
Patang to Fly in December – Release Date Locked
Initially scheduled for December 2024, the film was postponed for extensive CG and refinement work. Now complete, Patang is ready to charm audiences with its colorful storytelling and unique theme.
Set around a kite-flying competition, Patang is a sports comedy being explored for the first time in Telugu cinema.
Featuring Preethi Pagadala, Vamssi Pujit, Pranav Kaushik, Anu Hassan, S.P. Charan, Vadlamani Srinivas, Vishnu Oi, and Sivanarayana, the film marks the directorial debut of Praneeth Prattipati.
Produced under Cinematic Elements and Rishaan Cinemas by Vijay Sekhar Anne, Sampath Maka, Suresh Reddy Kothinti, and Naani Bandreddi.
A major production house is soon to be announced as the presenter, ensuring a wide and festive theatrical release this Christmas.
డిసెంబరు 25న ప్రపంచవ్యాప్తంగా పతంగ్ విడుదల
ఇప్పటి వరకు ఎన్నో స్పోర్ట్స్ డ్రామాలు ప్రేక్షకులు చూసి వుంటారు. కాని అందరిలో ఎంతో మమేకమైన పతంగుల పోటీతో రాబోతున్న కామెడీ స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘పతంగ్’. సినిమాటిక్ ఎలిమెంట్స్ అండ్ రిషన్ సినిమాస్ పతాకంపై విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మక, సురేష్ కొత్తింటి, నాని బండ్రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకుడు. ఈ చిత్రంలో ఇన్‌స్టాగ్రమ్ సెన్సేషన్ ప్రీతి పగడాల, జీ సరిగమప రన్నరప్ ప్రణవ్ కౌశిక్‌తో పాటు వంశీ పూజిత్ ముఖ్యతారలుగా నటిస్తున్నారు. మరికొంత మంది నూతన నటీనటులతో పాటు ప్రముఖ సింగర్, నటుడు ఎస్పీ చరణ్ ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం డిసెంబరు 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను ఆడియన్స్‌కు ఓ మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్ష్ను ఇవ్వడానికి హెవీ సీజీ వర్క్‌ను గత కొంత కాలం నుంచి ఎంతో క్వాలిటీతో ఉన్నత సాంకేతిక పరిజ్ఞానంతో చేయిస్తున్నారు నిర్మాతలు. ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదల చేసిన పాటలకు చిత్ర టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రం విడుదల తేదిని ప్రకటించారు మేకర్స్. డిసెంబరు 25న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘ఈ సినిమా థియేటర్లో యూత్‌ఫెస్టివల్‌లా వుంటుంది. కొత్తవాళ్లతో చేసిన మా సినిమా కొత్తగా వుండటంతో పాటు చాలా పెద్ద సినిమా క్వాలిటీతో వుంటుంది అన్నారు. ఎంతో కలర్ఫుల్గా ఉండే ఈ సినిమాకు కథే హీరో. ఈ చిత్రానికి జోస్ జిమ్మి అద్భుతమైన పాటలు ఇచ్చాడు. పాట వింటూంటే అందరిలో పాజిటివ్ వైబ్స్ కలుగుతాయి. సినిమా చూస్తున్నంత సేపు ఆ పంతగుల పోటీ మీలో ఉత్సుకతను కలిగిస్తుంది. తప్పకుండా మా పతంగ్ చిత్రం అన్నివర్గాల వారిని అలరిస్తుందనే నమ్మకం వుంది. కొత్త కంటెంట్‌ను ఆదరించే తెలుగు ప్రేక్షకులు మా ప్రయత్నాన్ని తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం వుంది. డిసెంబరు 25న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’ అని తెలిపారు.