Women are getting emotional after watching The Girlfriend – Allu

English Dubbing Version of Kanthara Chapter 1 to Release in Theaters from October 31st
ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్తో విడుదలౌతున్న తొలి భారతీయ చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసిన రిషబ్ శెట్టి, హోంబలే ఫిల్మ్స్ కాంతార: చాప్టర్ 1- అక్టోబర్ 31న రిలీజ్
రిషబ్ శెట్టి బిగ్గెస్ట్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కాంతార: చాప్టర్ 1. ప్రఖ్యాత పాన్-ఇండియా నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 2న విడుదలైన అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొని ఘన విజయాన్ని అందుకుంది.
రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్ తో కొత్త బెంచ్ మార్క్ ని క్రియేట్ చేసింది. కాంతార: చాప్టర్ 1 విజువల్ వండర్ గా ప్రేక్షకులని మెస్మరైజ్ చేస్తోంది. ప్రేక్షకులు విమర్శకుల నుంచి అద్భుతమైన ప్రశంసలు అందుకుంది.
ఇప్పుడీ సినిమా మరో మైల్ స్టోన్ క్రియేట్ చేసింది. ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్తో విడుదలౌతున్న తొలి భారతీయ చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. అక్టోబర్ 31న ఇంగ్లీష్ వెర్షన్ వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది.
లేటెస్ట్ వెర్షన్ లో రన్ టైం తగ్గించారు. 2 గంటలు, 45 నిమిషాలు 40 సెకన్లు రన్ టైం వుంటుంది.
కాంతార: చాప్టర్ 1 తెలుగులో 100 కోట్లు కలెక్ట్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 800 కోట్లు కలెక్ట్ చేసింది. కన్నడ బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచింది. అన్ని భాషల్లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.
పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కాంతరకి ప్రీక్వెల్గా వచ్చిన కాంతార: చాప్టర్ 1 ప్రస్తుతం బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టిస్తూ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.
