నాగబంధం విజువల్‌గా ప్రేక్షకులకు గ్రాండ్ థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ అందిస్తుంది – డైరెక్టర్ అభిషేక్

Lost Everything for Spirit is Not One – Women Farmer cum Producer Narsamma
In a heartbreaking turn of events, a woman farmer and independent film producer, Narsamma, has made an emotional public appeal to Pan-India superstar Prabhas and director Sandeep Reddy Vanga. Under her banner 8th Wonder Cinemas, Narsamma produced a small-budget film titled “Spirit is Not One”. However, due to a sudden legal dispute raised by the makers of Prabhas upcoming big-budget venture “Spirit”, her movie’s release has been stalled, pushing her family to the brink of financial ruin.
A Dream Shattered by Legal Notices
Speaking about her plight, Narsamma stated that producing this film was her childhood dream. To fund the project, her family of farmers sold off their lands and assets, exhausting all their life savings.
The movie had completed all formalities, including securing a Censor Certificate a year before Prabhas’ “Spirit” even began its shoot. 8th Wonder Cinemas had actively promoted the film across various news portals, YouTube channels, and newspapers. However, just last month, as they printed posters and finalised the theatrical release, they were slapped with two consecutive legal notices from Bollywood giant T-Series, headed by Bhushan Kumar (the producers of Prabhas’ Spirit).
“Like a hammer crushing a sparrow, they used legal notices to stop our small movie. Sandeep Reddy Vanga’s manager collected our address and details under the guise of an enquiry, only to pass them on to T-Series to serve us these notices,” a tearful Narsamma alleged.
Social Humiliation and Financial Distress
The sudden stalling of the movie has triggered a severe crisis for the farmer’s family. Narsamma explained that investors who initially promised release funds have backed out. Furthermore, lenders are mounting heavy pressure to clear outstanding debts.
“People in our village are mocking us. They think we deliberately orchestrated this legal notice as an excuse to avoid paying back our debts. Our reputation is completely ruined. If they had just approached us directly, we would have happily changed the title. But instead of supporting a farming family trying to make a movie, the film industry has completely isolated us,” she added.
An Earnest Appeal to Prabhas and Sandeep Reddy Vanga
Stressing that she holds no ill-will against Prabhas or Sandeep Reddy Vanga, Narsamma requested the superstar to intervene personally. She believes Prabhas might be unaware of the ground realities and the aggressive tactics adopted by his co-producers.
Her key demands and appeals include:
Title Flexibility: The team of Spirit is Not One is fully willing to change their film’s title if it conflicts with Prabhas’ commercial interests, provided the issue is resolved amicably in the presence of industry elders.
Withdrawal of Objections: She requested T-Series to withdraw their legal notices and issue an official No Objection Certificate (NOC) so that her film can be released in theatres and on digital/OTT platforms.
A Humble Request to Postpone Spirit: Since theirs is a tiny project that needs immediate clearance to save their lives, she folded her hands and requested Prabhas to postpone his movie Spirit just until her small film completes its brief theatrical run.
Legal Recourse as a Last Resort
While Narsamma reiterated her desire for an amicable, mutual resolution, she made it clear that her family is backed into a corner.
“This film holds our blood, sweat, and tears. If our plea falls on deaf ears and no justice is served, we will be forced to approach the court of law. We will legally fight for our rights, demanding compensation for the massive financial losses and defamation we have suffered due to this sudden blockade,” she warned.
The film fraternity and netizens are now waiting to see if Prabhas, known for his philanthropic nature and supportive attitude towards small films, will step forward to rescue this distressed woman farmer.
