
Icon Star Allu Arjun Fans Association (AAFA) has come forward to support the HPV vaccination drive
The Allu Arjun Fans Association has stepped forward to support the HPV vaccination drive. Inspired by the words of Icon Star Allu Arjun, who encourages doing at least one good deed every year, AAFA has taken up this initiative. The association plans to conduct awareness programs throughout the year to educate people about the importance of the HPV vaccine.
By taking the HPV vaccine, young girls can be protected from Cervical Cancer and lead healthier lives. Girls and women between the ages of 9 and 26 can receive this vaccine free of cost through government hospitals. As part of the central government’s “Swasth Nari Viksit Bharat” program, the vaccine is being provided free of charge to girls and women across the country.
It is commendable that AAFA has chosen to support such a meaningful social cause on the occasion of Allu Arjun’s birthday on April 8th. This initiative will inspire other fandoms to serve the public.
హెచ్ పీవీ వ్యాక్సిన్ డ్రైవ్ కు మద్ధతుగా నిలిచేందుకు ముందుకొచ్చిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA)
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) హెచ్ పీవీ వ్యాక్సిన్ డ్రైవ్ కు మద్ధతుగా నిలిచేందుకు ముందుకొచ్చింది. AAFA ఈ ఏడాది మొత్తం ప్రజల్లో హెచ్ పీవీ వ్యాక్సిన్ పై అవగాహన కార్యక్రమాలు చేయనుంది. ఏడాదికో మంచి పని చేయాలంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చెప్పిన మాటల్ని స్ఫూర్తిగా తీసుకుని AAFA ఈ ఇనిషేటివ్ తీసుకుంది. హెచ్ పీవీ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా మన ఆడ బిడ్డలు సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతారు.
9 నుంచి 26 ఏళ్ల వయసున్న బాలికలు, మహిళలు ఈ వ్యాక్సిన్ ను ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా ఉచితంగా తీసుకోవచ్చు. కేంద్రప్రభుత్వం స్వస్తి నారీ వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా బాలికలకు, మహిళలకు ఉచితంగా హెచ్ పీవీ వ్యాక్సిన్ అందిస్తోంది. ఈనెల 8వ తేదీన అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి మంచి సామాజిక కార్యక్రమానికి ఫ్యాన్స్ అసోసియేషన్ ముందుకురావడం అభినందనీయం.
