
Lyrical Song Raju okkadu Released from Gamblers
సంగీత్ శోభన్ మిస్టరీ ఎంటర్టైనర్ ‘గ్యాంబ్లర్స్’ నుంచి ”రాజు ఒక్కడు, రాణి ఒక్కతి” లిరికల్ సాంగ్ విడుదల
మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ చిత్రాలతో కథానాయకుడిగా అందరి హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాందించుకున్న యూత్‌ఫుల్ క్రేజీ హీరో సంగీత్ శోభన్ కథానాయకుడిగా రూపొందుతోన్న చిత్రం ‘గ్యాంబ్లర్స్’. ప్రశాంతి చారులింగా నాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో కేసీఆర్ ఫేమ్ రాకింగ్ రాకేష్ పృథ్వీరాజ్ బన్న, సాయి శ్వేత, , జస్విక, భరణి శంకర్, మల్హోత్త్ర శివ, శివారెడ్డి ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ రచయిత, దర్శకుడు విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో శ్రీవల్లి అనే సైన్స్ ఫిక్షన్ సినిమాను నిర్మించిన నిర్మాతలు సునీత, రాజ్‌కుమార్ బృందావనంలు ఈ సినిమాను రేష్మాస్ స్టూడియోస్, స్నాప్ అండ్ క్లాప్ ఎంటర్టైన్ మెంట్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కేఎస్కే చైతన్య ఈ చిత్రానికి దర్శకుడు. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు తుదిదశకు చేరుకున్న ఈ చిత్రాన్ని జూన్ 6న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్చేస్తున్నారు. కాగా ఇటీవల విడుదలైన టీజర్‌కు చక్కటి స్పందన వస్తోంది. తాజాగా ఈ చిత్రం నుంచి సినిమా కాన్సెప్ట్ థీమ్ సాంగ్ ” రాజు ఒక్కడు రాణి ఒక్కతి” అనే లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. కిట్టు విస్సా ప్రగడ సాహిత్యం అందించిన ఈ పాటను సాయిదేవ హర్ష, శశాంక్ తిరుపతి, వినాయక్, జీకే సంపత్, జయశ్రీ ఆలపించారు. శశాంక్ తిరుపతి బాణీలు సమకూర్చారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ” ఇది కాన్సెప్ట్ థీమ్ సాంగ్. ఈ సాంగ్ సినిమా కాన్సెప్ట్‌ను థీమ్‌ను తెలియజేస్తుంది. ఈ సాంగ్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచే విధంగా ఉంటుంది. ‘ ఇదొక మిస్టరీ ఎంటర్టైనర్. ఈ చిత్రంలో కొత్త సంగీత్ శోభన్‌ను చూడబోతున్నారు. ఆయన నటనలోని మరో కోణాన్ని ఆవిష్కరించే చిత్రమిది. చిత్రంలో ఉండే థ్రిల్లింగ్ అంశాలు, ట్విస్ట్‌లు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయి. పూర్తి వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో అన్ని వర్గాలను అలరించే అంశాలున్నాయి. ఇటీవల కేసీఆర్ చిత్రంతో అందరి ప్రశంసలు అందుకున్న రాకింగ్ రాకేష్ ఈ చిత్రంలో ఓ ముఖ్యపాత్రను పోషిస్తున్నాడు. ఆయన పాత్ర కూడా అందర్ని అలరించే విధంగా ఉంది| అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ” మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ చిత్రాలతో సంగీత్ శోభన్‌కు యూత్‌లు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన గత చిత్రాలకు పూర్తి భిన్నమైన పాత్రను ఆయన ఇందులో చేస్తున్నారు. కొత్తకాన్సెప్ట్‌తో పూర్తి థ్రిల్లింగ్ అంశాలతో రూపొందిన ఈ గ్యాంబ్లర్స్ తప్పకుండా అందర్ని అలరిస్తుందనే నమ్మకం ఉంది అన్నారు. సంగీత్ శోభన్, ప్రశాంతి చారులింగ, రాకింగ్ రాకేష్ పృథ్వీరాజ్ బన్న, సాయి శ్వేత, జస్విక, భరణి శంకర్, మల్హోత్త్ర శివ, శివారెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, మధుసూదన్ రావు, ఛత్రపతి శేఖర్, సూర్య భగవాన్ దాస్ తదితరులు నటిస్తున్న చిత్రానికి
నిర్మాతలు: సునీత, రాజ్‌కుమార్ బృందావనం
స్క్రీన్ ప్లే – దర్శకత్వం: KSK చైతన్య
కథ – అదనపు స్క్రీన్‌ప్లే – సంభాషణలు: విజయ్ చిట్నీడి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్ ప్రకాష్
సంగీతం: శశాంక్ తిరుపతి
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: ప్రేమ్ సాగర్
ప్రొడక్షన్ డిజైనర్: రాజీవ్ నాయర్
ఎడిటర్: శశాంక్ మాలి
యాక్షన్: వింగ్ చున్ అంజి
కొరియోగ్రఫీ: నిక్సన్ డి’క్రూజ్
సాహిత్యం: కిట్టు విస్సాప్రగడ
కాస్ట్యూమ్ డిజైనర్లు: అశ్వంత్ బైరీ, ప్రతిభా రెడ్డి