Varalaxmi Sarathkumar has set the dance floor on fire
It’s already known that Sudarshan Paruchuri is making his debut as a hero with the upcoming movie Mr Celebrity. The film also stars Varalaxmi Sarathkumar, Sri Deeksha, Nassar, and Raghu Babu in pivotal roles. Meanwhile, a song from the movie was released, and it’s already making waves with chants of Lord Vinayaka being heard everywhere. To celebrate Ganesh Chaturthi, the makers released a Vibrant devotional song titled “Gajaanana” from the movie.
Composed by Vinod and written by Ganesh, the song brings an energetic vibe. Crooned with high pitch vocals by Mangli, the song is poised to become a hit during the Navaratri celebrations. Varalaxmi Sarathkumar has set the dance floor on fire with her graceful and appealing moves in the song. After a long time, she appears with such energy in a song. Watching the video feels like witnessing a real festival, and it’s sure to be a celebration on screen.
The movie is produced by N. Panduranga Rao and Chinna Reddaiah under the RP Cinemas banner, with Chandina Ravi Kishore directing it. The recently released teaser has garnered a lot of attention, and the release date will be announced soon.
మిస్టర్ సెలెబ్రిటీ నుంచి రిలీజ్ చేసిన ‘గజానన’ పాటలో వరలక్ష్మీ శరత్ కుమార్ విశ్వరూపం
సుదర్శన్ పరుచూరి హీరోగా మిస్టర్ సెలెబ్రిటీ అనే సినిమా రాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో వరలక్ష్మీ శరత్ కుమార్, శ్రీ దీక్ష, నాజర్, రఘుబాబు వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు. తాజాగా మిస్టర్ సెలెబ్రిటీ నుంచి పాటను రిలీజ్ చేశారు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఆ వినాయకుడి నామస్మరణే వినిపిస్తోంది. వినాయక చవితి స్పెషల్గా మిస్టర్ సెలెబ్రిటీ నుంచి ఓ హుషారైన దైవ భక్తి గల పాటను రిలీజ్ చేశారు. ‘గజానన’ అంటూ సాగే ఈ పాటను మంగ్లీ ఆలపించారు. గణేష్ రాసిన ఈ పాటకు వినోద్ ఇచ్చిన బాణీ ఎంతో హుషారుగా అనిపించింది. ఇక ఈ వినాయక చవితి నవరాత్రుల్లో ఈ పాట మార్మోగిపోయేలా కనిపిస్తోంది.
గజానన అంటూ సాగే ఈ పాటలో వరలక్ష్మీ శరత్ కుమార్ వేసిన స్టెప్పులు అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. చాలా రోజుల తరువాత వరలక్ష్మీ శరత్ కుమార్ ఇంత ఎనర్జీగా డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఈ వీడియో సాంగ్ని చూస్తుంటే నిజంగానే ఉత్సవం జరిగినట్టు అనిపిస్తోంది. తెరపై ఈ పాట కచ్చితంగా ఓ పండుగలా ఉండబోతోందనిపిస్తోంది.
ఈ చిత్రాన్ని ఎన్. పాండురంగారావు, చిన్నరెడ్డయ్య సంయుక్తంగా ఆర్పి సినిమాస్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు చందిన రవి కిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు. రీసెంట్గా ఈ మూవీ నుంచి విడుదల చేసిన టీజర్ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ను మేకర్లు ప్రకటించనున్నారు.
తారాగణం: వరలక్ష్మి శరత్ కుమార్, సుదర్శన్ పరుచూరి, శ్రీ దీక్ష, నాజర్, రఘుబాబు తదితరులు
సాంకేతిక వర్గం
బ్యానర్ – RP సినిమాస్
నిర్మాత -చిన్న రెడ్డయ్య, ఎన్.పాండురంగారావు
రచయిత, దర్శకుడు – చందిన రవి కిషోర్
కెమెరామెన్ – శివ కుమార్ దేవరకొండ
సంగీతం – వినోద్ యజమాన్య
పాటలు – గణేష్, రాంబాబు గోసాల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – వెంకట్ రెడ్డి
ఎడిటర్ – శివ శర్వాణి
పీఆర్వో – సాయి సతీష్