
Pretty Baby Song Released From Biker
చార్మింగ్ స్టార్ శర్వా, మాళవిక నాయర్, అభిలాష్ రెడ్డి కంకర, యువి క్రియేషన్స్ ‘బైకర్’ నుంచి ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్
చార్మింగ్ స్టార్ శర్వా తన అప్ కమింగ్ మూవీ ‘బైకర్’ లో మోటార్‌సైకిల్ రేసర్‌గా ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మాళవిక నాయర్ హీరోయిన్గా నటిస్తున్నారు. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో యువి క్రియేషన్స్ ఈ సినిమాని నిర్మించింది. ఫస్ట్ లుక్, ఫస్ట్ ల్యాప్ గ్లింప్స్ తో ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేసింది.
‘ప్రెట్టీ బేబీ’ వీడియో సాంగ్ ని రిలీజ్ చేసిన మేకర్స్ బైకర్ మ్యూజిక్ ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేశారు. జిబ్రాన్ ఈ పాటని అదిరిపోయే బీట్స్ తో డ్యాన్సింగ్ నెంబర్ గా కంపోజ్ చేశారు. జిబ్రాన్, యాజిన్ నిజార్, సుబ్లాషిని ఎనర్జిటిక్ వోకల్స్ తో ఆకట్టుకున్నారు. కృష్ణకాంత్ లిరిక్స్ చాలా క్యాచిగా వున్నాయి.
ఈ సాంగ్ లో శర్వా, మాళవిక నాయర్ కెమిస్ట్రీ అదిరిపోయింది. శర్వా డ్యాన్స్ మూమెంట్స్ మెస్మరైజింగ్ గా వున్నాయి. ఈ సాంగ్ ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ గా నిలిచింది.
1990, 2000 బ్యాక్ డ్రాప్ లో సాగే “బైకర్” రేసింగ్ యాక్షన్ తో పాటు ఎమోషనల్, మల్టీ జనరేషనల్ ఫ్యామిలీ డ్రామా. స్పీడ్, అంబిషన్, హార్ట్‌ఫెల్ట్ రిలేషన్షిప్స్ తో మూడు జనరేషన్స్ ఒకే రేసింగ్ కలతో, కుటుంబ బంధాలతో సాగే అద్భుతమైన కథ.
ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ జె. యువరాజ్, , అనిల్ కుమార్ పి ఎడిటర్. రాజీవన్ ప్రొడక్షన్ డిజైనర్. ఎ పన్నీర్ సెల్వం ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు, ఎన్ సందీప్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.
బైకర్ డిసెంబర్ 6న థియేటర్లలో రిలీజ్ కానుంది.
నటీనటులు: చార్మింగ్ స్టార్ శర్వా, మాళవిక నాయర్, బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: అభిలాష్ రెడ్డి కంకర
నిర్మాతలు: వంశీ-ప్రమోద్
సమర్పణ: విక్రమ్
బ్యానర్: యువి క్రియేషన్స్
సంగీతం: జిబ్రాన్
DOP: J యువరాజ్
ప్రొడక్షన్ డిజైనర్: రాజీవ్
ఎడిటర్: అనిల్ కుమార్ పి
ఆర్ట్ డైరెక్టర్: ఎ పనీర్ సెల్వం
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో
