Dharmasthala Niyojakavargam is set for a worldwide grand theatrical release

Panch Minar Release Date Fixed
రాజ్ తరుణ్, రామ్ కడుముల, గోవింద రాజు ప్రజెంట్స్ ‘పాంచ్ మినార్’ నవంబర్ 21న గ్రాండ్ రిలీజ్
యంగ్ ట్యాలెంటెడ్ రాజ్ తరుణ్ హీరోగా రామ్ కడుముల దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘పాంచ్ మినార్’. గోవింద రాజు ప్రజెంట్ చేస్తున్న ఈ చిత్రాన్ని కనెక్ట్ మూవీస్ LLP బ్యానర్ పై మాధవి, MSM రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ రోజు మేకర్స్ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. నవంబర్ 21న ఈ చిత్రం విడుదల కానుంది. రాజ్ తరుణ్, అజయ్ ఘోష్, రాశి సింగ్, శ్రీనివాస్ రెడ్డి ఇంటెన్స్ లుక్ లో కనిపించిన రిలీజ్ డేట్ పోస్టర్ ఇంట్రస్టింగ్ గా వుంది.
ఈ చిత్రంలో రాశి సింగ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. అజయ్ ఘోష్, బ్రహ్మాజీ, శ్రీనివాస్ రెడ్డి, నితిన్ ప్రసన్న, రవి వర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి ట్యాలెంటెడ్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. ఆదిత్య జవ్వాది డీవోపీ కాగా ప్రవీణ్ పూడి ఎడిటర్. ‘బేబీ’ సురేష్ భీమగాని ఆర్ట్ డైరెక్టర్.
నటీనటులు: రాజ్ తరుణ్, రాశి సింగ్,అజయ్ ఘోష్, బ్రహ్మాజీ, శ్రీనివాస్ రెడ్డి, నితిన్ ప్రసన్న, రవి వర్మ, సుదర్శన్, కృష్ణ తేజ, నంద గోపాల్, ఎడ్విన్ లక్ష్మణ్ మీసాల, జీవా, అజీజ్ తదితరలు
సాంకేతిక సిబ్బంది:
బ్యానర్: కనెక్ట్ మూవీస్ LLP
సమర్పణ: గోవింద రాజు
రచన & దర్శకత్వం: రామ్ కడుముల
నిర్మాతలు: మాధవి, MSM రెడ్డి
సంగీతం: శేఖర్ చంద్ర
డీవోపీ: ఆదిత్య జవ్వాది
ఎడిటర్: ప్రవీణ్ పూడి
ఆర్ట్ డైరెక్టర్: ‘బేబీ’ సురేష్ భీమగాని
డైలాగ్స్: గొరిజాల సుధాకర్
కో-డైరెక్టర్స్: పుల్లారావు కొప్పినీడి & టి రాజా రమేష్
పీఆర్వో: వంశీ శేఖర్
