మెలొడీ బ్రహ్మ మణిశర్మ పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించిన “చెన్నై లవ్ స్టోరీ”

Lenin Success Is the Result of Nagarjuna Garu’s Dedication – Sivaji
Speaking at the blockbuster success celebrations of Lenin, actor Sivaji delivered an emotional speech, describing the film as one of the most special projects of his career. He said it was a privilege to work with three generations of the Akkineni family and praised Akhil Akkineni for his unwavering dedication throughout the making of the film. Sivaji revealed that he personally witnessed Nagarjuna’s constant efforts and determination to see Akhil succeed. He also applauded Akhil’s commitment, saying the actor spent nearly one and a half years working tirelessly, paying close attention not only to his performance but also to every aspect of filmmaking, including production, editing, and music. According to Sivaji, the phenomenal success of Lenin is a victory Akhil truly deserves.
Recalling his long-standing association with the Akkineni family, Sivaji shared that he bought his first piece of land with the very first remuneration he received from Nagarjuna Garu and said he would remain forever grateful to the family. He emotionally revealed that from the very first day of the film’s shoot, he prayed every day for Lenin to become a massive success for his “Boss.” As audience appreciation continued to grow, he became confident that the film was destined to become a blockbuster. Sivaji also appreciated every actor and technician for treating the project like their own film and giving it their absolute best.
Sivaji further mentioned that actress Bhagyashri Borse had confidently predicted the film’s grand success even before its release, and he expressed happiness that her words had come true. He concluded by congratulating director Murali Kishor Abburu, the producers, music director S. Thaman, choreographer Brinda Master, and the entire team for delivering a memorable blockbuster. Wishing them many more such celebrations in the future, Sivaji thanked audiences for showering Lenin with immense love and making it a remarkable success.
‘లెనిన్’ విజయం నాగార్జున గారి తపనకు దక్కిన ఫలితం – శివాజీ
‘లెనిన్’ బ్లాక్‌బస్టర్ వేడుకలో నటుడు శివాజీ భావోద్వేగంగా మాట్లాడారు. ఈ సినిమా తన హృదయానికి ఎంతో దగ్గరైన చిత్రమని, మూడు తరాల అక్కినేని కుటుంబంతో కలిసి పనిచేసే అవకాశం రావడం తన అదృష్టమని అన్నారు. దర్శకులు, నటీనటులకు అవకాశాలు ఇచ్చిన నాగార్జున తనయుడు అఖిల్ విజయవంతం కావాలనే తపనను తాను దగ్గర నుంచి చూశానని చెప్పారు. సినిమా కోసం అఖిల్ దాదాపు ఏడాదిన్నర పాటు ఎంతో కష్టపడ్డారని, నటనతో పాటు నిర్మాణం, ఎడిటింగ్, సంగీతం వంటి ప్రతి అంశంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారని కొనియాడారు. ఈ విజయం అఖిల్ పూర్తిగా అర్హించిన విజయమని అన్నారు.
తనకు నాగార్జున కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న శివాజీ, కెరీర్ ప్రారంభంలో నాగార్జున ఇచ్చిన తొలి పారితోషికంతో భూమి కొనుగోలు చేశానని, ఆ కుటుంబానికి జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పారు. సినిమా ప్రారంభమైన తొలి రోజు నుంచే ‘ఈ చిత్రం మా బాస్ కోసం పెద్ద హిట్ కావాలి’ అని ప్రతి రోజు దేవుడిని ప్రార్థించానని వెల్లడించారు. ఈ చిత్రం గురించి ప్రేక్షకుల స్పందన తెలుసుకుంటూ సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుందని నమ్మకం వచ్చిందన్నారు. చిత్రంలో ప్రతి నటుడు, సాంకేతిక నిపుణుడు సొంత సినిమాలా భావించి కష్టపడ్డారని ప్రశంసించారు. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే కూడా సినిమా ఘన విజయం సాధిస్తుందని ముందే చెప్పానని, ఇప్పుడు తన మాట నిజమైందని ఆనందం వ్యక్తం చేశారు.
చివరగా, దర్శకుడు, నిర్మాతలు, సంగీత దర్శకుడు తమన్, బ్రిందా మాస్టర్‌తో పాటు మొత్తం చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇలాంటి విజయోత్సవాలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
