
Mirai Trailer Watched by Superstar Rajinikanth and Congratulated Manchu Manoj
Mirai, featuring Rocking Star Manchu Manoj in a key role, has been creating a buzz ever since its trailer was released recently. The trailer has received an impressive response, and what makes it even more special is the appreciation it earned from none other than Superstar Rajinikanth. Rajinikanth, after watching the trailer, praised it for its grand scale of filmmaking and lauded Manchu Manoj’s powerful character portrayal. He expressed his admiration for the film’s making and conveyed his best wishes to the team.
Manoj, overwhelmed by receiving such blessings from Superstar Rajinikanth, shared his happiness and gratitude. He said that Rajinikanth’s appreciation means a lot to him at this stage in his career. With Mirai, Manoj is stepping into yet another new phase of his journey as an actor. The film stars Teja Sajja in the lead role and is directed by Karthik Ghattamaneni. Ritika Nayak, Shriya Saran, Jayaram, and Jagapathi Babu play important roles in the film. Mounted on a massive pan-India scale, Mirai is produced by T.G. Vishwa Prasad under the People Media Factory banner. The film is gearing up for a grand worldwide release on September 12th.
‘మిరాయ్’ సినిమా ట్రైలర్ చూసి రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ను అభినందించిన సూపర్ స్టార్ రజనీకాంత్
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ కీలక పాత్రలో నటించిన సినిమా ‘మిరాయ్’. ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే రిలీజై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఈ ట్రైలర్ ను సూపర్ స్టార్ రజనీకాంత్ చూసి చాలా బాగుందంటూ అప్రిషియేట్ చేశారు. గ్రాండ్ స్కేల్ లో మూవీ మేకింగ్ తో పాటు మనోజ్ క్యారెక్టర్ పవర్ ఫుల్ గా ఉందంటూ రజనీకాంత్ అభినందించారు. ‘మిరాయ్’ మూవీతో సూపర్ స్టార్ రజనీకాంత్ బ్లెస్సింగ్స్ తనకు దక్కడం పట్ల రాకింగ్ స్టార్ మంచు మనోజ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
‘మిరాయ్’ సినిమాతో మనోజ్ తన కెరీర్ లో మరో కొత్త ప్రయత్నం చేస్తున్నారు. తేజ సజ్జా హీరోగా దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రితికా నాయక్, శ్రియ శరణ్, జయరామ్, జగపతి బాబు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. భారీ పాన్ ఇండియా చిత్రంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టి.జి.విశ్వప్రసాద్ నిర్మించిన మిరాయ్ మూవీ ఈ నెల 12న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది.