
Little Hearts getting strong support from stars
Recently, “Little Hearts” has turned into the talk of the town in the industry. Released as a small-budget film, it has achieved big success. Starring Mouli Tanuj and Shivani Nagaram as the lead pair, the movie is not only receiving love from audiences but also strong support from stars. Producers, directors, heroes, and heroines from all crafts of cinema are praising and encouraging “Little Hearts.”
Top stars like Icon Star Allu Arjun, Mass Maharaja Ravi Teja, Vijay Deverakonda, Nani, and Naga Chaitanya, along with several renowned filmmakers and producers, have extended their support. Because of this encouragement, the movie is reaching a wider audience and is holding steady at the box office. Stars coming forward to support small films in Tollywood is indeed a positive development. If this culture continues, more content-driven small films will find success.
“Little Hearts” is directed by Sai Marthand under the ETV Win Originals banner, with Aditya Hasan as producer. The film’s theatrical release was promoted and executed on a grand worldwide scale by Bunny Vaas through BV Works and Vamsi Nandipati, through Vamsi Nandipati Entertainments.
“లిటిల్ హార్ట్స్” మూవీకి సపోర్ట్ చేస్తూ కంటెంట్ ఉన్న చిన్న సినిమాకు ప్రోత్సాహం అందిస్తున్న స్టార్స్
ఇటీవల ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది “లిటిల్ హార్ట్స్”. చిన్న చిత్రంగా రిలీజై పెద్ద విజయాన్ని అందుకుంది. మౌళి తనూజ్, శివానీ నాగరం జంటగా నటించిన “లిటిల్ హార్ట్స్” సినిమాకు ప్రేక్షకుల ఆదరణతో పాటు స్టార్స్ సపోర్ట్ చేస్తున్నారు. ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, హీరోస్, హీరోయిన్స్..ఇలా అన్ని క్రాఫ్ట్స్ నుంచి స్టార్స్ “లిటిల్ హార్ట్స్” సినిమాను ప్రశంసిస్తూ ప్రోత్సహిస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాస్ మహారాజా రవితేజ, విజయ్ దేవరకొండ,నాని నాగచైతన్య వంటి స్టార్స్ సహా పలువురు పేరున్న దర్శక నిర్మాతల ప్రోత్సాహం వల్లే ఈ సినిమా మరింతగా ప్రేక్షకులకు చేరువవుతోంది. థియేటర్స్ లో స్టడీగా కలెక్షన్స్ సాధిస్తోంది. చిన్న చిత్రానికి స్టార్స్ సపోర్ట్ గా రావడం టాలీవుడ్ లో మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. ఈ సంప్రదాయం ఇలాగే కొనసాగితే కంటెంట్ ఉన్న మరిన్ని మంచి చిత్రాలు విజయాన్ని అందుకుంటాయి.
“లిటిల్ హార్ట్స్” చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. ఆదిత్య హాసన్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాను అద్భుతంగా ప్రమోట్ చేసి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ బన్నీ వాస్ తన బీవీ వర్క్స్, వంశీ నందిపాటి తన వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై వరల్డ్ వైడ్ గ్రాండ్ గా థియేట్రికల్ గా రిలీజ్ చేశారు.