స్పిరిట్ ఈజ్ నాట్ వన్ సినిమా తీసి సర్వం కోల్పోయాం.. ప్రభాస్ గారు మాకు మీరే దిక్కు మా సినిమా పైన కోర్టు కేసు వేసి రిలీజ్ ఆపేసి రోడ్డున పడేసిన ప్రభాస్ ప్రొడ్యూసర్స్: మహిళా రైతు నిర్మాత నర్సమ్మ
పాన్ ఇండియా హీరో ప్రభాస్ గారు మాకు మీరే దిక్కు ఆస్తులు అమ్మి “స్పిరిట్” ఇస్ నాట్ వన్ సినిమా తీసి సర్వం కోల్పోయాం. పిచ్చుక మీద బ్రహ్మస్త్రం లా
మా మీద రెండు లీగల్ నోటీసులు పంపించి సినిమా రిలీజ్ ఆపేసారు. మాతో మాట్లాడితే వేరే టైటిల్ పెట్టుకుని మా సినిమా రిలీజ్ చేసుకునేవాళ్ళం. రిలీజ్ చెయ్యడానికి ఊరిలో ఒకరిని డబ్బులు అడిగాం అప్పుడు డబ్బులు ఇస్తాను అన్నవాళ్లు కూడా భయపడి ఇవ్వలేదు. ఊరిలో పరువు పోయింది ఇప్పుడు మమ్మల్ని ఎవ్వరు నమ్మడం లేదు. మా ఫ్యామిలీ రోడ్డున పడిపోయాం. ప్రభాస్ గారు మమ్మల్ని మీరే ఆదుకోవాలి.
మీకోసం టైటిల్ మార్చుకోడడానికి మేము సిద్ధం గానే ఉన్నాము. మమ్మల్ని సంప్రదించకుండా టీ-సిరీస్ సంస్థ అధినేత శ్రీ భూషణ్ కుమార్ రెండు లీగల్ నోటీసులు పంపారు. అడిగి ఉంటే మేము టైటిల్ మార్పుకు ఒప్పుకునే వాళ్ళం. ఒక రైతు ఫ్యామిలీ సినిమా తీస్తే మాకు వచ్చిన టైటిల్ వివాదం కి సినిమా ఇండస్ట్రీ ఎటువంటి సపోర్ట్ చెయ్యడం లేదు.
ప్రభాస్ గారిపై, సందీప్ రెడ్డి వంగా గారిపై అభిమానంతో ఈ విజ్ఞప్తిని చేస్తున్నాను. మీరు చేస్తున్న “స్పిరిట్” సినిమా నిర్మాతలు అయిన టీ-సిరీస్ సంస్థ అధినేత శ్రీ భూషణ్ కుమార్ గారి తరఫున, మా “స్పిరిట్ ఈజ్ నాట్ వన్” చిత్రాన్ని విడుదల చేయకూడదని, దాని ప్రచార కార్యక్రమాలు నిలిపివేయాలని కోరుతూ మాకు లీగల్ నోటీసు పంపబడింది.
మా “స్పిరిట్ ఈజ్ నాట్ వన్” చిత్రం 8th Wonder Cinemas బ్యానర్‌పై నిర్మించబడింది. ఈ చిత్రానికి మీరు సూట్ మొదలు పెట్టక ముందు సంవత్సరంలోనే మాకు సెన్సార్ సర్టిఫికేట్ లభించింది. అంతకుముందే మేము అనేక యూట్యూబ్ ఛానెల్స్, వార్తాపత్రికలు, ఇతర మీడియా వేదికల ద్వారా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాము. చిత్రానికి సంబంధించిన ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాము. గత నెలలో చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించి, పోస్టర్లు ముద్రించి, విడుదలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన సమయంలో, సందీప్ రెడ్డి వంగా గారి మేనేజర్ ద్వారా మా ఇంటి చిరునామాలు, ఇతర వివరాలు మా నుంచే సేకరించి, వాటిని టీ-సిరీస్ వారికి అందించి అనంతరం మాకు లీగల్ నోటీసు పంపించారు.
ఈ పరిణామాల వల్ల మా కుటుంబం సామాజికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. విడుదల కోసం పెట్టిన పెట్టుబడులు నిలిచిపోయాయి. గతంలో ఈ సినిమా నిర్మాణం కోసం చేసిన అప్పుల కారణంగా రుణదాతల నుంచి కూడా ఒత్తిడి ఎదురవుతోంది. అంతేకాక మీరు పంపించిన లాయర్ నోటీసు మేమే కావాలని మా ఊర్లో మా ఇంటికి పంపించి అప్పుల వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా ఎగ కొట్టాలని అనుకుంటున్నాము అని మీ వల్ల నింద కూడా వచ్చింది. మీరు ఈ నోటీసు పంపడం వెనుక ఉద్దేశ్యం ఏమిటో మాకు తెలియదు. ఒకవేళ టైటిల్‌కు సంబంధించిన ఏదైనా అభ్యంతరం ఉంటే, పెద్దల సమక్షంలో చర్చించి పరిష్కారం కనుగొనడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మీకు కూడా దురుద్దేశం ఏమీ లేకపోతే మీరు పెద్దమనుషులు దగ్గరికి రావాలని ఆశిస్తూ చిన్న నిర్మాతలు, మంచి కథలు, మంచి టైటిళ్లతో సినిమాలు చేయకూడదనే ఉద్దేశం ఎవరికీ ఉండకూడదని మా అభిప్రాయం.
