
The teaser of Chiranjeeva Unveiled – Streaming on aha from November 7
Chiranjeeva features Raj Tarun in the lead role, with Kushitha Kallapu playing the female lead. The film is produced by Raahul Avudoddi and Suhasini Rahul under the Streamline Productions banner and directed by Abhinaya Krishna.
The teaser of Chiranjeeva blends entertainment, love, and action, capturing the audience’s attention. The story revolves around Shiva (Raj Tarun), who has always been known for his speed since childhood – he even rides a bicycle at jet speed. Impressed by his speed, people suggest he become an ambulance driver. Taking their advice, Shiva becomes one and eventually falls in love with a beautiful girl (Kushitha Kallapu).
As the story progresses, Shiva finds himself in a situation where he must confront a powerful wrestler named Sathu Pailwan. With determination, Shiva vows to take him down. The teaser raises curiosity about the assassin mission Shiva takes on. The teaser hints that Chiranjeeva is going to be another interesting addition to aha’s line-up of films.
The film’s music composed by Achu Rajamani and cinematography is handled by Rakesh S Narayan
విజయదశమి పర్వదినం సందర్భంగా రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఆహా ఒరిజినల్ ఫిల్మ్ “చిరంజీవ” టీజర్ రిలీజ్, నవంబర్ 7వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కు వస్తున్న మూవీ
రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఆహా ఒరిజినల్ ఫిల్మ్ “చిరంజీవ”. ఈ చిత్రంలో కుషిత కల్లపు హీరోయిన్ గా నటించింది. స్ట్రీమ్ లైన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాహుల్ అవుదొడ్డి, సుహాసినీ రాహుల్ నిర్మించారు. అభినయ కృష్ణ దర్శకత్వం వహించారు. నవంబర్ 7వ తేదీ నుంచి చిరంజీవ సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈ రోజు విజయదశమి పర్వదినం సందర్భంగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు.
చిరంజీవ మూవీ టీజర్ ఎంటర్ టైన్ మెంట్, లవ్, యాక్షన్ తో ఆకట్టుకుంది. శివ(రాజ్ తరుణ్)కు చిన్నప్పటి నుంచే స్పీడు ఎక్కువ. సైకిల్ ను కూడా జెట్ స్పీడ్ తో నడుపుతుంటాడు. అతని వేగాన్ని చూసినవారు ఆంబులెన్స్ డ్రైవర్ గా చేరమని సలహా ఇస్తారు. అలా ఆంబులెన్స్ డ్రైవర్ అయిన శివ ఒక అందమైన అమ్మాయి (కుషిత కల్లపు)ని ప్రేమిస్తాడు. ఆ తర్వాత శివ కొన్ని పరిస్థితుల వల్ల సత్తు పైల్వాన్ ను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ సత్తు పైల్వాన్ ను నేను లేపేస్తా అని మాటిస్తాడు శివ. శివ తీసుకున్న మిషన్ అసాసిన్ ఏంటి అనేది టీజర్ లో ఆసక్తి కలిగించింది. చిరంజీవ సినిమా ఆహా ఓటీటీకి మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కానుందని టీజర్ తో తెలుస్తోంది.