Kamal Haasan | ఇండియన్ 2కు సైన్ చేయడానికి ప్రేరణ అదే : కమల్ హాసన్
Kamal Haasan | కమల్‌హాసన్ (Kamal Haasan)-శంకర్ (Shankar) క్రేజీ కాంబోలో భారతీయుడుకు సీక్వెల్‌గా తెరకెక్కుతోంది ఇండియన్ 2 (Indian 2). . కమల్‌హాసన్ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జులై 12న తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే లాంఛ్ చేసిన ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది.
Kamal Haasan | పాన్ ఇండియా మూవీ ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న మోస్ట్ ఎవెయిటెడ్ సినిమాల్లో ఒకటి ఇండియన్ 2 (Indian 2). కమల్‌హాసన్ (Kamal Haasan)-శంకర్ (Shankar) క్రేజీ కాంబోలో భారతీయుడుకు సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. కమల్‌హాసన్ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జులై 12న తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే లాంఛ్ చేసిన ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది.
కాగా ప్రమోషనల్ ఈవెంట్లో ఇండియన్ 2 చేయడానికి కారణమేంటో చెప్పాడు. నేను ఇండియన్ 2కు సంతకం చేయడానికి అతిపెద్ద ప్రేరణ వాస్తవానికి ఇండియన్ ౩. ఇందులో నేను సేనాపతి తండ్రిగా కూడా నటిస్తున్నా. శంకర్ చాలా ఆత్మ విశ్వాసం గల వ్యక్తి అని నాకు తెలుసు. కానీ భారతీయుడు, కమల్‌హాసన్‌కు అభిమానిగా శంకర్‌కున్న విశ్వాసం ఆశ్చర్యపరుస్తుందన్నాడు కమల్ హాసన్. ఇండియన్ 2, ఇండియన్ 3 షూటింగ్స్ ఒకేసారి జరిపినట్టు ఇప్పటికే వార్తలు రాగా.. ఉలగనాయగన్ తాజా కామెంట్స్ ఇండియన్ ప్రాంఛైజీ సినిమాలపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి.
ఇండియన్ 2 నుంచి మేకర్స్ ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్ (AN INTRO) సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తోంది. పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీలో ఎస్జే సూర్య, బాబీ సింహా, సిద్దార్థ్, సముద్రఖని, లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం, మధుబాల, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ -రెడ్ జియాంట్ మూవీస్‌పై ఉదయనిధి స్టాలిన్-సుభాస్కరన్ తెరకెక్కిస్తున్నారు.