“JACK” team wishes Happy New Year 2025
After the massive blockbuster franchise DJ Tillu, the star boy Siddu Jonnalagadda is currently working on other projects. The actor is busy with “Jack – Konchem Crack,” directed by blockbuster director Bommarillu Baskar. Bommarillu Bhaskar and Siddhu Jonnalagadda are exploring a new genre.
Top production house Sri Venkateswara Cine Chitra, led by popular producer BVSN Prasad, is bankrolling the film. Jack will be released worldwide in theatres on April 10th, 2025. The shoot is nearing completion. Today, makers dropped a striking New Year poster, and it’s capturing everyone’s attention.
In the captivating first look, star boy Siddu is seen in a simple yet stylish look. The audience have high expectations for the film, with Sidhu Jonnalagadda in the title role. The film is designed to be a fun ride, and Vaishnavi Chaitanya, known for her role in “Baby,” plays the female lead.
The film also stars versatile actor Prakash Raj, Naresh, and Brahmaji in key roles. Music for the film has been composed by Achu Rajamani, who has delivered fantastic tunes. Siddu Jonnalagadda stars in the titular role of Jack, who is described as a “Crack gadu,” and he promises wildly laughter game.
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, బొమ్మరిల్లు భాస్కర్, బివిఎస్ఎన్ ప్రసాద్ మూవీ ‘జాక్’ న్యూ ఇయర్ విషెష్.. ఏప్రిల్ 10న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్
డీజే టిల్లు ఫ్రాంచైజీ చిత్రాల బ్లాక్‌బస్టర్ తర్వాత స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తోన్న మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘జాక్* కొంచెం క్రాక్’. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బొమ్మరిల్లు దర్శకత్వం వహిస్తున్నారు. సిద్ధు జొన్నలగడ్డ, బొమ్మరిల్లు భాస్కర్ కలయికలో సరికొత్త జోనర్లో ‘జాక్- కొంచెం క్రాక్’ మూవీ రూపొందుతోంది.
ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బివిఎస్ఎన్ ప్రసాద్ ‘జాక్- కొంచెం క్రాక్’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 10న గ్రాండ్ లెవల్లో రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ క్రమంలో న్యూ ఇయర్ సందర్భంగా మేకర్స్ అందరికీ విషెష్ తెలియజేస్తూ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు.
పోస్టర్ lo స్టార్ బాయ్ సిద్ధు సింపుల్‌గానే కనిపిస్తున్నా స్టైలిష్ లుక్‌లో ఆకట్టుకుంటున్నారు. సిద్ధు టైటిల్ రోల్లో నటిస్తోన్న ఈ మూవీపై ఆడియెన్స్‌లో మంచి అంచనాలున్నాయి. ఫన్ రైడర్‌లా అందరినీ మెప్పించే కథాంశంతో ఈ చిత్రం మన ముందుకు రానుంది. బేబి ఫేమ్ వైష్ణవి చైతన్య ఇందులో హీరోయిన్గా నటిస్తుంది.
ఇంకా ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, నరేష్, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రల్లో మెప్పించనున్నారు. అచ్చు రాజమణి సంగీత సారథ్యం వహిస్తున్నారు. క్రాక్గాడుగా కనిపించే జాక్ పాత్రలో సిద్ధుజొన్నలగడ్డ ప్రేక్షకులను మెప్పించటం ఖాయం.