
Upasana Kamineni Konidela Opens Up About Her Spiritual Faith
Upasana Kamineni Konidela Reveals the Reason Behind Observing Sai Baba Vrat Religiously, Shares a Personal Anecdote: “I Was Going Through a Very Tough Time at One Point in My Life and Was a Bit Shaken Up”
Upasana Kamineni Konidela Talks About the Significance of Observing Sai Baba Vrat, Shares How It Helped Her Become a Better Person
Upasana Kamineni Konidela has always been a keen believer in spirituality and faith. In a recent video, Upasana shed light on her devotion to the divine figure Sai Baba and spoke about the significance of observing a Vrat (fast). Going through shlokas and mantras from a booklet by Athamma’s Kitchen, she also recalled a personal incident and shared how her faith led her to adopt this spiritual practice.
Upasana said, “I think everyone needs to find what they resonate with. For my husband, it’s Ayyappa Swami; for me, it’s Sai Baba. Since childhood, I’ve seen my grandparents and parents have utmost faith in God. Faith provided a very powerful grounding for me. I was going through a very tough time at one point in my life and was a bit shaken up. So, they said, ‘Why don’t you try the Sai Baba Vrat?’”
She added, “Things started changing when I began reading the story. I became more positive. People around me also started becoming more positive. These small changes helped me realize that I was becoming a better person. That’s why this Vrat means so much to me. If you’re at a roadblock, if things aren’t going your way, try some form of Vrat. I believe that faith heals more than anything in this world.”
Along with sharing her personal experiences, Upasana Kamineni Konidela also encouraged netizens to embrace spirituality and consider observing fasts. Her reflections on the power of faith and fasting underscore its transformative potential, inspiring many to engage in the practice with sincerity and devotion.
సాయి బాబా వ్రతం నా జీవితంలో గొప్ప మార్పు తీసుకొచ్చింది. నన్ను బెటర్ పర్సన్‌గా మార్చింది: ఉపాసనా కామినేని కొణిదెల
ఉపాసనా కామినేని కొణిదెల ఆధ్యాత్మికతపై గొప్ప నమ్మకంతో ఉంటారు. తాజాగా ఆమె ఒక వీడియోలో తన సాయి బాబా మీద ఉన్న భక్తిని గురించి చెప్పారు. ముఖ్యంగా సాయి బాబా వ్రతం, దానివల్ల తన జీవితంలో ఎలా మార్పులు వచ్చాయో ఆమె తన అనుభవాలతో చెప్పారు. అత్తమ్మ కిచెన్ పుస్తకంలో ఉన్న శ్లోకాలు చదువుతూ తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు.
‘ప్రతి ఒక్కరికీ ఇష్టదైవం వుంటుంది. నా భర్తకి అయ్యప్ప స్వామి అంటే భక్తి. నాకు సాయి బాబా పట్ల విశ్వాసం. చిన్నప్పటి నుంచి మా ఇంట్లో తాతయ్య, అమ్మమ్మలు, అమ్మా నాన్నలంతా దేవుడి మీద ఎంతో భక్తితో ఉండేవాళ్లు. వాళ్లని చూసి నాకూ ఆ విశ్వాసం బలంగా పెరిగింది. ఒకసారి జీవితంలో కష్టంగా ఉన్న సమయంలో, ఏటూ తేల్చుకోలేని పరిస్థితి వున్నప్పుడు ఒక్కసారి సాయి బాబా వ్రతం ఆచరించమని వారు చెప్పారు. ఆ కథ చదవటం మొదలుపెట్టిన తర్వాతే మార్పులు మొదలయ్యాయి” అని చెప్పారు ఉపాసన.
“నేను మెల్లిగా పాజిటివ్‌గా మారాను. నా చుట్టూ ఉన్న వాళ్లు కూడా హాయిగా మారిపోయారు. ఇవి చిన్నచిన్న మార్పుల్లా కనిపించినా, వ్యక్తిత్వంగా చాలా గొప్ప మార్పులు వచ్చాయి. అందుకే ఈ వ్రతంపై చాలా విశ్వాసం వుంది. జీవితంలో ఏదైనా అడ్డు ఎదురైతే, ఏదీ సరిగా జరగకపోతే, వ్రతం లాంటి ఆధ్యాత్మిక మార్గాన్ని ప్రయత్నించొచ్చు. ఎందుకంటే ఈ లోకంలో ఏ మందు చేయని పని, విశ్వాసం చేస్తుంది’ అన్నారు.
స్పిరిచ్యువాలిటీని అలావాటు చేసుకోవడం వల్ల మనిషిలో గొప్ప మార్పులు వస్తాయి. ఉపవాసాలు, వ్రతాలు మన మనసును శుభ్రం చేస్తాయి. నిజమైన నమ్మకంతో చేస్తే జీవితంలో మార్పులు వస్తాయని ఉపాసన షేర్ చేసిన వీడియో ఆధ్యాత్మికత పట్ల గొప్ప స్ఫూర్తిని ఇస్తోంది.