ఒకవేళ ఈ చర్యలు కేవలం మీ సినిమా ప్రచారం లేదా వాణిజ్య ప్రయోజనాల కోసం జరిగి ఉంటే, దాని వల్ల మా కుటుంబం, మా సినిమా తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నాయి. అయితే ఈ విషయాల గురించి మీకు పూర్తి సమాచారం లేకపోతే, దయచేసి మీ నిర్మాతలతో మాట్లాడి నిజానిజాలు తెలుసుకొని మాకు న్యాయం జరిగేలా సహకరించగలరని కోరుతున్నాము. అలాగే, మీ నిర్మాతల అభ్యంతరాలు ఉపసంహరించుకున్నట్లయితే, “8th Wonder Cinemas” బ్యానర్‌పై నిర్మితమైన “స్పిరిట్ ఈజ్ నాట్ వన్” చిత్రానికి ఎటువంటి అభ్యంతరం లేదని, దాని విడుదల, ప్రదర్శన, డిజిటల్ లేదా ఇతర ప్లాట్‌ఫారమ్‌లలో విక్రయానికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదని స్పష్టంగా తెలియజేసే అధికారిక లేఖ, ప్రకటన కుడా ఇవ్వగలరని మనవి.
మా సినిమా కోసం మేము అనేక సంవత్సరాలుగా శ్రమించాము. ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, నా చిన్ననాటి కల. మా కుటుంబ సభ్యులందరి కష్టం, ఆశలు, పెట్టుబడులు ఈ చిత్రంలో ఉన్నాయి. మేము గౌరవప్రదంగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలనే సంకల్పంతో ముందుకు వచ్చాము. కాబట్టి, దయచేసి మా పరిస్థితిని అర్థం చేసుకుని, మాకు సానుకూలంగా స్పందించి, “స్పిరిట్ ఈజ్ నాట్ వన్” చిత్రాన్ని విడుదల చేసుకునే అవకాశాన్ని కల్పించగలరని, మాది చిన్న సినిమా కాబట్టి మా సినిమా రిలీజ్ అయ్యే అంతవరకు మీ స్పిరిట్ సినిమా రిలీజ్ ని వాయిదా వేసుకోవాలి అని చేతులు జోడించి ప్రభాస్ గారిని, సందీప్ రెడ్డి వంగా గారిని వేడుకుంటున్నాను.
చివరగా, ఈ విజ్ఞప్తిపై మీరు సానుకూలంగా స్పందించి, మా చిత్ర విడుదలకు సహకరిస్తారని ఆశిస్తున్నాము. ఒకవేళ ఈ అంశంపై మీ నుంచి ఎలాంటి స్పందన రాకపోయినా, లేదా మా సమస్యకు న్యాయమైన పరిష్కారం లభించకపోయినా, మా హక్కులు, ప్రయోజనాలను కాపాడుకోవడానికి మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించక తప్పదు.
అలాగే, ఇప్పటివరకు మాకు జరిగిన ఆర్థిక నష్టం, పరువు నష్టం, ఇతర ఇబ్బందులన్నింటినీ పరిగణనలోకి తీసుకొని, చట్టపరంగా మాకు అందుబాటులో ఉన్న అన్ని న్యాయపరమైన మార్గాలను అనుసరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని మర్యాదపూర్వకంగా తెలియజేస్తున్నాము.
అయినప్పటికీ కంటే పరస్పర అవగాహనతో సమస్యకు పరిష్కారం లభించాలని మేము హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము.
ఇట్లు,
స్పిరిట్ మహిళా రైతు నరసమ్మ
నిర్మాత,
స్పిరిట్ ఈజ్ నాట్ వన్
8th Wonder Cinemas
Contact
నరసమ్మ
8019436005
9951262916
