Shiva Karthikeyan | శివ కార్తికేయన్‌తో రొమాన్స్ చేయనున్న రష్మిక మందన్న.?
Rashmika Mandanna | కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కమల్ నిర్మాణంలో వస్తున్న అమరన్ షూటింగ్ పూర్తి చేసుకోగా విడుదలకు సిద్దమవుతుంది. ఇక ఈ చిత్రం అనంతరం తమిళ దిగ్గజ దర్శకుడు A.R మురుగదాస్‌తో కలిసి ఒక సినిమా చేస్తున్నాడు.
Rashmika Mandanna | కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కమల్ నిర్మాణంలో వస్తున్న అమరన్ షూటింగ్ పూర్తి చేసుకోగా విడుదలకు సిద్దమవుతుంది. ఇక ఈ చిత్రం అనంతరం తమిళ దిగ్గజ దర్శకుడు A.R మురుగదాస్‌తో కలిసి ఒక సినిమా చేస్తున్నాడు. రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ విద్యుత్ జమ్మల్ విలన్‌గా నటిస్తున్నాడు. భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రానుంది. అయితే ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే శివకార్తికేయన్ మరో ప్రాజెక్ట్ ఒప్పుకున్నట్లు తెలుస్తుంది.
శివ కార్తికేయన్‌కు డాన్ వంటి హిట్ అందించిన దర్శకుడు సీబీ చక్రవర్తితో ఎస్కే మరో సినిమా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీలో కథానాయికగా రష్మిక మందన్న అయితే బాగుంటుందని మేకర్స్ అనుకుంటున్నట్లు సమాచారం. మరోవైపు ప్రముఖ నటుడు ఎస్‌జె సూర్య కూడా ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్రను పోషించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సీబీ చక్రవర్తి డాన్ చిత్రంలో కూడా ఎస్‌జె సూర్య కీలక పాత్రలో నటించాడు. దీంతో ఎస్జేను మళ్లీ తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. కాగా ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.