
Intense & Thrilling Teaser Of O.. Cheliya Launched by Hero Srikanth
“O.. Cheliya” is an upcoming romantic drama being produced by Rupasri Kopuru under the banners of SRS Movie Creations and Indira Devi Productions. Naga Pranav, Kaveri Karnika, and Aadhya Reddy played the lead roles in the film written and directed by M. Naga Rajasekhar Reddy. Earlier, Rocking Star Manchu Manoj unveiled the film’s first single which garnered superb response.
Today, family star Srikanth launched the teaser of the movie. “I am very happy and honored to be a part of this event and to launch the teaser for the film, “O.. Cheliya.” I want to thank the entire team for inviting me. I have a special connection with music director. He has previously composed music for my films and has always been a strong supporter. I am thrilled to see him support this new project as well. This is a wonderful, young team, and I wish them all the best. Our hero, Naga Pranav, and our heroine, Kaveri, have done a fantastic job. The film is a triangle love story with an interesting plot that includes a spiritual angle, which makes the subject very intriguing. I’ve had a chance to see the teaser, and it’s looking great. I also want to congratulate the team on the wonderful response to their first song. I wish the entire team, the producer, the director, and all the cast and crew, the very best for the success of this film,” *said Hero Srikanth* .
In addition to presenting an earnest triangular love story, the teaser also hints at the film’s darker and more intense conflict. Ajay Ghosh appears in a striking and unsettling role as a self-styled godman, who engages in illicit activities under the guise of spirituality. He is seen manipulating and exploiting vulnerable women who seek refuge in his ashram. However, the teaser suggests that there’s much more beneath the surface, layers of secrets, deception, and unexpected twists that add depth and intrigue to the narrative.
The cinematography is by Suresh Bala and music by MM Kumar rightly complement the narrative. The editing is handled by Upendra. The teaser has certainly generated enthusiasm for the movie getting ready for release.
*హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా ‘ఓ.. చెలియా’ టీజర్ విడుదల*
ఎస్ఆర్ఎస్ మూవీ క్రియేషన్స్, ఇందిరా దేవీ ప్రొడక్షన్స్ బ్యానర్ల మీద రూపాశ్రీ కొపురు నిర్మిస్తున్న చిత్రం ‘ఓ.. చెలియా’. నాగ ప్రణవ్, కావేరి కర్ణిక, ఆద్య రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీకి కథ, కథనం, దర్శకత్వ బాధ్యతల్ని ఎం. నాగ రాజశేఖర్ రెడ్డి నిర్వర్తిస్తున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన పోస్టర్లు, గ్లింప్స్, సాంగ్స్ ఇలా అన్నీ కూడా జనాల్లోకి బాగానే రీచ్ అయ్యాయి. రీసెంట్గా రాకింగ్ స్టార్ మంచు మనోజ్ చేతుల మీద ‘ఓ.. చెలియా’ నుంచి ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేయడం, అది వైరల్ అవ్వడం అందరికీ తెలిసిందే.
ఇక తాజాగా ‘ఓ.. చెలియా’ నుంచి టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్‌ను హీరో శ్రీకాంత్ రిలీజ్ చేసి చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. టీజర్ రిలీజ్ చేసిన అనంతరం శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘‘ఓ చెలియా’ మూవీ టీజర్‌ను లాంఛ్ చేశాను. నాకు టీజర్ చాలా నచ్చింది. యంగ్ టీం అంతా కలిసి ఈ మూవీని తెరకెక్కించినట్టుగా కనిపిస్తోంది. దర్శక, నిర్మాతలకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.
‘ఓ.. చెలియా’ టీజర్‌ను గమనిస్తుంటే.. హారర్, లవ్, యాక్షన్ జానర్లను మిక్స్ చేసినట్టుగా కనిపిస్తోంది. భయపెట్టించే అంశాలు చాలానే ఉన్నాయని అర్థం అవుతోంది. ఇక ఈ హారర్ కాన్సెప్ట్‌లో చేసిన ఈ ప్రేమ కథ ఏంటి? మధ్యలోకి ఈ దెయ్యాల కాన్సెప్ట్ ఎలా వచ్చింది? అన్న ఆసక్తికరమైన అంశాలతో ఉత్కంఠభరితంగా ఈ మూవీని తెరకెక్కించారని తెలుస్తోంది.
ఈ టీజర్లో సురేష్ బాలా కెమెరా వర్క్, ఎంఎం కుమార్ ఆర్ఆర్ హైలెట్ అవుతోంది. ఈ చిత్రానికి ఉపేంద్ర ఎడిటర్‌గా పని చేశారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.