
Rocking Star Manchu Manoj Visits Ailing Actor Ramachandra
Actor Ramachandra, who has been away from films for some time due to paralysis, is currently suffering from health issues.
Rocking Star Manchu Manoj visited him today in Hyderabad to offer support and encouragement. Manoj met Ramachandra at his residence, inquired about his health condition, and interacted with his family members. Speaking about it, Manoj said he came to know about Ramachandra’s illness through his brother. Ramachandra is well known to audiences for his performance in the film Venky.
అనారోగ్యంతో బాధపడుతున్న నటుడు రామచంద్రను పరామర్శించిన రాకింగ్ స్టార్ మంచు మనోజ్
పక్షవాతం బారిన పడి గత కొద్దికాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు నటుడు రామచంద్ర. అనారోగ్యంతో బాధపడుతున్న రామచంద్రను కలిసి ధైర్యం చెప్పారు రాకింగ్ స్టార్ మంచు మనోజ్. ఈ రోజు హైదరాబాద్ లో రామచంద్ర ఇంటికి వెళ్లి ఆయనను మంచు మనోజ్ పరామర్శించారు. రామచంద్రను అడిగి ఆయన ఆరోగ్య పరిస్థితిని మనోజ్ తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులతో మనోజ్ మాట్లాడారు. రామచంద్ర అనారోగ్యం విషయం ఆయన సోదరుడి ద్వారా తెలిసిందని మనోజ్ అన్నారు. వెంకీ సినిమాలో నటనతో ప్రేక్షకులకు సుపరిచితమయ్యారు రామచంద్ర.