vaathi and Lucky Baskhar, director Venky Atluri once again promises a feel-good emotional entertainer with strong family values and memorable storytelling.
The film stars Mamitha Baiju, Radhika Sarathkumar, Raveena Tandon and others in key roles. Music is composed by G. V. Prakash Kumar, cinematography is by Nimish Ravi, editing by Navin Nooli and production design by Banglan.
ఆగష్టు 14న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కానున్న ‘విశ్వనాథ్ & సన్స్’
సూర్య – వెంకీ అట్లూరి కలయికలో రూపొందుతోన్న ‘విశ్వనాథ్ & సన్స్’ చిత్రం ఈ స్వాతంత్య్ర దినోత్సవ వారాంతంలో ఒక అద్భుతమైన కుటుంబ వినోదాన్ని అందించడానికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
సూర్య అభిమానులతో పాటు, సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యామిలీ డ్రామా ‘విశ్వనాథ్ & సన్స్’ ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 14న ఘనంగా థియేటర్లలో విడుదల కానుంది. బ్లాక్‌బస్టర్ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. భావోద్వేగాలు, హాస్యం, హృదయాన్ని తాకే కుటుంబ అనుబంధాలతో ఈ సినిమా ప్రేక్షకులకు పూర్తి స్థాయి వినోదాన్ని అందించడానికి సిద్ధమవుతోంది.
టీజర్, టైటిల్ ప్రకటన వెలువడినప్పటి నుంచే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా చిన్నారితో కలిసి సూర్య కనిపించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు ఆయన వింటేజ్ చార్మ్‌ను గుర్తు చేస్తూ కుటుంబ ప్రేక్షకులను తక్షణమే ఆకట్టుకున్నాయి.
‘సార్/వాథి’, ‘లక్కీ భాస్కర్’ వంటి వరుస విజయవంతమైన చిత్రాలను అందించిన దర్శకుడు వెంకీ అట్లూరి, మరోసారి బలమైన కుటుంబ విలువలు, హృద్యమైన కథనం కలిగిన ఒక ఫీల్ గుడ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ను అందించబోతున్నారు.
ఈ చిత్రంలో మమితా బైజు, రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, నిమిష్ రవి ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టగా, బంగ్లాన్ కళా దర్శకుడిగా పనిచేస్తున్నారు.
‘విశ్వనాథ్ & సన్స్’ ప్రేక్షకుల మనసులు గెలుచుకొని, ఈ ఏడాది అత్యంత ఆదరణ పొందిన కుటుంబ వినోద చిత్రాలలో ఒకటిగా నిలుస్తుందనే అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి.
తమిళనాడులో ఈ చిత్రాన్ని థింక్ స్టూడియోస్ విడుదల చేయనుండగా, రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.
నటీనటులు & సాంకేతిక బృందం:
తారాగణం: సూర్య, మమితా బైజు, రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ తదితరులు
రచన, దర్శకత్వం: వెంకీ అట్లూరి
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్
ఛాయాగ్రహణం: నిమిష్ రవి
కూర్పు: నవీన్ నూలి
కళ: బంగ్లాన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: యలమంచిలి గోపాల కృష్ణ (నాని)
ఫైట్ మాస్టర్: వి వెంకట్
నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
పీఆర్ఓ: లక్ష్మివేణుగోపాల్
