Lovely Number Bhalle Bhalle From Nari Nari Naduma Murari Unveiled

Jathasya maranam dhruvam first look released
జెడి చక్రవర్తి, నరేష్ అగస్త్య, సీరత్ కపూర్, శ్రవణ్ జొన్నాడ, మల్కాపురం శివ కుమార్, సురక్ష్, త్రిష ప్రెజెంట్స్, పాన్ ఇండియా ఫిల్మ్ ‘జాతస్య మరణం ధ్రువం’ ఫస్ట్ లుక్ రిలీజ్
జెడి చక్రవర్తి, నరేష్ అగస్త్య, సీరత్ కపూర్ లీడ్ రోల్స్ లో శ్రవణ్ జొన్నాడ రచన, దర్శకత్వం వహించిన యాక్షన్ థ్రిల్లర్ ని, త్రిష ప్రెజెంటర్ గా సురక్ష్ బ్యానర్‌పై మల్కాపురం శివ కుమార్ నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాతో ప్రీతీ జంఘియానీ కూడా రీఎంట్రీ ఇస్తోంది.
ఈ చిత్రానికి ‘జాతస్య మరణం ధ్రువం’అనే టైటిల్ ఖరారు చేసిన మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని లాంచ్ చేశారు. ఒక సంస్కృత పదబంధం నుంచి వచ్చిన ఈ టైటిల్ కు “పుట్టినవారికి మరణం తప్పదు” అని అర్ధం. ఈ టైటిల్ బ్రెత్ టేకింగ్, థాట్ ప్రొవొకింగ్ నెరేటివ్ కి టోన్ సెట్ చేస్తుంది.
JD చక్రవర్తి, నరేష్ అగస్త్య, సీరత్ కపూర్ ఇంటెన్స్ అండ్ సీరియస్ ఎక్స్ ప్రెషన్స్ కనిపిస్తూ మిస్టరీ సెన్స్ ని క్రియేట్ చేసే ఫస్ట్-లుక్ పోస్టర్ చాలా క్యురియాసిటీని పెంచుతోంది.
ఈ మూవీకి అర్జున్ రాజా డీవోపీ, జిబ్రాన్, రాజ్ ఆషూ సంగీతం అందించారు. విప్లవ్ నైషధం ఎడిటర్, రాజేష్ మందాపురం ఆర్ట్ డైరెక్టర్.
తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ కానుంది.
నటీనటులు: జెడి చక్రవర్తి, నరేష్ అగస్త్య, సీరత్ కపూర్, ప్రీతి జంఘియాని, రాజేష్ శర్మ, తనికెళ్ల భరణి, లావణ్య షాహుకారు, హిట్టెన్ తేజ్వాణి, మస్త్ అలీ, తులసి, ఈటీవీ ప్రభాకర్, జెమినీ సురేష్, షీనా చౌహాన్, షబీనా, ఇంధు, సోనియా, తాగుబోతు రమేశ్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం – శ్రవణ్ జొన్నాడ
నిర్మాత – మల్కాపురం శివ కుమార్
సంగీతం – జిబ్రాన్, రాజ్ ఆషూ
డీవోపీ- అర్జున్ రాజా
ఎడిటర్- విప్లవ్ నైషదం
ఆర్ట్ డైరెక్టర్ – రాజేష్ మందాపురం
కాస్ట్యూమ్స్- శ్రీదేవి
స్టంట్స్- పృద్వి, వెంకట్
సాహిత్యం- సుద్దాల అశోక్ తేజ, భాస్కరభట్ల రవి కుమార్, కె.కె
కొరియోగ్రాఫర్ – జెడి మాస్టర్
పీఆర్వో- వంశీ-శేఖర్
